E-Paper
Advertisement

క‌న్నీళ్లు పెట్టుకున్న సంజీవ్ గోయెంకా…ముకుల్ చౌదరికి రూ.4.10 కోట్ల కారు గిఫ్ట్ !

క‌న్నీళ్లు పెట్టుకున్న సంజీవ్ గోయెంకా…ముకుల్ చౌదరికి రూ.4.10 కోట్ల కారు గిఫ్ట్ !
Advertisement

Goenka-Mukul Chaudhary:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) రోజు రోజుకు ఇంట్రెస్టింగ్ గా మారుతోంది. మొదట్లో మ్యాచ్ లు అన్నీ కూడా వన్ సైడ్ జరగగా, ఇప్పుడు నువ్వా – నేనా అన్నట్లుగా కొనసాగుతున్నాయి. ఇక నిన్న లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ కేకేఆర్ ( Kolkata Knight Riders vs Lucknow Super Giants) మధ్య కూడా ఆసక్తికర ఫైట్ జరిగింది. ఇందులో అదరగొట్టిన లక్నో, చివరి బంతికి విజయం సాధించింది. లక్నో సూపర్ జెయింట్స్ కుర్రాడు ముకుల్ చౌదరి ( Mukul Chaudhary) అద్భుతమైన బ్యాటింగ్ తో జట్టును గెలిపించాడు. 54 పరుగులు చేసిన ముకుల్ చౌద‌రి, చివరి వరకు ఉండి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. ఈ క్రమంలో ముకుల్ చౌదరిని చూసి ఎమోషనల్ అయిన సంజీవ్ గోయెంకా ( Sanjiv Goenka), నాలుగు కోట్ల కారు గిఫ్ట్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు ఫోటోలు అలాగే వీడియోలు వైరల్ అవుతున్నాయి.

Also Read: Mukul Choudhary: ల‌క్నోలో మ‌రో ధోని, హెలిక్యాప్ట‌ర్ కొట్టి కేకేఆర్ ను చిత్తు చేశాడు..ఎవ‌రీ ముకుల్ చౌదరి

ముకుల్ చౌదరికి నాలుగు కోట్ల మెస్సిడేస్ కారు గిఫ్ట్

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్లో ( Indian Premier League 2026 Tournament) భాగంగా నిన్న కేకేఆర్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరిగింది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ రెండు జట్లు తలపడ్డాయి. ఇందులో మొదటి బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 181 పరుగులు సాధించింది. ఇక ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో లక్నో సూపర్ జెయింట్స్ తడబడిన సంగతి తెలిసిందే. కాని చివరి వరకు ఆడి విక్టరీ అందుకుంది లక్నో. ముఖ్యంగా ముకుల్ చౌదరి 27 బంతుల్లో 54 పరుగులు చేసి, లక్నో సూపర్ జెయింట్స్ కు ఊపిరి పోసాడు. ఇందులో ఏడు సిక్సర్లు అలాగే రెండు బౌండరీలు ఉన్నాయి.

మహేంద్ర సింగ్ ధోని ( Ms Dhoni) తరహాలోనే బ్యాటింగ్ చేసి లక్నో సూపర్ జెయింట్స్ కు విక్టరీ అందించాడు. దీంతో నిన్న రాత్రి నుంచి ముకుల్ చౌదరి పేరు మారుమోగుతోంది. అయితే మ్యాచ్ గెలిచిన తర్వాత ముకుల్ చౌదరిని హగ్ చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకా ( Sanjiv Goenka). గ్రేట్ బ్యాటింగ్ అంటూ మెచ్చుకున్నారు. అంతేకాదు తన తరఫున అదిరిపోయే గిఫ్ట్ సంజీవ్ గోయెంకా ప్రకటించినట్లు తెలుస్తోంది. మెర్సిడెస్ బెంజ్ మేబ్యాక్ GLS ( Mercedes Benz Maybach GLS) గిఫ్ట్ గా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉండ‌గా, ముకుల్ చౌద‌రి రాజ‌స్థాన్ రాష్ట్రానికి చెందిన వాడు. ఇత‌న్ని మొన్న‌టి వేలంలో రూ.2.60 కోట్ల‌కు కొనుగోలు చేసింది. ఇత‌ను భారీ సిక్సులు కొట్ట‌గ‌ల‌డు. అందుకే తెలివిగా కొనుగోలు చేసింది ల‌క్నో.

Advertisement

Also Read: KKR VS LSG: అంతా ఫిక్సింగే..రెండు క్యాచ్ లు వివాదం, ఫిన్ అలెన్‌, ర‌హానే ఇద్ద‌రూ నాటౌటే !

 

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

Big Stories

Advertisement
×