E-Paper
Advertisement

Viral Video: షాకింగ్ ఘటన.. లిఫ్ట్‌లో పేలిన బెలూన్స్.. అగ్నిగోళాన్ని తలపించేలా మంటలు!

Viral Video: షాకింగ్ ఘటన.. లిఫ్ట్‌లో పేలిన బెలూన్స్.. అగ్నిగోళాన్ని తలపించేలా మంటలు!
Advertisement

Viral Video: ముంబయిలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ భవనంలోని లిఫ్ట్ లో బెలూన్స్ పేలి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు లిఫ్ట్ లోని సీసీటీవీలో రికార్డు కాగా.. ప్రస్తుతం అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆ దృశ్యాలను చూసి నెటిజన్లు షాకవుతున్నారు.

లిఫ్ట్ లో బెలూన్స్ పేలిన ఘటన ఎప్పుడు, ఎక్కడ, ఏ ప్రాంతంలో జరిగిందన్న దానిపై స్పష్టత లేదు. అయితే వైరల్ అవుతున్న వీడియోను గమనిస్తే.. ముగ్గురు వ్యక్తులు లిఫ్ట్ లోనికి వచ్చారు. తొలుత మహిళ లోనికి రాగా.. ఆమెతో పాటు తెల్ల చొక్క ధరించిన వ్యక్తి బెలూన్లు నిండిన సంచితో అడుగుపెట్టాడు. ఆ తర్వాత బ్యాగ్ తగిలించుకున్న యువకుడు సైతం లిఫ్ట్ లోనికి ప్రవేశించాడు.

Advertisement

అయితే ముగ్గురూ లోనికి వచ్చిన కొన్ని సెకన్లకే ఓ వ్యక్తి చేతులోని బెలూన్స్ ఒక్కసారిగా పేలిపోయాయి. అందులోని గ్యాస్ మండిపోతూ అగ్నిగోళాన్ని తలిపించింది. దీంతో లిఫ్ట్ లోని ముగ్గురు వ్యక్తులు ప్రాణ భయంతో బయటకు పరుగులు పెట్టారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు. ఇద్దరు వ్యక్తులు గాయపడినట్లు తెలుస్తోంది. బెలూన్స్ తెచ్చిన వ్యక్తితో పాటు లిఫ్ట్ లోని మహిళకు కాలిన గాయాలు అయినట్లు సమాచారం.

Advertisement

Also Read: Oppo Find X8 Pro Discount: ఒప్పో టాప్ మోడల్ ఫోన్‌పై.. ఏకంగా రూ.19 వేల డిస్కౌంట్.. అస్సలు మిస్ చేసుకోవద్దు!

సాధారణంగా బెలూన్లలో హీలియం గ్యాస్ నింపుతుంటారు. అయితే వాటికి మండే గుణం ఉండదు. హైడ్రోజన్ వంటి గ్యాస్ కు మాత్రమే ఈ స్థాయిలో మండే గుణం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మరి సదరు వ్యక్తి.. బెలూన్లలో ఏ గ్యాస్ ను నింపుకొని వచ్చాడో తెలియాల్సి ఉంది. అదే సమయంలో బెలూన్స్ ఒక్కసారిగా పేలిపోవడానికి గల కారణాలపై కూడా స్పష్టత రావాల్సి ఉంది.

Also Read: Viral Video: మెట్రో స్టేషన్లలో అండర్‌వేర్ వెండింగ్ మెషిన్స్.. ఇదెప్పుడు నుంచి మామ?

Related News

ఇది సాహసమా లేక పిచ్చి తనమా.. కేరళ వరద నీటిలో థార్ జీపుతో డేంజర్ స్టంట్స్!

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

Big Stories

Advertisement
×