E-Paper
Advertisement

Shakib Al Hasan: ఐపీఎల్ ప‌ర‌మ చెత్త లీగ్..నా దృష్టిలో PSL టోర్న‌మెంటే బెస్ట్

Shakib Al Hasan: ఐపీఎల్ ప‌ర‌మ చెత్త లీగ్..నా దృష్టిలో PSL టోర్న‌మెంటే బెస్ట్

Shakib Al Hasan:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Indian Premier League 2026 Tournament) చాలా రసవత్తరంగా రెండు నెలలపాటు కొనసాగిన సంగతి తెలిసిందే. మార్చి నెలలో ప్రారంభమైన ఈ మెగా టోర్నమెంట్ మే 31వ తేదీతో ముగిసింది. అయితే ఈ టోర్నమెంటులో బంగ్లాదేశ్ ప్లేయర్లు ఆడకుండా భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఐపీఎల్ టోర్నమెంటుపై షకీబ్‌ అల్‌ హసన్ (Shakib Al Hasan) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ పరమ చెత్త లీగ్ అంటూ పేర్కొన్న షకీబ్‌ అల్‌ హసన్, తన దృష్టిలో పాకిస్తాన్ సూపర్ లీగ్ (Pakistan Super League) గొప్ప టోర్నమెంట్ అంటూ కితాబిచ్చారు. PSL టోర్నమెంటులో టాలెంటెడ్ ఆటగాళ్లు మాత్రమే ఉంటారని బాంబు పేల్చారు. దీంతో షకీబ్‌ అల్‌ హసన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Also Read: Ambati Rayudu: బ‌ల‌హీనమైన గుజ‌రాత్ పై గెలిచి బిల్డ‌ప్ ఇస్తున్నారు..RCB ప‌రువు తీసిన అంబ‌టి Ambati Rayudu!

ఐపీఎల్ ప‌ర‌మ చెత్త లీగ్..నా దృష్టిలో PSL టోర్న‌మెంటే బెస్ట్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ 19 సంవత్సరాలుగా విజయవంతంగా ముందుకు దూసుకు వెళ్తోంది. అయితే ఈ టోర్నమెంట్ పైన కావాలనే కొంత మంది విష ప్రచారం చేస్తున్నారు. మొన్నటి వరకు పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు, ఐపీఎల్ టోర్నమెంట్ పై దుమ్మెత్తి పోశారు. పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ ముందు ఐపిఎల్ దేనికి పనికిరాదంటూ కారు కూతలు కూశారు. అయితే ఇదే వరుసలో ఇప్పుడు బంగ్లాదేశ్ క్రికెటర్లు కూడా మోపయ్యారు. ఐపీఎల్ కంటే పాకిస్తాన్ సూపర్ లీగ్ చాలా గొప్పదంటూ తాజాగా బంగ్లాదేశ్ క్రికెటర్ షకీబ్‌ అల్‌ హసన్ (Shakib Al Hasan) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. డబ్బుల కోసం మాత్రమే ఐపిఎల్ ఆడుతూ ఉంటారని.. అందులో క్వాలిటీ ప్లేయర్స్ ఉండబోరని బాంబు పేల్చాడు. కానీ పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్లో డబ్బులు తక్కువగా వచ్చినప్పటికీ.. హై క్వాలిటీ ఆటగాళ్లు తెరపైకి వస్తారని వెల్లడించారు. దీంతో షకీబ్ అల్ హసన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. దీనిపై ఇండియన్ ఫ్యాన్స్ కూడా కౌంటర్ ఇస్తున్నారు. గతంలో ఐపీఎల్ ఆడావు కదా? అప్పుడు ఇవేమీ గుర్తుకు రాలేదా ? అంటూ కౌంటర్ ఇస్తున్నారు.

ఐపీఎల్ లో కూడా ప్రాతినిధ్యం వహించిన షకీబ్

19 ఐపీఎల్ చరిత్రలో షకీబ్‌ అల్‌ హసన్ (Shakib Al Hasan) కూడా పాలుపంచుకున్నాడు. ఈ టోర్నమెంట్ లో ఇప్పటి వరకు మొత్తం 71 మ్యాచ్ లు ఆడాడు. 2011 సమయంలో కేకేఆర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన షకీబ్‌ అల్‌ హసన్, ఆ తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున కూడా బరిలోకి దిగాడు. ఇక ఆ తర్వాత ఐపిఎల్ టోర్నమెంట్ కు దూరమయ్యాడు. ఐపీఎల్ ద్వారా డబ్బులు సంపాదించి ఇప్పుడు పాకిస్తాన్ దేశం కోసం డబ్బా కొడుతున్నాడు.

Also Read:  Tanveer Ahmed: బాబ‌ర్ ను ( babar azam) ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

 

 

Related News

SRH Player: వైభ‌వ్ బ్యాటింగ్ చేస్తేనే టీవీ పెడ‌తా..లేక‌పోతే అస‌లు క్రికెటే చూడ‌ను

Arafat Minhas father: అరాఫత్ మిన్హాస్ క్యాచ్ ఔట్…క‌న్నీళ్లు పెట్టుకున్న కెమెరామెన్

గంభీర్‌, అజిత్ అగార్కర్ మ‌ధ్య గొడ‌వ‌లు..డ్రెస్సింగ్ రూంలో త‌న్నుకున్నారంటూ వార్త‌లు ?

PAK VS AUS: ఆస్ట్రేలియాపై భారీ విజ‌యం…పాకిస్తాన్ ప్లేయ‌ర్ల‌కు PCB బంప‌ర్ ఆఫ‌ర్

విరాట్ కోహ్లీకి ఇండియాలో ఉండ‌ట‌మే ఇష్టం లేదు..SRH ప్లేయ‌ర్ సంచ‌ల‌నం

Mohsin Naqvi: ఆస్ట్రేలియాను ఓడించాం, ఇక నెక్ట్స్ ఇండియాను మ‌ట్టిక‌రిపిస్తాం

Tanveer Ahmed: ఆఫ్ఘనిస్తాన్ బౌల‌ర్ల‌కు కోహ్లీ భ‌య‌ప‌డుతున్నాడు..అందుకే గాయం పేరు నాట‌కాలు!

Big Stories

×