E-Paper
Advertisement

PAK VS SL: పాకిస్తాన్ లో చ‌చ్చినా ప‌ర్లేదు, మ్యాచ్ ఆడండి..లేక‌పోతే 2 ఏళ్ల బ్యాన్‌…శ్రీలంక బోర్డు హెచ్చ‌రిక‌లు

PAK VS SL: పాకిస్తాన్ లో చ‌చ్చినా ప‌ర్లేదు, మ్యాచ్ ఆడండి..లేక‌పోతే 2 ఏళ్ల బ్యాన్‌…శ్రీలంక బోర్డు హెచ్చ‌రిక‌లు
Advertisement

PAK VS SL:  శ్రీలంక వర్సెస్ పాకిస్తాన్  ( Pakistan vs Sri Lanka ) మధ్య ప్రస్తుతం వన్డే సిరీస్ కొనసాగుతోంది. అయితే ఈ వన్డే సిరీస్ జరుగుతున్న నేపథ్యంలో ఇస్లామాబాద్ ( Islamabad bomb blast  ) నగరంలో భారీ పేలుడు సంభవించింది. ఈ సంఘటన నేపథ్యంలో ఏకంగా 12 మంది మరణించగా 27 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీళ్ళందరూ అత్యంత క్రిటికల్ పరిస్థితిలో ఉన్నారని వైద్యులు చెబుతున్నారు. అయితే బాంబు బ్లాస్ట్ ( bomb blast) జరిగిన సమీపంలోనే  రావల్ పిండి స్టేడియం ఉంది. ఈ వేదికగానే పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక మధ్య ఇవాళ రెండో వన్డే మ్యాచ్ జరగనుంది. బ్లాస్టింగ్ విషయం తెలియగానే మొత్తం ఎనిమిది మంది ప్లేయర్లు ఇంటికి వెళ్లి పోతామని పాకిస్తాన్ తో పాటు శ్రీలంక బోర్డు కు సమాచారం ఇచ్చారట లంక క్రికెటర్లు. వాళ్లకు తోడుగా మరో ఎనిమిది మంది జత అయినట్లు సమాచారం. దీంతో పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక మధ్య జరిగే వన్డే సిరీస్ రద్దు కాబోతుందని వార్తలు వైరల్ గా మారాయి.

Also Read: IPL 2026 Released Players List: 10 ఫ్రాంచైజీలు రిలీజ్ చేసేది ప్లేయ‌ర్లు వీళ్లే..లిస్ట్ లో ర‌షీద్‌, ష‌మీ కూడా?

రంగంలోకి దిగిన శ్రీలంక బోర్డు

Advertisement

శ్రీలంక వర్సెస్ పాకిస్తాన్ మధ్య వన్డే సిరీస్ రద్దు అవుతుందన్న వార్తలు వైరల్ అయిన క్షణాల్లోనే శ్రీలంక క్రికెట్ బోర్డు రంగంలోకి దిగింది. బ్లాస్టింగ్ విషయంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో చర్చలు కూడా చేసింది. అయితే ఈ రెండు బోర్డుల మధ్య దాదాపు రెండు గంటల పాటు చర్చలు జరిగాయి. శ్రీలంక క్రికెటర్లకు పూర్తిస్థాయిలో భద్రత కల్పిస్తామని పాకిస్తాన్ భరోసా కల్పించిందట. ఎలాంటి హాని జరగకుండా చూసుకుంటామని తెలిపిందట. అయితే పాకిస్తాన్ నుంచి స్పష్టమైన భరోసా వచ్చిన నేపథ్యంలో శ్రీలంక బోర్డు కూడా ఓకే చెప్పింది. దీంతో షెడ్యూల్ ప్రకారమే శ్రీలంక వర్సెస్ పాకిస్తాన్ మధ్య వన్డే సిరీస్ జరుగుతుందని ప్రకటన వెలువడింది. ఈ మేరకు శ్రీలంక బోర్డు స్పష్టం చేసింది. అంటే ఇవాళ మధ్యాహ్నం ఎప్పటి లాగానే పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక మధ్య రెండో వన్డే ప్రారంభం కానుంది.

పాకిస్తాన్ నుంచి శ్రీలంకకు వస్తే రెండేళ్ల బ్యాన్ ?

పాకిస్తాన్ తో జరుగుతున్న వన్డే సిరీస్ నేపథ్యంలో బాంబు దాడులకు భయపడి, తిరిగి స్వదేశానికి వచ్చేస్తే బాగోదని శ్రీలంక బోర్డు ( Srilanka cricket board) వార్నింగ్ ఇచ్చింది. 8 మంది ప్లేయర్లు స్వదేశానికి వస్తే వాళ్ల స్థానంలో కొత్తగా 8 ప్లేయర్లను మళ్లీ పాకిస్తాన్ కు పంపిస్తామని ప్రకటన కూడా విడుదల చేసింది శ్రీలంక బోర్డు. స్వదేశానికి తిరిగి వచ్చిన ప్లేయర్లపై క్రికెట్ ఆడకుండా రెండేళ్ల బ్యాన్ కూడా విధిస్తామని హెచ్చరికలు జారీ చేసింది. ఈ ప్రకటన చేయడంతో శ్రీలంక క్రికెటర్లు వెనక్కి తగినట్లు సమాచారం. దీంతో వన్డే సిరీస్ ఎప్పటిలాగే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Advertisement

Also Read: Arshdeep Singh: రూ.4 కోట్ల కారు కొన్న అర్ష్‌దీప్ సింగ్..మైలేజ్‌, ఫీచ‌ర్స్ తెలిస్తే దిమ్మ‌తిరిగిపోవాల్సిందే

 

Related News

మిస్ట‌ర్ భువీ..ఇక చాలు, అన్ని మూసుకుని రిటైర్మెంట్ ఇచ్చి ఇంట్లో కూర్చో

ఇలానే వదిలేస్తే, ఇమ్రాన్ ఖాన్ ఏ క్షణమైనా చావడం పక్కా..!

దున్న‌పోతుల్లా తిన‌డం త‌ప్ప‌…మా ద‌ద్ద‌మ్మ‌ల‌కు ఆడ‌టం చేత‌కాదు

రిటైర్మెంట్ ఇచ్చే వ‌రకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ గా కొన‌సాగుతాడు

బాబర్ ఆజం, షాహీన్ అఫ్రిది మధ్య గొడవలే పాకిస్తాన్ కు ఈ దరిద్రం

బాబ‌ర్ ఆజంకు చేత‌కాదు, నాకు కెప్టెన్సీ ఇవ్వండి !

నేను లేక‌పోతే..టీమిండియాలో ధోని అడుగు పెట్టేవాడే కాదు!

ధోని తల పగలగొట్టాలని బంతులు వేశా.. షోయబ్ అక్తర్ సంచ‌ల‌నం!

Big Stories

Advertisement
×