E-Paper
Advertisement

థియేటర్లలో పాటు ఓటీటీలను షేక్ చేసిన దమ్మున్న సినిమాలు… వీటి క్లైమాక్స్ తో పూనకాలు పక్కా

థియేటర్లలో పాటు ఓటీటీలను షేక్ చేసిన దమ్మున్న సినిమాలు… వీటి క్లైమాక్స్ తో పూనకాలు పక్కా
Advertisement

Best hollywood movies on OTT : బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వేటతో పాటు, ఓటీటీ స్క్రీన్లపై కూడా వ్యూయర్షిప్‌తో దడదడలాడించిన కొన్ని సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాలు చూస్తున్నంత సేపు ఒక ఎత్తు, వీటి క్లైమాక్స్ సీన్లు చూసేటప్పుడు వచ్చే పూనకాలు ఇంకో ఎత్తు. స్క్రీన్ ముందట కూర్చుంటే సీట్ ఎడ్జ్‌కి వచ్చేయడం గ్యారెంటీ. అస్సలు మిస్ అవ్వకూడని ఆ అల్టిమేట్ సినిమాలపై ఓ లుక్ వేద్దాం. అవి ఏ ఓటీటీలో ఉన్నాయో కూడా ఇప్పుడు తెలుసుకుందాం.

1. ది అవెంజర్స్ (The Avengers – 2012)

మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లోనే ఇదొక ట్రెండ్ సెట్టర్. లోకీ ఆర్మీ భూమి మీదకు దండెత్తి వచ్చినప్పుడు, సూపర్ హీరోలంతా కలిసి న్యూయార్క్ సిటీలో చేసే ఫైట్ మామూలుగా ఉండదు. అందరూ ఒకే ఫ్రేమ్‌లోకి వచ్చి రౌండ్‌గా నిలబడే సీన్‌కి థియేటర్లలో రచ్చ లేచింది. ఆ క్లైమాక్స్ బ్యాటిల్ హాలీవుడ్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్షన్ సీక్వెన్స్ గా నిలిచింది. జియో హాట్‌స్టార్ (Jio Hotstar)లో ఇది అందుబాటులో ఉంది.

2. ది డార్క్ నైట్ (The Dark Knight – 2008)

Advertisement

క్రిస్టోఫర్ నోలన్ తీసిన ఈ సినిమా ఒక మాస్టర్ పీస్. జోకర్ క్యారెక్టర్‌లో హీత్ లెడ్జర్ యాక్టింగ్ చూస్తే గూస్‌బంప్స్ రావడం ఖాయం. పగ, ప్రతీకారం, మైండ్ గేమ్స్‌తో నడిచే క్లైమాక్స్ సీన్ ఊపిరి సలపనివ్వదు. బ్యాట్‌మ్యాన్ చేసే యాక్షన్ సీన్స్ సినిమాను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లాయి. దీనిని నెట్‌ఫ్లిక్స్, జియో హాట్స్టార్ లో చూడవచ్చు.

3. మ్యాడ్ మ్యాక్స్: ఫ్యూరీ రోడ్ (Mad Max: Fury Road – 2015)

ఈ సినిమా ఒక నాన్‌స్టాప్ యాక్షన్ విజువల్ వండర్. ఎడారిలో కార్లు, బైకులతో చేసే చేజింగ్ సీన్లు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ థియేటర్లని ఊపేశాయి. క్లైమాక్స్‌లో వచ్చే ఆ హైవే ఫైట్ చూస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది. జియో హాట్ స్టార్, ప్రైమ్ వీడియోలో ఇది అందుబాటులో ఉంది.

4. మిషన్: ఇంపాజిబుల్ – ఫాల్అవుట్ (Mission: Impossible – Fallout – 2018)

Advertisement

టామ్ క్రూజ్ అంటేనే ప్రాణాలకు తెగించి స్టంట్స్ చేసే హీరో. ఈ సినిమాలో హెలికాప్టర్ చేజింగ్ సీన్ క్లైమాక్స్‌లో వస్తుంది. కొండల మధ్య టామ్ క్రూజ్ చేసే ఆ ఫైట్ చూస్తే గుండె ఆగినంత పనవుతుంది. గ్రాఫిక్స్ లేకుండా రియల్‌గా చేసిన ఆ స్టంట్స్ ఓటీటీలో చూసినా నరాలు తెగే ఉత్కంఠ కలిగిస్తాయి. ఇది ప్రైమ్ వీడియో (Prime Video), నెట్‌ఫ్లిక్స్ (Netflix)ఓటీటీలలో అందుబాటులో ఉంది.

5. టైటానిక్ (Titanic – 1997)

ఇదొక ఎమోషనల్ ఎపిక్. ఓడ మునిగిపోయే ఆ చివరి గంట విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గుండెల్ని పిండేస్తాయి. జాక్, రోజ్ లవ్ స్టోరీ ముగింపు థియేటర్లలో అందరితో కన్నీళ్లు పెట్టించింది. ఎన్నిసార్లు చూసినా ఆ క్లైమాక్స్ ఎమోషన్ అస్సలు తగ్గదు. దీనిని జియో హాట్‌స్టార్ లో చూడవచ్చు.

6. ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది టూ టవర్స్ (The Lord of the Rings: The Two Towers – 2002)

ఈ సినిమాలో వచ్చే క్లైమాక్స్ సీన్ హాలీవుడ్ హిస్టరీలోనే అత్యంత గొప్ప వార్ సీక్వెన్స్‌గా నిలిచిపోయింది. వేల సంఖ్యలో రాక్షస మూకలు కోటపై దాడి చేయడం, గాండాల్ఫ్ గుర్రంపై హీరోలా ఎంట్రీ ఇచ్చే సీన్‌కి థియేటర్లలో పూనకాలు వచ్చేశాయి. ప్రైమ్ వీడియో (Prime Video)లో దీనిని చూడచ్చు. వీటన్నిటిని హోమ్ థియేటర్లలో సౌండ్ పెట్టి చూస్తే ఆ కిక్కే వేరు. ఈ సినిమాలు ఇప్పటివరకు చూడకపోతే మాత్రం మీ లైఫ్‌లో పెద్ద విజువల్ ట్రీట్‌ని మిస్ అయినట్టే.

Read Also : ఓటీటీలో మతి పోగొడుతున్న క్రైమ్ థ్రిల్లర్ ఇన్వెస్టిగేషన్ సిరీస్ లు… వీటిని చూస్తే వీకెండ్ క్రేజీగా

Related News

అల్లరి నరేష్ రంభ ఊర్వశి మేనక ఓటీటీ పార్టనర్ లాక్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కోర్టు రూమ్‌లోనే జడ్జ్‌కి మైండ్ బ్లాకింగ్ ఛాలెంజ్… క్షణక్షణం సీట్ ఎడ్జ్ మైండ్ గేమ్‌లున్న ఈ లీగల్ డ్రామా తెలుగులోనే

ఆకాశంలోనే మిస్సయిన భారీ విమానం… దిమ్మతిరిగే మిలిటరీ ఇన్వెస్టిగేషన్

చిన్నతనంలోనే ప్రపంచాన్ని చుట్టేసిన కుర్రాడి అడ్వెంచర్స్… కళ్ళు ఆర్పకుండా చూసే రియల్ డాక్యుమెంటరీ

నిధి వేట… దెయ్యాలతో ఆట… హారర్ ట్విస్ట్‌తో వస్తున్న వందల కోట్ల నవ్వుల ఫ్రాంచైజీ

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

Big Stories

Advertisement
×