BigTV English

Sara vs Arjun : సారా, అర్జున్ టెండూల్కర్ మధ్య ఇంత తేడా ఉందా.. వీళ్ళిద్దరిని గిల్ భరించాల్సిందేనా !

Sara vs Arjun : సారా, అర్జున్ టెండూల్కర్ మధ్య ఇంత తేడా ఉందా.. వీళ్ళిద్దరిని గిల్ భరించాల్సిందేనా !

Sara vs Arjun :  టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ గురించి తెలియని వారు ఎవ్వరూ ఉండరు. సచిన్ టీమిండియా తరపున చేసిన రికార్డులు అలాంటివి మరీ. అందుకే ఇతన్ని మాస్టర్ బ్లాసర్ అని కూడా పిలుస్తారు. వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన తొలి ఇండియా క్రికెటర్ గా రికార్డు నమోదు చేసాడు. టెస్టు మ్యాచ్ లు, వన్డే మ్యాచ్ ల్లో రికార్డు నెలకొల్పాడు. ఇక సచిన్ కి సారా టెండూల్కర్, అర్జున్ టెండూల్కర్ ఇద్దరూ పిల్లలు కలరు.    అర్జున్ టెండూల్కర్  కంటే సారా టెండూల్కర్ రెండు సంవత్సరాలు పెద్దది. తొలుత సచిన్ కి కూతురు.. ఆ తరువాత కుమారుడు.  అయితే సచిన్ టెండూల్కర్ క్రికెట్ లో ప్రపంచాన్నే షేక్ చేశాడు. కానీ అతని కుమారుడు అర్జున్ టెండూల్కర్ మాత్రం ఆ రేంజ్ లో ఆడలేకపోతున్నాడు.


Also Read :  Sara vs Arjun : సారా, అర్జున్ టెండూల్కర్ మధ్య ఇంత తేడా ఉందా.. వీళ్ళిద్దరిని గిల్ భరించాల్సిందేనా !

యోగరాజ్ సింగ్ వద్ద అర్జున్ శిక్షణ


అర్జున్ టెండూల్కర్ తన కెరీర్ కోసం నిత్యం కష్టపడుతూనే ఉంటున్నాడు. ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరపున కొన్ని మ్యాచ్ లు ఆడేందుకు అవకాశం కల్పించారు. ఆశించిన మేరకు రాణించకపోవడంతో తప్పించారు. అటు బౌలింగ్.. ఇటు బ్యాటిండ్ రెండింటిలో రాణించలేకపోయాడు అర్జున్ టెండూల్కర్. ప్రస్తుతం యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ అర్జున్ శిక్షణ తీసుకుంటున్నాడు. దేశవాళీ క్రికెట్ లో ఈ యువ క్రికెటర్ ప్రదర్శన కాస్త మెరుగవుతోంది. ఐపీఎల్ 2025 కోసం అర్జున్ టెండూల్కర్ ను ముంబై ఇండియన్స్ రూ.20లక్షలకు కొనుగోలు చేసింది. అర్జున్ టెండూల్కర్ నికర ఆస్తి దాదాపు 21 కోట్లు అని తెలుస్తోంది. అర్జున్ టెండూల్కర్ తన సోదరి సారా టెండూల్కర్ కంటే ఎక్కువగా సంపాదిస్తాడు.

సారా ఆదాయం ఎంతంటే..? 

సారా టెండూల్కర్ వార్షిక ఆదాయం రూ.50 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు ఉంటుంది. ఆమె ప్రధాన ఆదాయ వనరు ప్రకటనలు. సారా టెండూల్కర్ తరుచూ ప్రయాణాలు చేస్తుంటుంది. అర్జున్ టెండూల్కర్ తో కలిసి కూడా చాలా ప్రయాణాలు చేసింది. సారా ముంబై లోని ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ చదివి.. ఆ తరువాత బయోమెడికల్ సైన్సేస్ లో డిగ్రీ చేసింది. యూనివర్సిటీ కాలేజ్ లండన్ నుంచి క్లినికల్ అండ్ పబ్లిక్ హెల్త్ న్యూట్రిషన్ లో మాస్టర్స్ డిగ్రీని పొందింది. అజియో లక్స్ అనే ప్రకటనలో సారా మోడల్ గా ఆరంగేట్రం చేసింది. ఇన్ స్టా గ్రామ్ లో 5.8 మిలియన్లకు పైగా అనుచరులతో గణనీయమైన ప్రేక్షకులతో నిమగ్నమైంది.

Related News

Sachin-Sara : సచిన్ కు షాక్… సంపాదనలో తండ్రిని దాటిన సారా టెండూల్కర్.. ఒక్క పోస్టుకు ఎంత రేటు అంటే

Harbhajan Singh : భ‌జ్జీ రియ‌ల్ హీరో…వ‌ర‌ద బాధితుల కోసం భారీ సాయం..3 అంబులెన్సులు కూడా

Rishab Pant : చిన్నపిల్లడిలా కటింగ్ చేయించుకున్న పంత్… టీమిండియాలోకి రీ ఎంట్రీ అప్పుడే..

Rohit Sharma: ఆస్పత్రిలో చేరిన రోహిత్ శర్మ…ఆందోళ‌న‌లో ఫ్యాన్స్‌..అస‌లు ఏమైంది

Asia Cup 2025 : నేటి నుంచి ఆసియా కప్ షురూ… ఈ జట్ల మధ్య మొదటి మ్యాచ్.. టైమింగ్స్, ఉచితంగా ఎలా చూడాలి

Virat Kohli: విరాట్ కోహ్లీని నేను ప్రాణంగా ప్రేమిస్తున్నా… టాలీవుడ్ హీరోయిన్ కామెంట్స్‌!

×