E-Paper
Advertisement

Shaheen Afridi: రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ, కేఎల్ రాహుల్ ఈ ముగ్గురిని ఔట్ చేసి, హ్యాట్రిక్ సాధిస్తా

Shaheen Afridi: రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ, కేఎల్ రాహుల్ ఈ ముగ్గురిని ఔట్ చేసి, హ్యాట్రిక్ సాధిస్తా
Advertisement

Shaheen Afridi:  టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament) ఈ వారం చివ‌ర‌లో ప్రారంభం కానున్న నేపథ్యంలో పాకిస్తాన్ ప్రీమియర్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ అఫ్రిది ( Shaheen Afridi ) సంచలన ప్రకటన చేశారు. టీమిండియా జ‌ట్టుకు చెందిన క్రికెటర్లను ఔట్ చేసి, హ్యాట్రిక్ ( hat trick wickets) సాధించాలన్నది తన డ్రీమ్ అంటూ వెల్లడించారు. టీమిండియా మాజీ కెప్టెన్లు రోహిత్ శర్మ ( Rohit Sharma), విరాట్ కోహ్లీ ( Virat Kohli ) అలాగే కేఎల్ రాహుల్ ( KL Rahul ) వికెట్లను వరుసగా తీసి, హ్యాట్రిక్ సాధించాలని ప్రీమియర్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ అఫ్రిది సంచలన ప్రకటన చేశారు. వాళ్లను ముగ్గురిని అవుట్ చేయడం తన డ్రీమ్ అంటూ వ్యాఖ్యానించారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న షాహీన్ అఫ్రిది.. ఈ వ్యాఖ్యలు చేయడంతో వైరల్ గా మారాయి. ఇది చూసిన ఇండియన్ ఫ్యాన్స్.. అతనికి కౌంటర్ ఇస్తున్నారు.

Also Read: Ind vs Pak Match-fixing: ఇండియాతో ఫిక్సింగ్ ? ఫోన్ లో చాటింగ్ చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిని పాక్ కోచ్ స‌ర్ఫ‌రాజ్!

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ, కేఎల్ రాహుల్ ఈ ముగ్గురిని ఔట్ చేసి, హ్యాట్రిక్ సాధిస్తా

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటుకు ( T20 World Cup 2026 tournament) సిద్ధమవుతున్న షాహీన్ అఫ్రిది తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన హ్యాట్రిక్ డ్రీమ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు షాహీన్ అఫ్రిది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అలాగే కేఎల్ రాహుల్ ఈ ముగ్గురి వికెట్లను వరుసగా తీసి హ్యాట్రిక్‌ సాధించాలన్నది తన లైఫ్ టైం డ్రీమ్ అని వ్యాఖ్యానించారు షాహీన్ అఫ్రిది. అదే సమయంలో ఇండియన్ ఓడించాలని కూడా వెల్లడించారు షాహీన్ అఫ్రిది. వాస్తవంగా ఈ ముగ్గురు క్రికెటర్లు పాకిస్తాన్ పై అత్యంత ప్రమాదకరంగా ఆడిన రికార్డులు ఉన్నాయి.

పాకిస్తాన్ పైన ఇప్పటి వరకు రెండు సెంచరీలు చేసిన రోహిత్ శర్మ 1020 పరుగులు సాధించాడు. 38 యావరేజ్ తో.. పాకిస్తాన్ జట్టును చీల్చి చెండాడాడు రోహిత్ శర్మ. అటు పాకిస్తాన్ పై అత్యధికంగా నాలుగు సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ 60 యావరేజ్ తో ఏకంగా 1270 పరుగులు సాధించాడు. అటు రాహుల్.. పాకిస్తాన్ పై ఒకే ఒక్క సెంచరీ నమోదు చేశాడు. 44 యావరేజ్ తో 222 పరుగులు సాధించాడు కేఎల్ రాహుల్. ఇలాంటి భయంకరమైన ఆటగాలను వరుసగా అవుట్ చేయడం చాలా కష్టమని ఇండియన్ ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు. ఈ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్ ల‌ను వ‌రుస‌గా ఔట్ చేయాలంటే షాహీన్ అఫ్రిది మ‌రో జ‌న్మ ఎత్తాల్సిందేన‌ని చుర‌క‌లు అంటిస్తున్నారు ఫ్యాన్స్‌. ముందు టీ20 ప్ర‌పంచ క‌ప్ లో టీమిండియాతో మ్యాచ్ ఆడి, గెలిచి చూపించాల‌ని కౌంట‌ర్లు వేస్తున్నారు.

Advertisement

 

Also Read: T20 World Cup 2026: ఇండియా మ్యాచ్‌ను బాయ్ కాట్ చేసిన పాకిస్తాన్‌..PCBకి రూ.300 కోట్ల న‌ష్టం? మ‌నోళ్ల‌కు లాభ‌మే, వివరాలు ఇవే ( T20 World Cup 2026 tournament)

Related News

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

Big Stories

Advertisement
×