E-Paper
Advertisement

Sankranthi 2027: ఈసారి సంక్రాంతి బరిలో చిరు, బాలయ్య, వెంకీ.. ఇది కదా పోటీ అంటే!

Sankranthi 2027: ఈసారి సంక్రాంతి బరిలో చిరు, బాలయ్య, వెంకీ.. ఇది కదా పోటీ అంటే!
Advertisement

Sankranthi 2027: రాబోయే సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద అసలు, సిసలు ఫైట్ ఉండబోతున్నట్లుగా అప్పుడే ఇండస్ట్రీలో టాక్ మొదలైంది. 2026 సంక్రాంతి (2026 Sankranthi)కి టాలీవుడ్‌లో 5 సినిమాలు రిలీజయ్యాయి. రెబల్ స్టార్ ప్రభాస్ ‘ది రాజా సాబ్’, మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ‘మన శంకర వర ప్రసాద్ గారు’, మాస్ మహారాజా రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’, నవీన్ పొలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’తో పాటు చివరిగా శర్వానంద్ నటించిన ‘నారీ నారీ నడుమ మురారీ’ చిత్రాలు విడుదలయ్యాయి. ఈ చిత్రాలన్నీ కలెక్షన్స్ పరంగా బాగానే రాబట్టాయి. కాకపోతే బడ్జెట్ పరంగా మాత్రం ఇందులో మూడు సినిమాలు మాత్రమే లాభాలు గడించాయి. ‘ది రాజా సాబ్’, ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రాలు అనుకున్నంతగా సక్సెస్ కాలేదు. ఫలితంగా నష్టాలను చవి చూశాయి. కాకపోతే, సంక్రాంతి మాత్రం ఈ చిత్రాలను డిజప్పాయింట్ చేయలేదనే చెప్పుకోవాలి. ఇక ఈ సినిమాలకు వచ్చిన కలెక్షన్స్ అన్ని గమనిస్తే.. మూడొంతులు మన శంకర వర ప్రసాద్ గారే రాబట్టారని చెప్పుకోవచ్చు.

Also Read- Nizam Film Distribution: ఎస్వీసీ, ఏషియన్, మైత్రీలకు చెక్ పెట్టేందుకు.. రంగంలోకి మరో అగ్ర నిర్మాణ సంస్థ!

అసలైన పోటీ 2027లో..

Advertisement

ఈ సంక్రాంతి ఫైట్ అనుకున్నట్లుగా ఆసక్తికరంగానే నడిచింది. చివరి నిమిషంలో ‘జన నాయగన్’ వాయిదా పడటంతో కాంట్రవర్సీ లేకుండా అన్ని సినిమాలు థియేటర్లను షేర్ చేసుకున్నాయి. లేదంటే, టాలీవుడ్‌లో పెద్ద కాంట్రవర్సీనే నడిచేది. ఇక ఆ సంగతి అటుంచితే.. ఈ సంక్రాంతికి పెద్ద హీరోలంటే చిరంజీవి, ప్రభాస్, రవితేజల మధ్యే ఫైట్ నడిచింది. కానీ, రాబోయే సంక్రాంతికి మాత్రం అసలైన పోరు ఉండబోతుందనేది తాజా అప్డేట్. అవును, 2027 సంక్రాంతి (2027 Sankranthi) బరిలో దిగేందుకు మరోసారి చిరంజీవి రెడీ అవుతున్నారు. అలాగే ఈసారి నందమూరి నటసింహం బాలయ్య (Nandamuri Balakrishna), విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh) కూడా ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ మూడు సినిమాలు కాకుండా ఇంకో రెండు మూడు సినిమాలు ఎలాగూ ఉంటాయి కాబట్టి.. మెయిన్‌గా పెద్ద హీరోలైన చిరు, బాలయ్య, వెంకీ మధ్య భీకరమైన పోరు ఉండబోతుందని భావించవచ్చు.

Also Read- Mrunal Thakur: ఆ హీరో నాకు అన్నయ్యతో సమానం… షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన మృణాళ్ !

చిరు, బాలయ్య, వెంకీల మధ్య పోటీ..

Advertisement

మెగాస్టార్ చిరంజీవి, బాబీ కాంబినేషన్‌లో మార్చి నుంచి మొదలు కాబోతున్న ‘మెగా158’ చిత్రాన్ని సంక్రాంతి బరిలో దించేందుకు ప్లాన్ చేస్తున్నారు. బాలయ్య, గోపీచంద్ మలినేని కాంబోలో రూపుదిద్దుకోవాల్సిన చిత్రం కూడా సంక్రాంతికే అంటున్నారు. ఇక హిట్ మెషిన్ అనిల్ రావిపూడి తదుపరి చిత్రం విక్టరీ వెంకటేష్‌తో ఉండబోతుందట. అనిల్ రావిపూడి అంటే సంక్రాంతి పక్కా.. కాబట్టి, ఈ సినిమా కూడా సంక్రాంతి బరిలోనే దిగుతుంది. ఈ సంక్రాంతికి వచ్చిన చిత్రంలో కూడా వెంకీ ఉన్నాడు కానీ, అది గెస్ట్ రోల్ మాత్రమే. ఈసారి మరో ‘సంక్రాంతికి వస్తున్నాం’ తరహా హిట్ కొట్టేందుకు అనిల్, వెంకీ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అదే జరిగితే.. ఈ సంక్రాంతి ఏముంది? వచ్చే సంక్రాంతికి కదా అసలైన మజా ఉండబోతుందనేలా అప్పుడే ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. సంక్రాంతి బరిలో ఈ ముగ్గురు హీరోలకు మంచి హిట్సే ఉన్నాయి. లాస్ట్ సంక్రాంతికి వెంకటేష్ విన్నర్‌గా నిలిస్తే, ఈ సంక్రాంతికి చిరంజీవి ‘విజేత’ అయ్యారు. మరి నెక్స్ట్ సంక్రాంతి ఎవరిదో తెలియాలంటే మాత్రం.. ఈ సినిమాలకు సంబంధించిన ట్రైలర్స్ పడాల్సిందే.

Also Read- Nagabandham: ఆ పండగ రోజే.. పాన్ ఇండియా ఫిల్మ్ ‘నాగబంధం’ టీజర్‌కు డేట్ ఫిక్స్!

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×