Coolie : ప్రస్తుతం అతి త్వరలో ఎన్ని సినిమాలు రిలీజ్ కి సిద్ధంగా ఉన్నా కూడా అందరి చూపులు మాత్రం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజినీకాంత్ నటిస్తున్న కూలీ సినిమా మీద ఉన్నాయి. లోకేష్ టాలెంట్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మొదటి సినిమాతోనే ప్రేక్షకులను విపరీతంగా ఆశ్చర్యపరిచాడు.
ఇక కమల్ హాసన్ హీరోగా చేసిన విక్రమ్ సినిమా ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో విధితమే. ఈ సినిమా మామూలుగా విడుదలవుతున్న తరుణంలో, ఈ సినిమా చూడడానికి వచ్చేముందు మరోసారి ఖైదీ సినిమా చూడండి అని భారీ ట్విస్ట్ ఇచ్చాడు లోకేష్. ఇక్కడితో చాలామందికి లోకేష్ మీద ఒపీనియన్ మారిపోయింది. ఒక్కసారిగా లోకేష్ కి బీభత్సమైన ఎలివేషన్ వచ్చింది. విక్రమ్ సినిమా రికార్డ్స్ అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించాయి.
కూలీ సినిమాలో కమల్ హాసన్
సీనియర్ హీరో కమల్ హాసన్ కి ఆల్రెడీ విక్రం రూపంలో సక్సెస్ అందించాడు. ఇప్పుడు రజినీకాంత్ కి కూలీ రూపంలో అదిరిపోయే సక్సెస్ ఇస్తాడు అని చాలామంది నమ్ముతున్నారు. ఈ సినిమాలో రజనీకాంత్ తో పాటు కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర, తెలుగు స్టార్ హీరో నాగార్జున, హాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ వంటి నటులు కనిపిస్తున్నారు. అయితే ఈ సినిమాలో కమల్ హాసన్ కూడా భాగం అవ్వనున్నారు. అంటే ఈ సినిమాలో కమల్ హాసన్ నటించరు కానీ కమల్ హాసన్ వాయిస్ ఓవర్ ఈ సినిమాలో వినిపిస్తుంది. సినిమా మీద రోజు రోజుకి అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి. ఈ తరుణంలో ఇలాంటి ట్విస్టులు బయటపడుతుంటే, సినిమా రేంజ్ ఇంకా మారిపోతుంది.
పోటీపడిన తెలుగు నిర్మాతలు
కొన్నిసార్లు కాంబినేషన్ మీద విపరీతమైన నమ్మకాలు పెడుతుంటారు కొంతమంది నిర్మాతలు. రజినీకాంత్ హీరోగా లోకేష్ దర్శకత్వంలో సినిమా అన్నప్పుడే అందరూ ఈ సినిమా పైన కన్నేశారు. ఎలా అయినా తెలుగులో డిస్ట్రిబ్యూషన్ హక్కులు దక్కించుకోవాలని ప్రయత్నాలు చేశారు. అందరికంటే ముందు నాగ వంశీ ఈ సినిమా కొనడానికి పోటీపడ్డారు. అయితే కొన్ని కారణాల వలన నాగ వంశీ తప్పుకోవడంతో, ఏసియన్ సునీల్, సురేష్ బాబు, దిల్ రాజు కలిసి ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులను సాధించుకున్నారు. ఆగస్టు 14న ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది. మరోవైపు వార్ 2 సినిమా డిస్ట్రిబ్యూషన్ నాగ వంశీ చేస్తున్నారు.
Also Read: Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కు తప్పిన పెను ప్రమాదం, ఇన్నాళ్లకు బయటపడ్డ నిజం