E-Paper
Advertisement

Ishan Kishan vs Sanju Samson: సంజు వ‌ర్సెస్ ఇషాన్..టీ20 ప్ర‌పంచ క‌ప్ లో ఓపెన‌ర్ గా ఎవ‌రు బెస్ట్ ? ఇదిగో రికార్డులు

Ishan Kishan vs Sanju Samson: సంజు వ‌ర్సెస్ ఇషాన్..టీ20 ప్ర‌పంచ క‌ప్ లో ఓపెన‌ర్ గా ఎవ‌రు బెస్ట్ ? ఇదిగో రికార్డులు
Advertisement

Ishan Kishan vs Sanju Samson: టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026) దగ్గర పడుతున్న నేపథ్యంలో టీమిండియా కు కొత్త టెన్షన్ మొదలైంది. టీమిండియా ఓపెన‌ర్ గా ఎవరు బరిలోకి దిగుతారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగిన ఐదు టీ20 ల సిరీస్ లో సంజు శాంసన్ అత్యంత దారుణంగా విఫలమయ్యాడు. అతడు సరిగ్గా ఆడి ఉంటే టీమ్ ఇండియాకు ఏ టెన్షన్ ఉండకపోయేది. ఓపెనర్ గా సంజు శాంసన్ బరిలోకి దిగడమే కాకుండా వికెట్ కీపింగ్ బాధ్యతలు కూడా తీసుకునేవాడు. సంజు శాంసన్ ( Sanju Samson) అట్ట‌ర్ ఫ్లాఫ్ అయిన నేపథ్యంలో ఇషాన్ కిషన్ ను ఓపెనర్ గా బరిలోకి దింపుతారని చర్చ జరుగుతోంది. అదే జరిగితే మూడవ వికెట్ కు తిలక్ వర్మ బరిలోకి దిగుతాడు. ఇషాన్ కిషన్ వికెట్ కీపర్ గా ఉంటాడు. అప్పుడు సంజు శాంస‌న్‌ రెస్ట్ తీసుకోవాల్సిందే.

Also Read: RCB-Jacqueline Fernandez: శృంగార తార కోసం రూ.8300 కోట్లు..? జైలులో ఉన్న సుకేష్ సంచలన ఆఫర్

Ishan Kishan vs Sanju Samson ఓపెనర్ గా ఎవరు బెస్ట్ ?

Advertisement

టీమిండియా ఓపెనర్ గా సంజు శాంస‌న్‌ చాలా రోజులుగా విఫలమౌతూ వస్తున్నాడు. గడిచిన 11 మ్యాచ్ ల‌లో ఓపెనర్ గా బరిలోకి దిగిన సంజు శాంసన్, ఒక్క అర్థ సెంచరీ కూడా నమోదు చేయలేదు. మొన్నటి న్యూజిలాండ్ సిరీస్ లో 5 టీ20 లలో మొత్తం కలిపి 50 పరుగులు సాధించలేదు. అదే ఇషాన్ కిషన్.. మూడవ వికెట్ కు రావడమే కాకుండా ఓ సెంచరీ, మరో అర్థ సెంచరీ కూడా నమోదు చేసుకున్నాడు. అంతేకాదు ఇటీవల ఝార్ఖండ్ తరఫున కెప్టెన్ గా బరిలోకి దిగిన ఇషాన్ కిషన్, ఆ జట్టుకు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని కూడా అందించాడు. ఓపెనర్ గా కూడా అద్భుతంగా రాణించాడు. వీళ్ళ ఇద్దరి గత రికార్డులు పరిశీలిస్తే ఇషాన్ కిషన్ బెటర్ అనిపిస్తుంది.

అందరూ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లే

సంజు శాంసన్ ను కాదని ఇషాన్ కిషన్ ను ( Ishan Kishan) ఓపెనర్ గా బరిలోకి దించితే, టి20 ప్రపంచ కప్ ఆడే భారత జట్టులో అందరూ లెఫ్ట్ హ్యాండ‌ర్లే అవుతారు. ఓపెనర్ అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, మూడవ వికెట్ కు బరిలోకి దిగే తెలుగు కుర్రాడు తిలక్ వర్మ, శివమ్ దూబే, రింకు సింగ్, అక్షర్ పటేల్ ఇలా అందరూ లెఫ్ట్ హ్యాండర్లే ఉంటారు. కేవలం సూర్య కుమార్ యాదవ్ ఒక్కడే రైట్ హ్యాండ‌ర్‌ గా ఉంటాడు. ఇలా అయితే టీమిండియాకు దెబ్బే. అయితే సంజు శాంస‌న్‌ను తుది జట్టులో తీసుకుంటే.. అప్పుడు ఓపెనర్లు లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ లో బ్యాటింగ్ ఆర్డ‌ర్ ఉంటుంది. సంజు రైట్ హ్యాండ్ బ్యాటింగ్ చేస్తే.. అభిషేక్ శర్మ లెఫ్ట్ హ్యాండ్ అవుతాడు. ఆ తర్వాత సూర్య కుమార్ యాదవ్ లేదా తిలక్ వర్మ ఎవరు వచ్చినా పర్వాలేదు.

వికెట్ కీపింగ్ లో ఎవరు బెస్ట్

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటులో ఇషాన్ కిషన్ కంటే సంజు శాంసన్ బెస్ట్ వికెట్ కీపర్ అని అంటున్నారు. న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా మధ్య జరిగిన ఐదవ టి20 లో సంజు ను కాదని ఇషాన్ కిషన్ కు కీపింగ్ బాధ్యతలు ఇస్తే అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. సరిగ్గా క్యాచ్ లు కూడా పట్టలేదు. ఈ నేపథ్యంలో సంజు ఇస్ ది బెస్ట్ ఆప్షన్ ఫర్ ఇండియా అంటున్నారు. ప్రాథమిక స‌మాచారం ప్ర‌కారం సంజు శాంస‌న్ కు తుది జ‌ట్టులో ఛాన్స్ ఇచ్చే ఉంద‌ట‌.

Also Read: Ramiz Raja: ప్ర‌ధాని మోడీ క‌నుసైగ చేస్తే, పాకిస్తాన్ క్రికెట్ భూస్తాపిత‌మే..PCBని దేవుడు కూడా కాపాడ‌లేడు !

 

Related News

విండీస్, టీమిండియా మ్యాచ్ రద్దు… వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారంటూ తన్వీర్ అహ్మద్ కామెంట్!

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

ఇస్లామాబాద్ లో హై టెన్ష‌న్‌…ఇంగ్లాండ్ క్రికెట‌ర్లు బ‌స చేస్తున్న హోట‌ల్ ద‌గ్గ‌ర భారీ బ్లాస్ట్ !

ప్రీతి జింటా లాగా సొట్ట బుగ్గలేసుకుని, వీడేం వికెట్ కీపింగ్ చేస్తాడురా నాయ‌నా ?

పాకిస్తాన్ అంటేనే ఎగిరెగిరి ప‌డ‌తారు, కానీ సిగ్గు లేకుండా మాతో మ్యాచ్ లు ఆడ‌తారు!

ద‌రిద్రుడు అగార్క‌ర్ పోయినా రాత మార‌లేదే…ష‌మీ, భువీల‌ను న‌ట్టేట ముంచారు క‌ద‌రా?

విండీస్ పై చివ‌రి మ్యాచ్ ఆడేశాడు…ఇక ర‌వీంద్ర జ‌డేజా రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే

Big Stories

Advertisement
×