E-Paper
Advertisement

Jofra Archer gold chain: డ‌బ్బులు లేక‌.. గోల్డ్ చైన్లు అమ్ముకున్న జోఫ్రా ఆర్చ‌ర్, ఎన్ని తులాలంటే ?

Jofra Archer gold chain: డ‌బ్బులు లేక‌.. గోల్డ్ చైన్లు అమ్ముకున్న జోఫ్రా ఆర్చ‌ర్, ఎన్ని తులాలంటే ?
Advertisement

Jofra Archer gold chain: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ చాలా ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ఈ టోర్నమెంట్ మరో 15 రోజులలో ఫినిష్ కూడా కానుంది. అయితే ఇప్పటివరకు ప్లే ఆఫ్స్ చేరే జట్లు ఫైనల్ కాలేదు. మరో నాలుగు రోజులు గడుస్తే తప్ప, క్లారిటీ రాదు. ఇలాంటి క్రమంలో ప్లే ఆఫ్స్ కోసం రాజస్థాన్ రాయల్స్ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. రేపు ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ కూడా ఆడనుంది రాజస్థాన్ రాయల్స్. అయితే ఇలాంటి నేపథ్యంలో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు జోఫ్రా ఆర్చర్ తన బంగారు గొలుసులను సందీప్ శర్మకు అమ్మేసినట్లు సోషల్ మీడియాలో వీడియో వైరల్ గా మారింది. ఆర్చర్ ధరించాల్సిన చైన్లు సందీప్ శర్మ వేసుకున్న నేపథ్యంలో డబ్బుల కోసం అమ్మేశాడంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

Also Read: రాజీవ్ శుక్లా భాగోతం బ‌య‌ట‌పెట్టిన ల‌లిత్ మోడీ…ఐపీఎల్ లో ఛాన్స్ ఇస్తామ‌ని డ‌బ్బులు వ‌సూళ్లు, ప్రైవేట్ వీడియోలు చూపించి !

గోల్డ్ చైన్లు అమ్మేసుకున్న జోఫ్రా ఆర్చర్.. ఎన్ని తులాలంటే ?

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు తరఫున ఆడుతున్న జోఫ్రా ఆర్చర్ నిత్యం బంగారు గొలుసులు వేసుకొని మెరుస్తాడన్న సంగతి తెలిసిందే. దాదాపు 50 తులాలు ఉన్న రెండు చైన్లను ఎప్పుడు తన మెడలోనే వేసుకుంటూ ఉంటాడు. పాకిస్తాన్ లో ఎక్కడికి వెళ్లినా గోల్డ్ చైన్లతోనే మ్యాచ్ ఆడతాడు ఆర్చర్. ప్రస్తుతం ఐపీఎల్ సందర్భంగా కూడా అలాగే ఆడుతున్నాడు. అయితే రేపు ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ అరుణ్ జైట్లీ వేదికగా జరగనుంది. ఇలాంటి క్రమంలో జోఫ్రా ఆర్చర్ గోల్డ్ చైన్లను రాజస్థాన్ బౌలర్ సందీప్ శర్మ ధరించాడు. ఈ వీడియో బయటకు వచ్చింది.

దీంతో తన చైన్లను సందీప్ శర్మకు అమ్మేశాడని జోఫ్రా ఆర్చర్ పై దారుణంగా ట్రోల్స్ జరుగుతున్నాయి. ఇంగ్లాండ్ వెళ్ళేందుకు డబ్బులు లేక ఆర్చర్ అమ్మేశాడని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. అయితే మరికొంతమంది డిఫరెంట్ గా రియాక్ట్ అవుతున్నారు. తన దగ్గర కోట్లలో డబ్బులు ఉన్నాయని.. సందీప్ శర్మకు గోల్డ్ చైన్లు గిఫ్ట్ గా ఇచ్చాడని రియాక్ట్ అవుతున్నారు. వాస్తవం ఏంటంటే.. రాజస్థాన్ రాయల్స్ ప్రాక్టీస్ చేస్తున్న క్రమంలో తన చైన్లను సందీప్ శర్మకు ఇచ్చాడు ఆర్చర్. అయితే వాటిని చేతిలో పట్టుకోకుండా మెడలో వేసుకొని బిల్డప్ కొట్టాడు సందీప్ శర్మ. ఈ వీడియో వైరల్ అయిన నేపథ్యంలో సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి.

రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్ చేయాలంటే ఎలా?

Advertisement

ఇప్పటివరకు 11 మ్యాచ్లు ఆడిన రాజస్థాన్ రాయల్స్ మరో మూడు ఆడాల్సి ఉంది. ఈ మూడింటిలో కచ్చితంగా గెలిస్తేనే ప్లే ఆఫ్స్ చేరనుంది రాజస్థాన్ రాయల్స్. ఇందులో ఒక్కటి ఓడిన ఇంటిదారి పట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే నిన్న లక్నో చేతిలో చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోవడం రాజస్థాన్ రాయల్స్ కలిసి వచ్చే అంశం. మరి రాజస్థాన్ రాయల్స్ మునుముందు జరిగే మ్యాచ్ ల్లో ఎలా ఆడుతుందో చూడాలి.

Also Read: జాకబ్ బెథెల్ గోల్డ్ చైన్ దొంగిలించిన RCB ఫ్యాన్స్ ? పాకిస్తాన్ వెధ‌వ‌ల్లాగా త‌యారు అవుతున్నారంటూ ట్రోల్స్!

 

Related News

విండీస్, టీమిండియా మ్యాచ్ రద్దు… వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారంటూ తన్వీర్ అహ్మద్ కామెంట్!

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

ఇస్లామాబాద్ లో హై టెన్ష‌న్‌…ఇంగ్లాండ్ క్రికెట‌ర్లు బ‌స చేస్తున్న హోట‌ల్ ద‌గ్గ‌ర భారీ బ్లాస్ట్ !

ప్రీతి జింటా లాగా సొట్ట బుగ్గలేసుకుని, వీడేం వికెట్ కీపింగ్ చేస్తాడురా నాయ‌నా ?

పాకిస్తాన్ అంటేనే ఎగిరెగిరి ప‌డ‌తారు, కానీ సిగ్గు లేకుండా మాతో మ్యాచ్ లు ఆడ‌తారు!

ద‌రిద్రుడు అగార్క‌ర్ పోయినా రాత మార‌లేదే…ష‌మీ, భువీల‌ను న‌ట్టేట ముంచారు క‌ద‌రా?

విండీస్ పై చివ‌రి మ్యాచ్ ఆడేశాడు…ఇక ర‌వీంద్ర జ‌డేజా రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే

Big Stories

Advertisement
×