E-Paper
Advertisement

Varanasi Cricket stadium: మోదీనా మజాకా.. హిందుత్వం ఉట్టిపడేలా క్రికెట్ స్టేడియం.. గ్రౌండ్ మొత్తం ఇక శివతాండవమే

Varanasi Cricket stadium: మోదీనా మజాకా.. హిందుత్వం ఉట్టిపడేలా క్రికెట్ స్టేడియం.. గ్రౌండ్ మొత్తం ఇక శివతాండవమే
Advertisement

Varanasi Cricket stadium: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వారణాసిలో ప్రధాని నరేంద్ర మోడీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి శంకుస్థాపన చేసి రెండు సంవత్సరాలు దాటింది. 2023 సెప్టెంబర్ 23న ఈ అంతర్జాతీయ క్రికెట్ మైదానానికి శంకుస్థాపన చేశారు. ఈ మైదానం ప్రారంభ కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, టీమిండియా దిగ్గజాలు కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్ తదితరులు హాజరయ్యారు. అలాగే భారత క్రికెట్ నియంత్రణ మండలి {BCCI} అధ్యక్షుడు, కార్యదర్శి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే మహాదేవుడి నగరంలో నిర్మిస్తున్న ఈ మైదానాన్ని.. ఆ మహా దేవుడికి అంకితం చేస్తున్నానని తెలిపారు మోడీ.

Also Read: Hardik Pandya-Mahieka: మహికా శర్మ అసభ్యకరమైన ఫోటోలు వైరల్.. హార్దిక్ పాండ్య సీరియస్.. ఛీ.. ఛీ అంటూ

Advertisement

 

శివతత్వం ఉట్టిపడేలా మైదానం డిజైన్:

చారిత్రక నగరం వారణాసిలో నిర్మిస్తున్న ఈ మైదానాన్ని పూర్తిగా శివతత్వం ఉట్టిపడేలా డిజైన్ చేస్తున్నారు. రజతలాబ్ లో ఉన్న గంజారి ప్రాంతంలో సుమారు 30 ఎకరాలలో ఈ స్టేడియాన్ని నిర్మిస్తున్నారు. ప్రేక్షకులు పూర్తిగా ఆధ్యాత్మిక భావనలో మునిగిపోయేలా ఈ మైదానాన్ని నిర్మిస్తున్నారు. త్రిశూలాన్ని పోలిన ఫ్లడ్ లైట్స్, శివుడి చేతిలో ఉండే డమరుకం ఆకారంలో పెవిలియన్ స్టాండ్ నిర్మించారు. మైదానం ప్రవేశద్వారం బిల్వపత్రం ఆకులు పోలిన మెటాలిక్ షీట్లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మైదానం పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ మైదానం నిర్మాణ బాధ్యతలను 2023 ఆగస్టులో ప్రముఖ కంపెనీ లారెన్స్ అండ్ టుబ్రో {L&T} టెండర్ ద్వారా గెలుచుకుంది. ఈ మైదానం కోసం సేకరించిన 30 ఎకరాలకు సుమారు 121 కోట్లు ఖర్చుచేసింది {L&T}. ఇక ఈ మైదానం నిర్మాణ వ్యయం మొత్తంగా దాదాపు 451 కోట్లు ఉండనున్నట్లు అంచనా. ఈ మైదానం పూర్తి అయిన తర్వాత.. తూర్పు, ఉత్తర భారతదేశ క్రికెట్ కి కొత్త కేంద్రంగా నిలుస్తుందని క్రీడాభిమానులు విశ్వసిస్తున్నారు.

Advertisement

 

త్రిశూల్ వెలుగులు:

మొట్టమొదటిసారి ఈ స్టేడియంలో త్రిశూల్ ఆకారంలో రూపొందించిన ప్రత్యేక ఫ్లడ్ లైట్స్ ఏర్పాటు చేయడంతో మొత్తం వేదికకు దివ్యమైన, ఐకానిక్ లుక్ వచ్చింది. కాశీ నగర ఆధ్యాత్మికతను ప్రతిబింబించేదా ఈ లైట్లను ప్రత్యేక డిజైన్ తో రూపొందించారు. ఈ లైట్స్ రాత్రిపూట వెలిగినప్పుడు స్టేడియం మొత్తం శివతత్వాన్ని స్మరింపచేసేలా ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుందని స్థానికులు చెబుతున్నారు.

Also Read: IPL 2026: ఐపీఎల్ లో కొత్త రూల్స్‌.. డ్రామాలు చేస్తే తోక క‌ట్ చేయ‌డ‌మే, హ్యారీ బ్రూక్ పై రెండేళ్ల బ్యాన్‌

స్టేడియం బయటి నిర్మాణం నుండి.. ప్రేక్షకుల గ్యాలరీ, పైకప్పు డిజైన్ వరకు అన్ని కాశి, శివుడు, త్రిశూల్ లను ఆధారంగా తీసుకొని తీర్చిదిద్దబడ్డాయి. అలాగే అంతర్జాతీయ స్థాయి మ్యాచ్ ల కోసం అత్యాధునిక సౌండ్స్, లైటింగ్, మౌలిక వసతులతో ఈ వేదికను తయారు చేస్తున్నారు. త్వరలోనే ప్రారంభానికి సిద్ధమవుతున్న ఈ స్టేడియంలో తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఎప్పుడు జరుగుతుందోనని క్రీడాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 

?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">

 

View this post on Instagram

 

?utm_source=ig_embed&utm_campaign=loading" target="_blank" rel="noopener">A post shared by The Trending Topic (@thetrendingtopic1)

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

Big Stories

Advertisement
×