E-Paper
Advertisement

బిర్యానీ తిన్నాక కూల్ డ్రింక్ తాగితే వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఇవే.. జాగ్రత్త!

బిర్యానీ తిన్నాక కూల్ డ్రింక్ తాగితే వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఇవే.. జాగ్రత్త!

Biryani with cool drink: బిర్యానీ పేరు చెబితేనే నోట్లో నీళ్లూరుతాయి. ఆ ఘుమఘుమలు, ఆ ముక్కల రుచి చూస్తుంటే ప్లేట్ ఖాళీ అయిపోవాల్సిందే. అయితే, ఈ మధ్య కాలంలో ఒక కొత్త ట్రెండ్ బాగా ముదిరిపోయింది. అదేంటంటే… వేడివేడిగా, ఘాటుగా ఉండే బిర్యానీ నములుతూ, పక్కనే ఐస్ ముక్కలు వేసిన ఓ చల్లటి కూల్ డ్రింక్ గ్లాస్ పెట్టుకోవడం. ప్రతి ముద్దకీ ఓ గుక్క కూల్ డ్రింక్ తాగకపోతే ముద్ద దిగనట్టు ఫీలైపోతున్నారు చాలామంది. పెద్ద వాళ్లే కాదు, చిన్న పిల్లలు కూడా ఈ కాంబినేషన్‌కు బానిసలైపోతున్నారు. మరి థియేటర్లలో, హోటళ్లలో సూపర్ హిట్ అయిన ఈ బిర్యానీ ప్లస్ సాఫ్ట్ డ్రింక్ కాంబినేషన్ నిజంగానే మన శరీరానికి మేలు చేస్తుందా? దీని వెనుక దాగున్న అసలు నిజాలు ఏంటో  తెలుసుకుంటే షాక్ అవ్వడం ఖాయం.

జీర్ణవ్యవస్థ పై ప్రభావం 

మనం తినే బిర్యానీలో నెయ్యి, నూనె, రకరకాల మసాలాలు, ప్రొటీన్లు, కొవ్వులు భారీగా ఉంటాయి. వీటిని జీర్ణం చేయడానికి మన జీర్ణవ్యవస్థ తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. కడుపులో ఉండే జీర్ణరసాలు ఈ కొవ్వులను కరిగించడానికి సిద్ధంగా ఉన్న సమయంలో, మనం పై నుంచి గడ్డకట్టే చల్లటి కూల్ డ్రింక్‌ను లోపలికి పంపిస్తాం. దీనివల్ల జీర్ణ ప్రక్రియ ఒక్కసారిగా మందగిస్తుంది. ఆ చల్లదనానికి బిర్యానీలోని కొవ్వులు గడ్డకట్టి, జీర్ణాశయం గోడలకు పేరుకుపోతాయి. ఫలితంగా కడుపులో గ్యాస్, ఎసిడిటీ, తీవ్రమైన కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తుతాయి. తిన్న తిండి అరగకపోగా, ఛాతీలో మంట మొదలవుతుంది.

లివర్, కిడ్నీల పనితీరుకు ఆటంకం 

కథ ఇక్కడితో ముగిసిపోదండోయ్..ఈ కాంబినేషన్ మన శరీరంలోని ప్రధాన అవయవాలైన లివర్, కిడ్నీల పనితీరును దారుణంగా దెబ్బతీస్తుంది. బిర్యానీలోని హెవీ ప్రొటీన్లు, ఫ్యాట్స్‌తో పాటు కూల్ డ్రింక్‌లోని కెమికల్స్ కలిసినప్పుడు శరీరంలో ఊహించని స్థాయిలో టాక్సిన్లు (విషపదార్థాలు) విడుదలవుతాయి. వీటిని ఫిల్టర్ చేయడానికి లివర్, కిడ్నీలు ఓవర్‌టైమ్ పనిచేయాల్సి వస్తుంది. నిరంతరం ఇలా చేయడం వల్ల కాలేయం చుట్టూ కొవ్వు పేరుకుపోయి ఫ్యాటీ లివర్ సమస్యకు, కిడ్నీల్లో రాళ్లు రావడానికి దారితీస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే, మనం అమృతంలా భావించి తినే ఈ కాంబినేషన్ లోపల నెమ్మదిగా విషంగా మారుతోందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఒక్కసారిగా స్పైక్

మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, కూల్ డ్రింక్స్‌లో ఉండే విపరీతమైన చక్కెర కంటెంట్. బిర్యానీ తిన్న వెంటనే ఈ హై-షుగర్ లిక్విడ్ లోపలికి వెళ్లడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఒక్కసారిగా స్పైక్ అవుతాయి. దీనిని కంట్రోల్ చేయడానికి ప్యాంక్రియాస్ భారీగా ఇన్సులిన్‌ను విడుదల చేయాల్సి వస్తుంది. ఈ హఠాత్తు మార్పుల వల్ల మెదడుకు వెళ్లే ఆక్సిజన్ సరఫరాలో స్వల్ప అంతరాయం కలిగి, తిన్న వెంటనే విపరీతమైన బద్ధకం, మైకం కమ్మడం లేదా తల తిరిగినట్లు అనిపిస్తుంది. బిర్యానీ తిన్నాక వచ్చే ఆ మత్తు కేవలం తిండి వల్ల కాదు, మనం తాగిన కూల్ డ్రింక్ మహిమ కూడా అని గ్రహించాలి.

కూల్ డ్రింక్ కి దూరంగా ఉంటారు కదూ

దీనికి తోడు, కూల్ డ్రింక్స్‌లో ఉండే కెఫిన్, కార్బోనేటెడ్ యాసిడ్లు, బిర్యానీలోని ఘాటైన మసాలాలతో రసాయన చర్య జరిపి, మన హార్మోన్ల సమతుల్యతను కూడా దెబ్బతీస్తాయి. ఇది మెదడు సంకేతాలపై ప్రభావం చూపి, మూడ్ స్వింగ్స్‌కు, మానసిక అలసటకు కారణమవుతుంది. ముఖ్యంగా పెరుగుతున్న చిన్న పిల్లలకు ఈ అలవాటు అస్సలు మంచిది కాదు. వారి జీర్ణవ్యవస్థ ఇంకా పూర్తిగా పరిపక్వం చెందదు కాబట్టి, చిన్న వయసులోనే ఊబకాయం, మధుమేహం బారిన పడే ప్రమాదం ఉంది. కాబట్టి, ఎంత ఇష్టమైనా సరే, బిర్యానీ తిన్న తర్వాత కూల్ డ్రింక్‌కు కనీసం రెండు గంటలైనా దూరంగా ఉండటం ముఖ్యం. వీలైతే కూల్ డ్రింక్ స్థానంలో కొద్దిగా గోరువెచ్చని నీరు లేదా తిన్న అరగంట తర్వాత కాస్త మజ్జిగ తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో ఉత్తమం.మరి మీరు కూడా తిన్న వెంటనే కూల్ డ్రింక్ కి దూరంగా ఉంటారు కదూ !

also read :లిఫ్ట్ అడిగింది.. ఫోన్ కొట్టేసింది.. సీన్ కట్ చేస్తే నడిరోడ్డుపై ఊహించని ట్విస్ట్..వైరల్ వీడియో !

Related News

ఈ కండరాలు బలంగా ఉంటే మీరు ఎక్కువ కాలం జీవిస్తారు.. డాక్టర్లు ఏం చెప్పారంటే

ఏసీకి స్టెబిలైజర్ పెట్టాలా వద్దా.. అని ఆలోచిస్తున్నారా? ఈ వివరాలు మీ కోసమే

డేటింగ్‌లో కొత్త ట్రెండ్.. పఫర్ ఫిషింగ్ డేటింగ్.. చాలా ప్రమాదకరం

40 దాటిన స్త్రీలకు యోగా బెస్టా? జిమ్ వర్కవుట్స్ అవసరమా? నిపుణులు ఏం చెబుతున్నారంటే..

AC వల్ల స్కిన్ డ్రై అవుతోందా? వైద్యులు సూచించిన ఈ టిప్స్‌తో అందాన్ని రెట్టింపు చేసుకోండి!

మీ అమ్మాయికి సంబంధాలు చూస్తున్నారా? ఈ తేదీల్లో పుట్టినవారు మంచి భర్త కాగలరు

ఫ్రిజ్‌‌ మొత్తం వస్తువులు నింపేస్తున్నారా? దాని వల్ల జరిగే నష్టాలు ఇవే

Big Stories

×