RCB-Jacqueline Fernandez: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) మరికొన్ని రోజుల్లోనే ప్రారంభం కానుంది. మార్చి 26వ తేదీ నుంచి ఈ మెగా టోర్నమెంట్ ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. అయితే ఇటు టోర్నమెంట్ ప్రారంభం కాకముందే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కొత్త ఓనర్ రాబోతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ జట్టును కొనుగోలు చేసేందుకు చాలా మంది పోటీ పడుతున్నారట. విరాట్ కోహ్లీ భార్యతో సహా అంబానీ చిన్న కుమారుడు, అదానీ ఇలా చాలా మంది క్యూ కట్టినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇలాంటి నేపథ్యంలోనే ప్రస్తుతం జైలులో ఉన్న సుఖేశ్ చంద్రశేఖర్ కూడా రాయల్ చాలెంజెస్ బెంగళూరు జట్టుపై ( Royal Challengers Bangalore team ) కన్ను వేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ జట్టును రూ.8300 కోట్లకు కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యాడట. ఈ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును ( Royal Challengers Bangalore team ) విక్రయించేందుకు చాలా మంది పోటీ పడుతున్నారు. రాయల్స్ చాలెంజర్ బెంగళూరు జట్టును సొంతం చేసుకోవాలంటే దాదాపు 17వేల కోట్లు అవసరం. అయితే ఇందులో సింగిల్ పేమెంట్ 8300 కోట్లు రూపాయలను ఇచ్చి బెంగళూరు జట్టు సగం ఓనర్షిప్ కొనుగోలు చేసేందుకు జైలులో ఉన్న సుఖేశ్ చంద్రశేఖర్ నిర్ణయం తీసుకున్నారట. ఈ మేరకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు యాజమాన్యానికి కూడా సమాచారం ఇచ్చినట్లు చెబుతున్నారు. సగం ఓనర్ షిప్ కోసం ఈ రూ.8300 కోట్లను వారం రోజుల్లోనే సింగిల్ పేమెంట్ గా చెల్లిస్తానని కూడా ఆఫర్ ఇచ్చాడట. ఆ తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( Royal Challengers Bangalore team ) ఓనర్గా తన ప్రియురాలు జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ను చేయనున్నారట. ప్రియురాలి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కు ( Jacqueline Fernandez ) గిఫ్ట్ ఇచ్చేందుకు గాను ఈ నిర్ణయం తీసుకున్నారట. ఎప్పటి నుంచో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ను జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఇష్టపడుతున్నారని సమాచారం. అందుకే ఆమె కోసం ఈ మేర ఖర్చు చేస్తున్నారట సుకేశ్ చంద్రశేఖర్.
ప్రస్తుతం జైలులోనే సుఖేశ్ చంద్రశేఖర్ ( Sukesh Chandrasekhar ) ఉన్న సంగతి తెలిసిందే. చాలా ఆర్థిక నేరాలు ఆరోపణల నేపథ్యంలో అతన్ని అరెస్టు చేశారు పోలీసులు. జైలులో ఉన్న సుఖేశ్ చంద్రశేఖర్… ఢిల్లీ లిక్కర్ స్కాం పైన ( Delhi Liquor Scam) చాలా సార్లు స్పందించారు. కవితకు ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధం ఉన్నట్లు అప్పట్లో సుఖేశ్ చంద్రశేఖర్ లేఖలు కూడా రాశారు.