FIFA World Cup 2026: 2026 ఫిఫా వరల్డ్ కప్ టోర్నమెంట్ (FIFA World Cup 2026) విజేతగా స్పెయిన్ నిలిచింది. అమెరికాలోని న్యూ జెర్సీ వేదికగా ఫిఫా వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ అర్జెంటీనా, స్పెయిన్ జట్ల మధ్య జరిగింది. అయితే ఈ మ్యాచ్ దాదాపు 120 నిమిషాల పాటు సాగింది. ఈ క్రమంలోనే 1-0 తేడాతో అర్జెంటీనా పై స్పెయిన్ విక్టరీ సాధించింది. దీంతో స్పెయిన్ దేశవ్యాప్తంగా సంబరాలు సంబరాన్ని అంటాయి. అయితే ఫిఫా వరల్డ్ కప్ 2026 టోర్నమెంటులో AI చిప్స్ వాడినట్లు సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ గా మారింది. దీంతో ఫిఫా అభిమానులు షాక్ అవుతున్నారు.
ఫిఫా వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ (FIFA World Cup 2026) నిన్నటితో ముగిసింది. ఇందులో స్పెయిన్ రెండోసారి ఛాంపియన్ గా అనిపించింది. ఈ క్రమంలో ఫిఫా వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ సందర్భంగా వాడినటు వంటి బంతుల్లో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ చిప్స్ (AI CHIPS) వాడారని సోషల్ మీడియాలో వార్త వైరల్ గా మారింది. అడిడాస్ ట్రయోండాలో కొత్త టెక్నాలజీ వాడారు. దీన్నే ఫిఫా కనెక్టెడ్ బాల్ టెక్నాలజీ అని పిలుస్తారు. ఫిఫా కనెక్టెడ్ బాల్ టెక్నాలజీ ప్రకారం… ఫుట్ బాల్ లలో చిప్ లు పెడతారన్నమాట. 2026 ఫిఫా వరల్డ్ కప్ నేపథ్యంలో ఫుట్ బాల్ లో 500HZ IMU సెన్సార్ చిప్ ను వాడడం జరిగింది.
ఫుట్ బాల్ లో చిప్స్ వాడడం వల్ల రియల్ టైం ట్రాక్ చేయవచ్చు. బంతి కదలికలు… అది తిరిగే వేగం, ప్రయాణించే స్పీడు ఇలాంటి అంశాలను ఈ సెన్సార్ ట్రాక్ చేస్తుంది. అలాగే క్లియర్ కాలు లేదా చేతికి బంతి తగిలిన కచ్చితంగా సమయాన్ని కూడా సెకండ్ కు 500 సార్లు రికార్డు చేయబడుతుంది. అలాగే ఒక ప్లేయర్ పాస్ ఇచ్చిన ఖచ్చితమైన మైక్రో సెకండ్ ను కూడా గుర్తిస్తుంది. అలాగే బంతి లైన్ దాటి బయటకు వెళ్లే ముందు చివరిగా ఏ జట్టు ఆటగాడికి తగిలిందనే వివాదాలను కూడా ఈ చిప్స్ పసిగడతాయి. దీనివల్ల గొడవలు జరిగవ. రిఫరీలు కూడా సరైన నిర్ణయాన్ని చూసుకోగలుగుతారు. ఇది ఇలా ఉండగా… జూలై 20వ తేదీన ఎర్లీ మార్నింగ్ ఫిఫా వరల్డ్ కప్ 2026 ఫైనల్ (FIFA World Cup 2026) మ్యాచ్ జరిగింది. ఇందులో అర్జెంటీనా అలాగే స్పెయిన్ తలపడ్డాయి. 120 నిమిషాల పాటు ఈ మ్యాచ్ జరిగింది.106వ నిమిషంలో స్పెయిన్ గోల్ చేసింది. ఈ క్రమం లోనే అర్జెంటీనా ఓటమిపాలై… స్పెయిన్ చాంపియన్ అయింది.
Also Read: Hasan Ali in a pickpocketing case: పిక్ పాకెట్ కేసులో హసన్ అలీ..తోలు తీసిన ఇండియన్ పోలీసులు !
The official 2026 FIFA World Cup match ball (Adidas Trionda) has a 500Hz IMU sensor chip embedded in one of its four panels. It tracks the ball's exact movement, spin, speed and contact timing in real time and sends data to the VAR system to help referees with precise calls on…
— Fabrizioo Romana (@EMurikie) July 20, 2026