E-Paper
Advertisement

Shahid Afridi: కావ్య మీరు అస్స‌లు త‌గ్గొద్దు..మీ వెనుక 26 కోట్ల మంది పాకిస్తానీయులు ఉన్నారు

Shahid Afridi: కావ్య మీరు అస్స‌లు త‌గ్గొద్దు..మీ వెనుక 26 కోట్ల మంది పాకిస్తానీయులు ఉన్నారు

Shahid Afridi: లండన్ వేదికగా జ‌రిగిన‌ ది హండ్రెడ్ లీగ్ వేలంలో ( The Hundred Auction) పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ ను ( abrar ahmed ) కావ్య మారన్ ( Kavya Maran) కొనుగోలు చేసి వివాదంలో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. ఇండియాకు చెందిన కావ్య… ఇలా పాకిస్తాన్ వాడిని కొనుగోలు చేస్తారని సోషల్ మీడియాలో ఆమెపై దండయాత్ర చేస్తున్నారు. దేశ ద్రోహి అంటూ కావ్య పాప ఫోటోలు మార్ఫింగ్ చేసి రచ్చ రచ్చ చేస్తున్నారు. ఆమెకు పాకిస్తాన్ జెర్సీ వేయడమే కాకుండా బురఖా కూడా వేసి దారుణంగా ఆడుకుంటున్నారు. అయితే ఈ నేపథ్యంలో పాకిస్తాన్ నుంచి మాత్రం కావ్య పాపకు మంచి సపోర్ట్ లభిస్తుంది. ఇప్పటికే షోయబ్ అక్తర్ ఆమెకు సపోర్ట్ చేయగా.. తాజాగా పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రీది ( Shahid Afridi ) కూడా ఆమెకు అండగా నిలిచారు. కావ్య మేడం మీరు అస్సలు తగ్గొద్దు.. మీ వెనక 26 కోట్ల పాకిస్తాన్ జనాభా ఉందని భరోసా కల్పించే ప్రయత్నం చేశాడు. దీంతో షాహిద్ ఆఫ్రీది చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Also Read:  Salman Ali Agha Run Out: ఒళ్లు మ‌రిచిపోయి నిద్ర‌పోయిన స‌ల్మాన్ అలీ….బ‌చ్చాగాడిని చేసి రనౌట్ చేసిన బంగ్లాదేశ్‌

కావ్య మీ వెనుక 26 కోట్ల మంది పాకిస్తానీయులు ఉన్నారు

పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ ను 2.34 కోట్లు పెట్టి సన్రైజర్స్ లీడ్స్ జట్టు ఓనర్ కావ్య మారన్ కొనుగోలు చేసే సంగతి తెలిసిందే. దీంతో దేశద్రోహి అంటూ కావ్య పాపపై ట్రోల్లింగ్ మొదలుపెట్టారు. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు పైన ఐదు సంవత్సరాల పాటు బ్యాన్ కూడా విధించాలని కోరుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో కావ్య పాపకు సపోర్ట్ గా పాకిస్తాన్ నిలుస్తోంది. తాజాగా కావ్య పాపకు సపోర్ట్ గా పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది మాట్లాడారు. పాకిస్తాన్ ప్లేయర్లను కొనుగోలు చేసినందుకుగాను కావ్య పాపకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు.

రాజకీయాలకు సంబంధం లేకుండా క్రికెట్ ఉండాలని పేర్కొన్నారు. ఈ విషయంలో కావ్య అందరికంటే ముందుగా ఆలోచించి, పాకిస్తాన్ ఆటగాడిని కొనుగోలు చేశారని కితాబు ఇచ్చారు. ఈ సాంప్రదాయం ఇలాగే కొనసాగాలని కోరారు. ఈ విషయంలో కావ్య మారన్ ఏమాత్రం తగ్గకూడదని… ఆమె వెనుక 26 కోట్ల మంది పాకిస్తాన్ పౌరులు ఉన్నారని వ్యాఖ్యానించారు. ఏమాత్రం భయపడకుండా ముందుకు సాగాలని రిక్వెస్ట్ చేశారు షాహిద్ అప్రిది. ఇక అంతకుముందు పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ కూడా ఇదే విషయాన్ని తెలిపారు. కావ్య పాప చాలా ధైర్యవంతురాలని వ్యాఖ్యానించారు. ఇండియాలో ఎవరు చేయని పనిని ఆమె చేసి చూపించారని ప్రశంసించారు షోయబ్ అక్తర్. అటు ఐపీఎల్ లో కూడా పాకిస్తాన్ ప్లేయ‌ర్ల‌ను ఆడించాల్సిందేనంటూ త‌న్వీర్ అహ్మ‌ద్ డిమాండ్ చేశారు.

Also Read: RCB VS SRH: కావ్యా పాపపై దారుణంగా పోస్టులు..స‌న్ రైజ‌ర్స్ ను పాకిస్తాన్ గా ఫోటోలు మార్ఫింగ్ చేసి

 

https://www.facebook.com/share/p/1JEykVrYHF/

https://www.facebook.com/groups/2948781928509750/permalink/25935997412694876/?rdid=EZCLQUDq5bKZp7uO#

Related News

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

రెండోసారి ఛాంపియ‌న్ గా RCB..ప్ర‌మాదంలో సూర్య‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ భ‌విష్య‌త్తు !

Tanveer Ahmed: విరాట్ కోహ్లీ మ‌గాడైతే, పాకిస్తాన్ పిచ్ ల‌పై ఆడి చూపించాలి

Big Stories

×