E-Paper
Advertisement

T20 World Cup 2026: ఇండియా మ్యాచ్‌ను బాయ్ కాట్ చేసిన పాకిస్తాన్‌..PCBకి రూ.300 కోట్ల న‌ష్టం? మ‌నోళ్ల‌కు లాభ‌మే, వివరాలు ఇవే

T20 World Cup 2026: ఇండియా మ్యాచ్‌ను బాయ్ కాట్ చేసిన పాకిస్తాన్‌..PCBకి రూ.300 కోట్ల న‌ష్టం? మ‌నోళ్ల‌కు లాభ‌మే, వివరాలు ఇవే
Advertisement

T20 World Cup 2026: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026) నేపథ్యంలో పాకిస్తాన్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ టోర్నమెంట్ లో భాగంగా ఇండియాతో జరిగే మ్యాచ్ ను బహిష్కరిస్తున్నట్లు అధికారిక ప్రకటన చేసింది. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 15వ తేదీన కొలంబో వేదికగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. బంగ్లాదేశ్ పట్ల ఐసీసీ వ్యవహరించిన తీరు, టీమిండియాకు ఐసీసీ సపోర్ట్ ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బీసీసీఐ అలాగే ఐసీసీకి మధ్య సంబంధాలు ఉన్నాయని పదే పదే చెబుతోంది పాకిస్తాన్. ఇదే విషయాన్ని తప్పుడుగా చూపించే ప్రయత్నంలో భాగంగా పాకిస్తాన్ ఈ మ్యాచ్ బాయ్ కాట్‌ చేసినట్టు తెలుస్తోంది. అయితే, పాకిస్తాన్ స‌ర్కార్ చేసిన ఈ ప్ర‌క‌ట‌నతో క్రికెట్ అభిమానులు ఉలిక్కి ప‌డుతున్నారు.

Also Read:  Yuvraj Singh: యువ‌రాజ్ ఇంత కామాంధుడా ? హీరోయిన్ తో శృంగారం.. ఆస్ట్రేలియా హోట‌ల్ లో చెప్పులు కూడా !

టీమిండియాతో మ్యాచ్ బాయ్ కాట్‌…పాక్ కెప్టెన్ రియాక్ష‌న్‌

Advertisement

టి20 ప్రపంచకప్ 2026 టోర్నమెంట్ మరో వారం రోజుల్లో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి మార్చి 8వ తేదీ వరకూ టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ జరగనుంది. మరో వారం రోజుల్లో ప్రారంభం కానున్న ఈ టోర్నమెంట్ నేపథ్యంలో పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ సంచలన ప్రకటన చేశారు. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా ఇండియా తో జరిగే మ్యాచ్ తమ జట్టు ఆడబోదంటూ వెల్ల‌డించారు. ఈ విషయంలో పాకిస్తాన్ ప్రభుత్వంతో పాటు మొహ్సీన్ న‌ఖ్వీ నిర్ణయం ఫైనల్ అంటూ వెల్లడించారు. దీంతో రెండు దేశాల మధ్య మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

PCBకి రూ.300 కోట్ల న‌ష్టం? టీమిండియాకు లాభ‌మే, వివరాలు ఇవే

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ఇండియాతో జరిగే మ్యాచ్ ను పాకిస్తాన్ బాయ్ కాట్ చేసింది. దీనివల్ల పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, ఆ జట్టుకు తీవ్ర నష్టం చేకూరాలని ఉంది. ఇలా మ్యాచ్ బాయ్ కాట్ చేస్తే రెండు పాయింట్లు పాకిస్తాన్ కోల్పోతుంది. ఇది టీమిండియా కు చాలా అడ్వాంటేజ్ కాబోతుంది. ఈ రెండు పాయింట్ల వల్ల సెమీ ఫైనల్ దాకా టీమిండియా దూసుకు వెళ్ళవచ్చు. అదే సమయంలో ఈ రెండు పాయింట్లు లేకపోవడంతో పాకిస్తాన్ ఈ టోర్నమెంట్ నుంచి వైదొలిగే ప్రమాదం కూడా ఉంటుంది. పాకిస్తాన్ అర్ధాంతరంగా ఈ మ్యాచ్ నుంచి తప్పుకుంటే బ్రాడ్ కాస్ట‌ర్ల‌కు కోట్లల్లో నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుంది. దాదాపు 300 కోట్ల వరకు నష్టం జరిగే ఛాన్స్ ఉన్నట్లు చెబుతున్నారు. అయితే ఈ డబ్బును పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నుంచి వసూలు చేసే హక్కు బ్రాడ్ కాస్ట‌ర్ల‌కు ఉంటుందట.

Advertisement

ఈ మేరకు టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో పాల్గొనే జట్లు అన్ని అగ్రిమెంటుపై సంతకం పెడతాయని చెబుతున్నారు. ఈ అగ్రిమెంట్ ప్రకారం ప్రతి మ్యాచ్ అన్ని జట్లు ఆడాల్సిందే. లేకపోతే బ్రాడ్ కాస్ట‌ర్ల‌కు జరిగే నష్టాన్ని సదరు క్రికెట్ బోర్డు చెల్లించాల్సి ఉంటుందట. దీనికి కోర్టు సమాధానం కచ్చితంగా చెబుతుందని అంటున్నారు. పాకిస్తాన్ ఈ మ్యాచ్ ను బాయ్ కాట్ చేస్తే, భవిష్యత్తులో జరిగే ఐసీసీ ఈవెంట్స్ లో ఆ జట్టుకు స్థానం ఇవ్వకపోవచ్చు. కఠిన రూల్స్ ఐసీసీ అమలు చేసే ప్రమాదం ఉంటుంది. ఇక ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగితే చూడాలని చాలా మంది అభిమానులు ఎదురుచూస్తున్నారు. నిజంగానే ఈ మ్యాచ్ నుంచి పాకిస్తాన్ తప్పుకుంటే, అభిమానులకు మాత్రం నిరాశ ఎదురవుతుంది.

Also Read: Kohli Deactivate Instagram: కోహ్లీ, అనుష్క మ‌ధ్య చిచ్చు పెట్టిన సెక్సీ లేడీ..అందుకే ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్​ మాయం !

 

Related News

ఇస్లామాబాద్ లో హై టెన్ష‌న్‌…ఇంగ్లాండ్ క్రికెట‌ర్లు బ‌స చేస్తున్న హోట‌ల్ ద‌గ్గ‌ర భారీ బ్లాస్ట్ !

ప్రీతి జింటా లాగా సొట్ట బుగ్గలేసుకుని, వీడేం వికెట్ కీపింగ్ చేస్తాడురా నాయ‌నా ?

పాకిస్తాన్ అంటేనే ఎగిరెగిరి ప‌డ‌తారు, కానీ సిగ్గు లేకుండా మాతో మ్యాచ్ లు ఆడ‌తారు!

ద‌రిద్రుడు అగార్క‌ర్ పోయినా రాత మార‌లేదే…ష‌మీ, భువీల‌ను న‌ట్టేట ముంచారు క‌ద‌రా?

విండీస్ పై చివ‌రి మ్యాచ్ ఆడేశాడు…ఇక ర‌వీంద్ర జ‌డేజా రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే

రీ-ఎంట్రీపై ప‌గ‌టి క‌ల‌లు వ‌ద్దు..ఇక‌ రిటైర్మెంట్ ఇచ్చేసి, స‌న్యాసం తీసుకో !

SRH ఇక నీదే అల్లుడు…క‌ట్నంగా కింద క‌ట్ట‌బెట్టిన కావ్య పాప ఫ్యామిలీ ?

ఉగ్రవాదుల టెన్షన్..21 ఏళ్ల తర్వాత పాకిస్తాన్‌లో అడుగుపెట్టిన ఇంగ్లాండ్

Big Stories

Advertisement
×