Salman Ali Agha Run Out: బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ ( Bangladesh vs Pakistan, 2nd ODI) మధ్య ప్రస్తుతం 3 వన్డేల సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ లో ఇప్పటికే తొలి వన్డే మ్యాచ్ జరగగా, ఇవాళ రెండవ మ్యాచ్ జరుగుతోంది. ఢాకాలోని షేర్ బంగ్లా నేషనల్ స్టేడియం ( Shere Bangla National Stadium, Dhaka) వేదికగా బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య రెండో వన్డే కొనసాగుతోంది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. పాకిస్తాన్ టి20 కెప్టెన్ సల్మాన్ అలీ అఘా (Salman Ali Agha ) రనౌట్ అయ్యాడు. బంగ్లాదేశ్ బౌలర్ మిరాజ్ కు సహాయం చేయబోతే.. అతడే రివర్స్ గా సల్మాన్ అలీ అఘాను రనౌట్ చేశాడు. ఈ రనౌట్ కు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. అయితే ఈ రనౌట్ పై పాకిస్తాన్ సీరియస్ అయింది. బంగ్లాదేశ్ తొండాట ఆడిందని ఫైర్ అవుతున్నారు పాక్ ఫ్యాన్స్.
Also Read: Boycott SRH: బాయ్ కాట్ సన్ రైజర్స్ అంటూ ట్రోలింగ్..పాకిస్తాన్ ప్లేయర్లను కొనడంపై వివాదం
టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ముగిసిన వెంటనే బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లిన పాకిస్తాన్ ప్రస్తుతం వన్డేలు ఆడుతోంది. బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య 3 వన్డేల సిరీస్ నడుస్తోంది. అయితే ఇందులో మొదటి వన్డేలో బంగ్లాదేశ్ విజయం సాధించగా, రెండో వన్డేలో పాకిస్తాన్ విజయం దిశగా దూసుకు వెళ్తోంది. అయితే ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ మొదట బ్యాటింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పాకిస్తాన్ మిడిల్ ఆర్డర్ ఆటగాడు సల్మాన్ అలీ 64 పరుగుల వద్ద రనౌట్ అయ్యాడు. మంచి ఊపులో ఉన్న సమయంలో, బంగ్లాదేశ్ బౌలర్ మిరాజ్ తొండాట ఆడి రనౌట్ చేశాడు. తొండాట అనడం కంటే, తెలివిగా పెవిలియన్ కు పంపించాడు అనడం కరెక్ట్. అసలు ఏం జరిగిందంటే.. బంగ్లాదేశ్ బౌలర్ మెహిదీ హసన్ మిరాజ్ ( Mehidy Hasan Miraz) బౌలింగ్ చేసేందుకు వచ్చాడు. ఆ క్రమంలో మహమ్మద్ రిజ్వాన్ బ్యాటింగ్ చేస్తున్నాడు. మరొక ఎండ్ లో సల్మాన్ అలీ ఉన్నాడు. అయితే మెహిదీ హసన్ మిరాజ్ వేసిన బంతిని నేరుగా బౌలర్ కే కొట్టాడు మహమ్మద్ రిజ్వాన్.
అయితే ఆ బంతి మరో వైపు ఉన్న సల్మాన్ అలీకి తగిలింది. ఆ సమయంలో బంతిని తీసి బౌలర్ కు ఇచ్చే ప్రయత్నం చేశాడు సల్మాన్ అలీ. అప్పటికే క్రీజు అవతల ఉన్న సల్మాన్ అలీని గమనించి, తెలివిగా బౌలర్ మెహిదీ హసన్ మిరాజ్, ఆ బంతిని తీసుకొని, వికెట్లను గిరాటేశాడు. ఇక థర్డ్ అంపైర్ రిప్లై లో చూసి ఔట్ ఇచ్చేశాడు. దీంతో సల్మాన్ అలీ పెవీలియన్ దారి పట్టాడు. ఈ క్రమంలో తన హెల్మెట్ నేలకేసి కొట్టి మరి వెళ్ళిపోయాడు. అయితే బంగ్లాదేశ్ బౌలర్ మెహిదీ హసన్ మిరాజ్ అప్పీల్ చేయడంతోనే థర్డ్ అంపైర్ అవుట్ ఇవ్వడం జరిగింది. క్రీడా స్ఫూర్తితో కొంత మంది క్రికెటర్లు అలా రన్ అవుట్ అస్సలు చేయరు. కానీ బంగ్లాదేశ్ ప్లేయర్లు మాత్రం తొండాట ఆడి ఈ రనౌట్ చేశారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. దీంతో సల్మాన్ అలీ నిద్ర పోయాడని కొంత మంది ట్రోల్ చేస్తుంటే, సాయం చేయబోతే అతనికే బంగ్లాదేశ్ సున్నం పెట్టిందిరా అంటున్నారు.
Also Read: Chatgpt On IPL 2026: ఐపీఎల్ 2026 విన్నర్ ఎవరో తేల్చేసిన చాట్ జీపీటీ..పర్పుల్ క్యాప్ అతనికే
?igsh=MXB1dW1lcTcxbmF0eg==
🚨 Run-out drama!
Mehidy Hasan Miraz catches Salman Ali Agha outside the crease while returning the ball.
Salman Ali Agha was visibly furious after the run-out and lashed out at Mehidy Hasan Miraz.
Litton Das stepped in, leading to a heated exchange.pic.twitter.com/u8fjsLi7OZ
— OneCricket (@OneCricketApp) March 13, 2026