E-Paper
Advertisement

INDW Vs SLW : మ‌ళ్లీ అదే జోరు.. పోరాడి ఓడిన శ్రీలంక

INDW Vs SLW : మ‌ళ్లీ అదే జోరు.. పోరాడి ఓడిన శ్రీలంక
Advertisement

 INDW Vs SLW : భార‌త్ వ‌ర్సెస్ శ్రీలంక మ‌ధ్య ప్ర‌స్తుతం ఐదు టీ20 మ్యాచ్ ల సిరీస్ జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే మూడు మ్యాచ్ ల్లో భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు విజ‌యం సాధించిన విష‌యం విధిత‌మే. తాజాగా నాలుగో మ్యాచ్ లో కూడా టీమిండియా అదే జోరు కొన‌సాగించింది. గ‌త మ్యాచ్ ల్లో భార‌త్ తొలుత‌ బౌలింగ్ చేస్తే.. ఈ మ్యాచ్ లో మాత్రం ఫ‌స్ట్ బ్యాటింగ్ చేసింది. అయితే ఈ మ్యాచ్ లో శ్రీలంక కూడా పోరాడింది. గ‌త మ్యాచ్ ల‌తో పోల్చితే ఈ మ్యాచ్ లో కాస్త మెరుగైన స్కోర్ చేసింది. అయిన‌ప్ప‌టికీ భార‌త బౌల‌ర్లు ప్ర‌తాపం చూపించ‌డంతో శ్రీలంక మ‌హిళ‌ల జ‌ట్టుకు ఓట‌మి త‌ప్ప‌లేదు.

Also Read : PAK VS SL T20 2026 : పాకిస్తాన్ జ‌ట్టు నుంచి బాబ‌ర్, రిజ్వాన్, షాహీన్ ఔట్.. షాక్ ఇచ్చిన పీసీబీ..!

స్మృతి మంధాన రికార్డ్

Advertisement

ఇప్ప‌టికే సిరీస్ ను కైవ‌సం చేసుకున్న భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు.. తాజాగా బ్యాటింగ్ విధ్వంసంతో ఆధిక్యాన్ని 4-0కు పెంచుకుంది. నాలుగో టీ 20లో హ‌ర్మ‌న్ ప్రీత్ బృందం 30 ప‌రుగుల తేడాతో శ్రీలంక పై నెగ్గింది. తొలుత బ్యాటింగ్ చేసిన భార‌త్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 2 వికెట్ల న‌ష్టానికి 221 ప‌రుగుల భారీ స్కోర్ చేసింది. ప్లేయ‌ర్ ఆఫ్ ద మ్యాచ్ స్మృతి మంధాన (48 బంతుల్లో 80, 11 ఫోర్లు, 3 సిక్స్ లు). సాధించింది. దీంతో అంత‌ర్జాతీయ క్రికెట్ లో 10వేల ప‌రుగులు సాధించింది. గ‌త మూడు మ్యాచ్ ల్లో అంత‌గా రాణించ‌ని స్మృతి నాలుగో మ్యాచ్ లో మాత్రం రెచ్చిపోయింది. అలాగే గ‌త మ్యాచ్ మాదిరిగానే ష‌ఫాలీ వ‌ర్మ‌(46 బంతుల్లో 79, 12 ఫోర్లు, 1 సిక్స్) తో రాణించింది. చివ‌ర్లో రిచా ఘోష్ (16 బంతుల్లో 40 నాటౌట్) రిచా 4 ఫోర్లు, 3 సిక్స్ ల‌తో దంచేసింది.

30 ప‌రుగుల తేడాతో విజ‌యం

ఇక క‌ష్ట‌మైన ల‌క్ష్యాన్ని ఛేదించేందుకు బ‌రిలోకి దిగిన శ్రీలంక 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్లు కోల్పోయి 191 ప‌రుగులు చేసి పోరాడి ఓడింది. భార‌త్ రెండు మార్పుల‌తో బ‌రిలోకి దిగింది. జెమీమా రోడిగ్స్ అస్వ‌స్థ‌త కార‌ణంగా హ‌ర్లీన్ డియోల్, క్రాంతి గౌడ్ స్థానంలో అరుంధ‌తి రెడ్డి తుది జ‌ట్టులో ఆడారు. ముఖ్యంగా ఈ సీరిస్ లో ఆశించిన దూకుడు క‌న‌బ‌ర‌చ‌లేక‌పోయిన స్మృతి మంధాన ఈ మ్యాచ్ లో మాత్రం త‌నదైన శైలీ ఆట‌తీరుతో ఆక‌ట్టుకుంది. ఓవైపు ష‌ఫాలీ, మ‌రోవైపు మంధాన లంక బౌల‌ర్ల భ‌ర‌తం పట్టారు. ప‌వ‌ర్ ప్లే లో 61/ 0 స్కోర్ చేసింది. దూకుడు అంత‌కంతకు పెర‌గ‌డంతో 10.5 ఓవ‌ర్ల‌లోనే భార‌త్ స్కోర్ 100కి చేరింది. ష‌ఫాలీ 30 బంతుల్లో, మంధాన 35 బంతుల్లో హాఫ్ సెంచ‌రీలు చేశారు. వీరిద్ద‌రూ ధ‌నా ద‌న్ ఇన్నింగ్స్ తో 14.2 ఓవ‌ర్ల‌లోనే భార‌త్ 150 మార్క్ దాటింది. మ‌రోవైపు లంక చివ‌రి దాక పోరాడి ఓడింది. చ‌మ‌రి ఆట‌ప‌ట్టు 52, హాసిని 33 రాణించారు. తొలి వికెట్ 59 ప‌రుగులు జోడించారు. ఇమిషా దులాని 29, హ‌ర్షిత 20, నీలాక్షిక‌23 నాటౌట్ గా నిలిచారు. నిర్ణీత‌ 20 ఓవ‌ర్ల‌లో 191 ప‌రుగులు చేసింది లంక‌. దీంతో 30 ప‌రుగుల తేడాతో ఓట‌మి పాలైంది. ఇక మంగ‌ళ‌వారం ఇదే వేదిక పై చివ‌రి మ్యాచ్ జ‌రుగ‌నుంది. ఆ మ్యాచ్ లోనైనా లంక గెలుస్తుందో.. మ‌ళ్లీ అదే రిపీట్ అవుతుందో వేచి చూడాలి.

Advertisement

Also Read : U-19 World Cup : వ‌ర‌ల్డ్ క‌ప్ టీమ్ లో హైద‌రాబాద్ కుర్రాడు.. అరోన్ జార్జ్ ఆరా..!

Related News

నా అల్లుడిపై బ్యాన్ వేస్తే, అంద‌రి భాగోతాలు బ‌య‌ట‌పెడ‌తా..ఇంజ‌మామ్ హెచ్చ‌రిక‌

మ‌రో వివాదంలో మ‌హ్మ‌ద్ రిజ్వాన్..డ్ర‌గ్స్ తీసుకున్న‌ట్లు ఆరోప‌ణ‌లు !

బాబ‌ర్ ఆజం గొప్పోడని డ‌బ్బా కొట్ట‌డం త‌ప్ప‌, పీకిందేమీ లేదు..అంతా ప్ర‌చారం మాత్ర‌మే

ఓయో రూంల్లో ఉండ‌నున్న టీమిండియా ప్లేయ‌ర్లు ?

ధోని చాణ‌క్యం…బెంగాలీ రాద‌ని డ్రామాలు ఆడి బంగ్లా ప‌ళ్లు రాలగొట్టాడు

ఇంగ్లండ్ చేతిలో వైట్ వాష్ అయినా, టీమిండియా అంతు చూస్తాం !

స్మృతి మందాన‌ బ్యాట్ లో AI చిప్స్…అందుకే సెంచ‌రీ చేసింది

విజయ్ మాల్యాతో మందుకొట్టిన ధోనీ, రిషబ్ పంత్..షాకింగ్ వీడియో వైర‌ల్ !

Big Stories

Advertisement
×