E-Paper
Advertisement

IPL Trade: అంబానీ అదిరిపోయే స్కెచ్‌..విధ్వంసకర బ్యాటర్ తో పాటు బౌల‌ర్ వ‌చ్చేశాడు

IPL Trade: అంబానీ అదిరిపోయే స్కెచ్‌..విధ్వంసకర బ్యాటర్ తో పాటు బౌల‌ర్ వ‌చ్చేశాడు
Advertisement

IPL Trade:   ఐపీఎల్ 2026 టోర్నమెంట్ ( IPL 2026 Tournament) నేపథ్యంలో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) భారీ స్కెచ్ వేస్తోంది. వచ్చిన ఏ ఒక్క ఛాన్స్ ను వదులుకోవడం లేదు ముంబై ఇండియన్స్. ట్రేడ్ ప్రక్రియను ఉపయోగించుకొని కీలక ప్లేయర్లను జట్టులోకి తీసుకుంటుంది ముంబై ఇండియన్స్. ఇందులో భాగంగానే తాజాగా ఇద్దరు డేంజర్ ప్లేయర్లను జట్టులోకి తీసుకువచ్చింది ముంబై ఇండియన్స్ యాజమాన్యం. వెస్టిండీస్ విధ్వంసకర బ్యాటర్‌ షెర్ఫేన్‌ రూథర్ ఫర్డ్ తో ( Sherfane Rutherford ) పాటు శార్దుల్ ఠాకూర్ ను ( Shardul Thakur) కొనుగోలు చేసింది.

Also Read: PAK VS SL: పాకిస్తాన్ లో చ‌చ్చినా ప‌ర్లేదు, మ్యాచ్ ఆడండి..లేక‌పోతే 2 ఏళ్ల బ్యాన్‌…శ్రీలంక బోర్డు హెచ్చ‌రిక‌లు

ముంబైలోకి విధ్వంసకర బ్యాటర్ రూథర్ ఫర్డ్

Advertisement

ఐపీఎల్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో వెస్టిండీస్ డేంజర్ ఆటగాడు షెర్ఫేన్‌ రూథర్ ఫర్డ్ ను జట్టులోకి తీసుకున్నట్లు ముంబై ఇండియన్స్ అధికారికంగా ప్రకటన చేసింది. ఏకంగా రూ. 2.6 కోట్లకు గుజరాత్ టైటాన్స్ నుంచి ట్రేడ్‌ ప్రక్రియ ద్వారా షెర్ఫేన్‌ రూథర్ ఫర్డ్ కొనుగోలు చేసినట్లు వెల్లడించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో అధికారిక పోస్టర్ కూడా వదిలింది. షెర్ఫేన్‌ రూథర్ ఫర్డ్ ఇప్పటి వరకు 200 టీ20 మ్యాచ్ లు ఆడి దుమ్ము లేపాడు. 3500కు పైగా పరుగులు చేసి బాగా రాణిస్తున్నాడు. భయంకరమైన సిక్సర్లు కొట్టడంలో షెర్ఫేన్‌ రూథర్ ఫర్డ్ దిట్ట. అందుకే ముంబై ఇండియన్స్ ఓపెనర్ గా బరిలోకి దించాలని షెర్ఫేన్‌ రూథర్ ఫర్డ్ ను కొనుగోలు చేశారట.

శార్దుల్ ను ( Shardul Thakur) సొంతం చేసుకున్న ముంబై ఇండియన్స్

టీమిండియా ఆటగాడు శార్దూల్ ఠాకూర్ కు ( Shardul Thakur) బంపర్ ఆఫర్ తగిలింది. మొన్నటి వరకు లక్నో సూపర్ జేయింట్స్‌ జట్టుకు ఆడిన ఆల్ రౌండ‌ర్ శార్దుల్ ఠాకూర్ ను ముంబై ఇండియన్స్ ట్రేడ్ ప్రక్రియ ( Trade Rule) ద్వారా కొనుగోలు చేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది. ఐపీఎల్ 2025 టోర్నమెంట్ లో ( IPL 2026 Tournament)  ఇంజురీ రిప్లేస్మెంట్ కింద శార్దూల్ ఠాకూర్ ను రెండు కోట్లకు కొనుగోలు చేశారు. అయితే ఇప్పుడు కూడా అదే ధరకు అతడిని ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసుకుంది. ముంబై ఇండియన్స్ నుంచి అర్జున్ టెండూల్కర్ ను ( Arjun Tendulkar) లక్నో ( LSG Team) తీసుకుంటుందని వార్తలు వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. కానీ దీనిపై మాత్రం ప్రకటన రాలేదు. ఇది ఇలా ఉండగా ముజీబ్ ఉర్ రెహ్మాన్, టో ప్లే, రిచర్డ్, అసలంక, కరెంట్ శర్మ, రాబిన్ మిజ్, కృష్ణన్, లిజార్డ్ విలియమ్స్ లాంటి ప్లేయర్లను ముంబై ఇండియన్స్ వదిలేసేందుకు సిద్ధమైందట. రకరకాల కారణాలవల్ల దాదాపు 9 మంది ప్లేయర్లను ముంబై ఇండియన్స్ వదిలేసేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి.

Advertisement

Also Read: PAK vs SL 2nd ODI: ఇస్లామాబాద్ లో బ్లాస్టింగ్‌..పాకిస్తాన్ నుంచి పారిపోయిన 16 మంది శ్రీలంక ప్లేయ‌ర్లు, వ‌న్డే సిరీస్ ర‌ద్దు ?

 

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×