E-Paper
Advertisement

TIMS Hospital: వివాదాలకు కేరాఫ్‌గా మారుతున్న సనత్ నగర్ టిమ్స్ హస్పిటల్!

TIMS Hospital: వివాదాలకు కేరాఫ్‌గా మారుతున్న సనత్ నగర్ టిమ్స్ హస్పిటల్!
Advertisement

TIMS Hospital: స్వేఛ్చ బ్యూరో: ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్మిస్తున్న సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రి ఇప్పుడు వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ముఖ్యమంత్రి ఉగాది నాటికి ఆసుపత్రిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని డెడ్ లైన్ విధించగా, క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం ఆందోళనకరంగా ఉన్నాయి. ముఖ్యంగా వైద్య పరికరాల కొనుగోలులో క్వాలిటీ లేదని నేరుగా హెల్త్ సెక్రటరీకి ఫిర్యాదులు అందినట్లు సమాచారం. సెంట్రల్ స్టెరైల్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్, మార్ట్యురీ వంటి కీలక విభాగాల్లో నాణ్యత లేని పరికరాలను అమర్చుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ టెండర్ పత్రాల్లో స్పష్టంగా పేర్కొన్నప్పటికీ, బ్రాండెడ్ కంపెనీలను పక్కన పెట్టి, స్థానిక, గుర్తింపు లేని సంస్థల నుండి పరికరాలను సేకరించినట్లు తెలుస్తోంది. నాణ్యత తక్కువగా ఉండటంతో డీఎంఈ విభాగాపు అధికారులు కూడా ఈ పరికరాల అనుమతిని తిరస్కరించినట్లు తెలుస్తున్నది

మేఘా ఒత్తిడి.. ఆఫీసర్ల పట్టు!

​ప్రాజెక్ట్ నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్న మేఘా ఇంజనీరింగ్ సంస్థ, పనులు పూర్తి కాకుండానే ఆసుపత్రిని హ్యాండ్ ఓవర్ (అప్పగించడం) చేసుకోవాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తున్నది. ​అయితే, క్షేత్రస్థాయి అధికారులు మాత్రం దీనికి ససేమిరా అంటున్నారు.”పూర్తి స్థాయిలో పనులు పూర్తికాకుండా, పరికరాల నాణ్యత పరీక్షించకుండా బాధ్యతలు స్వీకరించడం సాధ్యం కాదు” అని ఆఫీసర్లు తేల్చి చెబుతున్నారు. దీంతో సీఎంవో నుంచి కూడా ఆదేశాలు ఇప్పించేలా మెఘా సంస్థ ప్రయత్నిస్తున్నట్లు వైద్యవర్గాల్లో చర్చ జరుగుతున్నది. వాస్తవానికి వైద్య పరికరాల కొనుగోలు సాధారణంగా మెడికల్ విభాగం, మెడికల్ కార్పొరేషన్ పర్యవేక్షణలో జరగాలి. కానీ, ఇక్కడ సివిల్ ప్రొక్యూర్మెంట్ టీమ్ తో కలిసి కొందరు సరఫరాదారులు నిబంధనలకు విరుద్ధంగా తక్కువ ధరకే నాణ్యత లేని పరికరాలను అంటగడుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. పైగా బ్రాండ్ మార్పుల విషయంలో డీఎంఈ అనుమతి తీసుకోకపోవడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది.

Advertisement

Also Read: Hyderabad Old City: హైదరాబాద్ పాతబస్తీలో గ్యాంగ్ వార్..ఓ వ్యక్తిపై కత్తితో దాడి, పరారీలో అసద్ గ్యాంగ్

ఉగాది టార్గెట్.. ఆందోళనలో రోగుల భద్రత!

​ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉగాది నాటికి టిమ్స్ ను ప్రారంభించాలని పట్టుదలతో ఉన్నారు. అయితే, ప్రారంభోత్సవ హడావిడిలో నాణ్యతను విస్మరిస్తే భవిష్యత్తులో రోగుల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. స్టెరిలైజేషన్ వంటి విభాగాల్లో నాణ్యత లేని పరికరాలు వాడితే ఇన్ఫెక్షన్లు పెరిగి ప్రాణనష్టం సంభవించే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.టిమ్స్ ఎక్విప్ మెంట్ క్వాలిటీపై ప్రభుత్వం వెంటనే ఒక ఉన్నత స్థాయి విచారణ కమిటీని నియమించాల్సిన అవసరం ఉంది.

సనత్ నగర్ కీలకం..

Advertisement

సనత్ నగర్ కార్డియాలజీ ఎక్స్ క్లూజీవ్ హాస్పిటల్ ను వంద శాతం పెయిడ్ సర్వీసులు అమలు చేయనుండగా, ఎల్ బీనగర్, అల్వాల్ టిమ్స్ లలో 35–65 శాతం రేషియోలో పెయిడ్ సర్వీస్ లను అందించనున్నారు. ఒక్కో దవాఖానలో వెయ్యి పడకలు ఉండగా, సనత్ నగర్ మినహాయిస్తే, మిగతా రెండింటిలోనూ ఈ విధానం కొనసాగనున్నది. అల్వాల్ టిమ్స్ లోని వెయ్యి పడకల్లో 350 కుత్బుల్లాపూర్ మెడికల్ కాలేజీకి అటాచ్ చేయనుండగా, మిగతా 650 బెడ్లలో పెయిడ్ సర్వీస్ లు అందించనున్నారు. అదే విధంగా ఎల్ బీ నగర్ కొత్తపేట్ టిమ్స్ లో 350 మహేశ్వరం మెడికల్ కాలేజీకి అటాచ్ చేస్తుండగా, మిగతా 650 బెడ్లలో పేమెంట్ విధానంలో ట్రీట్మెంట్ అందించనున్నారు. ఈ దవాఖానల్లోకి ప్రవేశంచగానే లెప్ట్ వైపు పెయిడ్ సర్వీస్ లు ఉండగా, రైట్ కు మెడికల్ కాలేజీ ఆధ్వర్యంలో సేవలు అందిస్తారు. ఈ రెండు విభాగాలకు వేర్వేరుగా స్టాఫ్​ పనిచేయనున్నారు. ఈ నేపథ్యంలో క్వాలిటీ ఎక్విప్ మెంట్లు వినియోగించాల్సిన అవసరం ఉన్నదని స్వయంగా ఆఫీసర్లే ఆఫ్​ ది రికార్డులో పేర్కొంటున్నారు.

Also Read: Toyota Highlander EV2027: కళ్లు చెదిరేలా టయోటా హైలాండర్ EV 2027, ఈ కారు ప్రత్యేకతలు ఏంటో తెలుసా భయ్యా!

Related News

ఎండిపోతున్న ప్రాజెక్టులు.. హైదరాబాద్‌కు తగ్గిన నీటి సరఫరా.. రాబోయే రోజుల్లో తిప్పలు తప్పవా?

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Big Stories

Advertisement
×