E-Paper
Advertisement

Type 101 Climbed: తాడు లేకుండా చేతుల సాయంతో.. 101 అంతస్తుల బిల్డింగ్ ఎక్కేశాడు

Type 101 Climbed: తాడు లేకుండా చేతుల సాయంతో.. 101 అంతస్తుల బిల్డింగ్ ఎక్కేశాడు
Advertisement

Type 101 Climbed: అమెరికన్ రాక్ క్లైంబర్ అలెక్స్ హోన్నోల్డ్.. ఎలాంటి తాడు లేకుండా కేవలం చేతుల సాయంతో 101 అంతస్తుల బిల్డింగ్ ఎక్కి ఆశ్చర్యపరిచాడు. తైవాన్‌లోని అత్యంత ఎత్తైన భవనం తైపీ 101 ను హోన్నోల్డ్‌ అత్యంత సునాయాసంగా అధిరోహించాడు. ఈ సాహసాన్ని వేలాది మంది చూశారు. 508 మీటర్ల ఎత్తైన తైపీ భవనాన్ని ఎక్కేందుకు హోన్నోల్డ్ ఎలాంటి భద్రతా పరికరాలు ఉపయోగించలేదు. ఒట్టి చేతులతో భవనాన్ని ఎక్కడం గమనార్హం. మొత్తం 1,667 అడుగుల ఎత్తుకు చేరుకొనేందుకు హోన్నోల్డ్ కు 91 నిమిషాల సమయం పట్టింది. భవనం పైకెక్కిన తర్వాత హోన్నోల్డ్ ప్రజకు అభివాదం చేశాడు.

91 నిమిషాల్లో 101 అంతస్తులు అధిరోహణ

కాలిఫోర్నియాలోని యోస్మైట్ జాతీయ ఉద్యానవనంలోని ఎల్ కాపిటన్‌ను ఎలాంటి తాళ్లు లేదా భద్రతా పరికరాలు లేకుండా అధిరోహించిన మొదటి వ్యక్తిగా హోన్నోల్డ్ ప్రసిద్ధి చెందాడు. తైపీ 101 భవనాన్ని శనివారం నాడు ఎక్కాలని అలెక్స్ నిర్ణయించుకోగా..తడి వాతావరణం కారణంగా ఆదివారానికి వాయిదా పడింది. తైవాన్ రాజధానిలో అలెక్స్ చేసిన సాహసాన్ని నెట్‌ఫ్లిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం చేశారు. హోన్నోల్డ్ ఒక గంటా 31 నిమిషాల్లోనే తైపీ 101 భవనాన్ని అధిరోహించాడు.

అలైన్ రాబర్డ్ కు నాలుగు గంటలు

Advertisement

తనను తాను “స్పైడర్‌మ్యాన్” అని పిలుచుకునే ఫ్రెంచ్ వ్యక్తి అలైన్ రాబర్ట్.. ఆ ప్రపంచంలోనే ఎత్తైన భవనాల్లో ఒకటైన తైపీ 101 పైకి నాలుగు గంటల్లో చేరుకున్నాడు. అతడు తాళ్లు, భద్రతా పరికరాల సాయంతో అలా చేశాడు. తైవాన్ ఉపాధ్యక్షుడు హ్సియావో బి-ఖిమ్.. హోన్నోల్డ్ అధిరోహణను అభినందించారు. భవనం పైభాగంలో హోన్నోల్డ్‌ను అతని భార్య వెల్ కమ్ చెప్పింది. అతను ఎక్కుతున్నప్పుడు గాలి ఎక్కువగా ఉండడంతో ఆమె ఆందోళన వ్యక్తం చేసింది. హోన్నోల్డ్ 89వ అంతస్తుకు చేరుకున్నప్పుడు, కిటికీలోంచి అభిమానులు అతడిని చూసి కేరింతలు కొట్టారు.

డాక్యుమెంటరీ అకాడమీ అవార్డు

Advertisement

ఈ వీడియోను హోన్నోల్డ్, నెట్‌ఫ్లిక్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. తన కెరీర్‌లో హోన్నోల్డ్ అనేక ప్రమాదకరమైన అధిరోహణలు చేశాడు. ఫ్రీ సోలో అనే పేరుతో 3,000 అడుగుల (915 మీ) ఎల్ కాపిటన్ అనే పర్వతాన్ని అధిరోహించినందుకు డాక్యుమెంటరీ అకాడమీ అవార్డును గెలుచుకున్నాడు.

Also Read:  ఈ పెంగ్విన్‌కు ఏమైంది? రీల్స్‌లో అదే పనిగా కనిపిస్తోంది.. పూరీ చెప్పింది దీని గురించేనా?

తైపీ భవనంలో మొత్తం 101 అంతస్తులున్నాయి. మధ్యలో ఉన్న 64 అంతస్తులను ఎక్కడం ఈ సాహసంలో అత్యంత ప్రమాదకరమైన విన్యాసం. అది బాక్సుల ఆకారంలో చాలా సంక్లిష్టంగా ఉంటాయి. హోన్నోల్డ్‌ చేసిన ఈ సాహసం 10 సెకన్ల ఆలస్యంగా నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమైంది.

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×