E-Paper
Advertisement

Shahid Afridi: సిక్స్ గేట్లు 50 మీట‌ర్లే, అందుకే న్యూజిలాండ్ C జ‌ట్టుపై గెలిచారు..ఇండియా ప‌రువు తీసిన అఫ్రిది

Shahid Afridi: సిక్స్ గేట్లు 50 మీట‌ర్లే, అందుకే న్యూజిలాండ్ C జ‌ట్టుపై గెలిచారు..ఇండియా ప‌రువు తీసిన అఫ్రిది
Advertisement

Shahid Afridi:  టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య రాయ్ పూర్ వేదికగా నిన్న రెండవ టీ20 జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన టీమిండియా 7 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. బ్యాటింగ్ అలాగే బౌలింగ్ లో అద్భుతంగా రానించి విజయం సాధించింది. ఇషాన్ కిషన్ అలాగే కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ కీలకమైన ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయతీరాలకు చేర్చారు. అయితే టీమిండియా వరుసగా రెండు టీ20 లు గెలిచిన నేపథ్యంలో పాకిస్తాన్ కడుపు మండినట్టుంది. ఈ నేపథ్యంలోనే ఇండియా విజయాలపై షాహిద్ అఫ్రిది ( Shahid Afridi ) తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యూజిలాండ్ C జట్టు పైన గెలవడం కూడా ఒక గెలుపేనా అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు షాహిద్ అఫ్రిది.

Also Read: Virat Kohli to Rohit Sharma: ఒక్క పోస్టుకు రూ.14 కోట్లు..కోహ్లీ నుంచి రోహిత్ వ‌ర‌కు ఎవ‌రు ఎంత తీసుకుంటున్నారంటే

అసలు టీమిండియాది గెలుపే కాదు.. పరువు తీసిన షాహిద్ అఫ్రిది

Advertisement

న్యూజిలాండ్ పై టీమిండియా రెండవ టి20 గెలిచిన నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యూజిలాండ్ C జట్టు పైన టీమిండియా గెలిచింది.. అసలు సిసలు న్యూజిలాండ్ జట్టుపైన విజయం సాధించాలి… అప్పుడే నిజమైన గెలుపు అంటూ వ్యాఖ్యానించారు. శుక్రవారం మ్యాచ్ లో అసలు టీం ఇండియాది గెలుపే కాదు అన్నట్లుగా మాట్లాడాడు. అంతేకాదు ఇండియాలో 50 మీటర్లే బౌండరీ గేట్లు ఉంటాయని.. అందుకే అవలీలగా టీమిండియా ప్లేయర్లు సిక్సర్లు అలాగే బౌండరీలు కొడుతున్నారని బాంబు పేల్చారు.

అందులోనూ బచ్చాగాళ్ళు ఉన్న న్యూజిలాండ్ పైన టీం ఇండియా గెలిచిందని చురకలు అంటించారు. దమ్ముంటే పాకిస్తాన్ పైన గెలిచి చూపించాలని మరో సవాల్ విసిరినట్లు షాహిద్ అఫ్రిది పై వార్తలు వస్తున్నాయి. అయితే షాహిద్ అఫ్రిది చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఇండియన్ ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. వీళ్ళు మాటలకు తప్ప చేతలకు పనికిరారని కౌంటర్ ఇస్తున్నారు. ఇండియా పైన ఎన్నిసార్లు పాకిస్తాన్ ఓడిపోయినా, సిగ్గు రావడం లేదని షాహిద్ అఫ్రిదిని ఉద్దేశించి పోస్టులు పెడుతున్నారు. టి20 ప్రపంచ కప్ లో ఫిబ్రవరి 15వ తేదీన పాకిస్తాన్ జట్టును చిత్తుగా ఓడిస్తామని హెచ్చరిస్తున్నారు.

ఏడు వికెట్ల తేడాతో విజయం

Advertisement

టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య రెండవ టి20 రాయ్ పూర్ వేదికగా జరిగింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు, 20 ఓవర్లు ఆడి 6 వికెట్ల నష్టానికి 208 పరుగులు సాధించింది. రచిన్ రవీంద్ర ఒక్కడే న్యూజిలాండ్ జట్టులో 44 పరుగులు సాధించి అద్భుతంగా రాణించాడు. అటు న్యూజిలాండ్ కెప్టెన్ శాంట్నార్‌ 47 పరుగులతో ఇరగదీశాడు. ఇక ఈ లక్ష్యాన్ని 15.2 ఓవర్లలోనే ఫినిష్ చేసింది టీం ఇండియా. మొదటినుంచి దూకుడు గాడిన టీమిండియా కేవలం 3 వికెట్లు నష్టపోయి విక్టరీ కొట్టింది. సూర్య కుమార్ యాదవ్ 82 పరుగులు సాధించగా ఇశాన్ కిషన్ 76 పరుగులు కొట్టాడు. ఈ నేపథ్యంలోనే టీమిండియా అవలీలగా విజయం సాధించింది.

Also Read: Sarfaraz Khan Double Century: స‌ర్ఫ‌రాజ్ ఖాన్ డ‌బుల్ సెంచ‌రీ..ఇంకేం చేయాలి, ఇక‌నైనా టీమిండియాలోకి తీసుకోండిరా

 

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×