Plane Crash: ఢిల్లీలో పెను ప్రమాదం తప్పింది. ఎయిర్ ఇండియా విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. విమానం ల్యాండ్ అయిన కాసేపటికే పవర్ యూనిట్ లో మంటలు చెలరేగాయి. హాంకాంగ్ నుంచి ఢిల్లీకి వచ్చిన ఏఐ-315 విమానంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా ఉన్నారు. మంటలు చెలరేగడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ALSO READ: Heavy Rain: రెడ్ అలర్ట్.. రాష్ట్రంలో అత్యంత భారీ వర్షాలు.. పిడుగుల వాన కమ్ముకొస్తోంది..