E-Paper
Advertisement

PAK vs SL 2nd ODI: ఇస్లామాబాద్ లో బ్లాస్టింగ్‌..పాకిస్తాన్ నుంచి పారిపోయిన 16 మంది శ్రీలంక ప్లేయ‌ర్లు, వ‌న్డే సిరీస్ ర‌ద్దు ?

PAK vs SL 2nd ODI: ఇస్లామాబాద్ లో బ్లాస్టింగ్‌..పాకిస్తాన్ నుంచి పారిపోయిన 16 మంది శ్రీలంక ప్లేయ‌ర్లు, వ‌న్డే సిరీస్ ర‌ద్దు ?
Advertisement

PAK vs SL 2nd ODI: పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు మరో ఊహించని ఎదురు దెబ్బ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పాకిస్తాన్ లో జరగాల్సిన ట్రై సిరీస్ కు ఆఫ్ఘనిస్తాన్ దూరం కాగా, ఇప్పుడు శ్రీలంక కూడా వ‌న్డే టోర్నమెంట్ నుంచి తప్పుకోవాలని భావిస్తోంది. ప్ర‌స్తుతం పాకిస్తాన్-లంక మ‌ధ్య వ‌న్డే సిరీస్ జ‌రుగుతోంది. ఆ టోర్న‌మెంట్ నుంచి త‌ప్పుకోవాల‌ని శ్రీలంక ప్లేయ‌ర్లు భావిస్తున్నారు. ఇస్లామాబాద్ నగరంలో ( islamabad ) భారీ బాంబు పేలుడు జరిగింది. ఈ పేలుడు సంఘటనలో ఏకంగా 12 మంది సాధారణ ప్రజలు మరణించారని సమాచారం. అయితే ఈ సంఘటన జరిగిన నేపథ్యంలో పాకిస్థాన్ లోనే ఉన్న శ్రీలంక క్రికెటర్లు గజగజ వణికి పోతున్నారు. గతంలో జరిగిన ప్రమాదాన్ని గుర్తు చేసుకుంటూ, పాకిస్తాన్ ను వదిలి శ్రీలంకకు వెళ్లిపోవాలని భావిస్తున్నారు.

శ్రీలంక వర్సెస్ పాకిస్తాన్ వన్డే సిరీస్ రద్దు?

పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ లో తాజాగా భారీ పేలుడు ( Islamabad bomb blast ) సంఘటన చోటు చేసుకుంది. ఉగ్రవాదులు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో దాదాపు 12 మంది మరణించగా 27 మందికి గాయాలయ్యాయి. అయితే ఈ పేలుడు సంఘటనకు రావాల్పిండి స్టేడియానికి ( Rawalpindi Cricket Stadium) కేవలం 17 కిలోమీటర్ల దూరం మాత్రమే. గురువారం రోజున అంటే నవంబర్ 13వ తేదీన పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక ( Pakistan vs Sri Lanka) మధ్య రెండో వన్డే మ్యాచ్ జరగాల్సి ఉంది. ఈ మ్యాచ్ రావాల్పిండి క్రికెట్ స్టేడియంలోనే నిర్వహించనున్నారు. ఇప్పటికే రెండు జట్లు కూడా రావాల్పిండిలో ప్రాక్టీస్ కూడా చేస్తున్నాయి. అలాంటి సమయంలోనే రావాల్పిండి స్టేడియానికి 17 కిలో మీటర్ల దూరంలో బాంబు బ్లాస్టింగ్ జరిగింది. దీంతో శ్రీలంక జట్టుకు చెందిన 16 మంది ప్లేయర్లు ( With including Staff) ఇంటికి వెళ్తామని ఇప్పటికే పాకిస్తాన్ బోర్డుకు సమాచారం ఇచ్చారట.

Advertisement

అటు శ్రీలంక బోర్డుకు కూడా ప్లేయర్లంద‌రూ కలిసి ఫిర్యాదు అయినట్లు తెలుస్తోంది. ఇక్కడే ఉంటే మళ్ళీ బాంబు బ్లాస్ట్ జరిగే ప్రమాదం పొంచి ఉందని, 2009 సంవత్సరంలో జరిగిన సంఘటనను గుర్తు చేస్తూ శ్రీలంక ప్లేయర్లు వణికిపోతున్నారట. ముఖ్యంగా శ్రీలంక జట్టులో ఉన్న ఎనిమిది మంది కీలక ప్లేయర్లు, ఇంటికి వెళ్లాలని డిసైడ్ అయ్యారట. ఏది ఏమైనా ఈ సిరీస్ రద్దు చేసుకొని వెళ్దామని అనుకుంటున్నారట. ఆ 8 మందికి తోడు మ‌రో 8 మంది కూడా తోడు అయ్యార‌ట‌. అంటే 16 మందికి వెళిపోవ‌డానికి సిద్ధం అయ్యార‌ట‌. దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది. అయితే శ్రీలంక ప్లేయర్లు మొండిపట్టు పట్టడంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తల పట్టుకుంటుంది. తెల్లారితే మ్యాచ్, ఆతిథ్య శ్రీలంక జట్టు వెళ్లిపోతే పాకిస్తాన్ దేశంలో ఏ ఒక్క టీం కూడా అడుగుపెట్టే ఛాన్స్ ఉండదు. ఇది ఇజ్జత్ కా సవాల్ మ్యాటర్. దీంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఏం చేయాలో తోచక తల పట్టుకుంటోంద‌ట‌.

శ్రీలంక ప్లేయర్లపై 2 ఏళ్ల బ్యాన్ వేస్తామ‌ని బెదిరింపులు ?

పాకిస్తాన్ గడ్డపై జరగాల్సిన 3 వ‌న్డేల‌ సిరీస్ పూర్తి చేసి రావాల్సిందేనని తమ ప్లేయర్లకు శ్రీలంక క్రికెట్ బోర్డు కీలక ఆదేశాలు ఇచ్చిందట. మధ్యలో సిరీస్ రద్దు చేసుకొని వస్తే, రెండేళ్ల పాటు బ్యాన్ విధిస్తామని హెచ్చరికలు కూడా జారీ చేసిందని సమాచారం. ప్రతి ఒక్కరూ పాకిస్తాన్ లోనే ఉండాలని, సిరీస్ మధ్యలో భయపడి ఎవరైనా వస్తే, రెండేళ్ల పాటు బ్యాన్ విధిస్తామని వార్నింగ్ ఇచ్చిందట. దీంతో శ్రీలంక ప్లేయర్లు కూడా ఏం చేయాలో తోచక చాలా ఇబ్బందులు పడుతున్నారట. మరి దీనిపై మ‌రికాసేప‌ట్లోనే క్లారిటీ రానుంది.

Advertisement

 

 

 

Related News

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ పాకిస్తాన్ కు అందిస్తా..లేక‌పోతే త‌ల న‌రుక్కుంటా ?

డ‌బుల్ సెంచ‌రీ చేయ‌కుండా ద్రవిడ్ అడ్డుకున్నాడు..స‌చిన్ సంచ‌ల‌నం !

కావ్య పాప‌ పెళ్లికి పాకిస్తాన్ క్రికెట‌ర్లు…SRHను బ్యాన్ చేయాలంటూ మ‌ళ్లీ పోస్టులు ?

పుట్టినిల్లా ? మెట్టినిల్లా ? బక్కోడిని ఆడుకుంటున్న ఐపీఎల్ ఫ్యాన్స్

ఒరేయ్ ఇన్ని రోజులు ఎక్క‌డున్నావ్ రా? న‌మ‌న్ ధీర్ బ్యాటింగ్ చూసి బిత్త‌ర‌పోయిన గంభీర్‌

విండీస్, టీమిండియా మ్యాచ్ రద్దు… వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారంటూ తన్వీర్ అహ్మద్ కామెంట్!

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

Big Stories

Advertisement
×