Shikhar Dhawan Engagement: టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ ( Shikhar Dhawan) తన బ్యాచ్ లర్ లైఫ్ కు ఫుల్ స్టాప్ పెట్టబోతున్నాడు. తన ప్రియురాలు సోఫీ షైన్ ను త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇందులో భాగంగానే తాజాగా తన ప్రియురాలు సోఫీ షైన్ తో ( Sophie Shine) సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు ధావన్. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా అధికారిక ప్రకటన చేశాడు శిఖర్ ధావన్. త్వరలో ఒకటి కాబోతున్న తమ జంటను ఆశీర్వదించండి అంటూ పోస్ట్ పెట్టాడు. దీంతో శిఖర్ ధావన్ ఎంగేజ్మెంట్ ఫోటో వైరల్ గా మారింది. ఇది చూసిన శిఖర్ ధావన్ ఫ్యాన్స్ ( Shikhar Dhawan Engagement) సంబరపడిపోతున్నారు. కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా ఫిబ్రవరి చివరలో టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ ( Shikhar Dhawan) , సోఫీ షైన్ వివాహం జరుగనున్నట్లు సమాచారం అందుతోంది.
టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ ( Shikhar Dhawan) తాజాగా ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు. తన రూమర్ ప్రియురాలు సోఫీ షైన్ తో ఎంగేజ్ మెంట్ చేసుకున్నాడు. క్రిస్టియన్ పద్దతిలో టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్, సోఫీ షైన్ ఎంగేజ్ మెంట్ చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. రింగులు మార్చుకుని, లవ్ సింబల్ బ్యాక్ డ్రాప్ లో ఫోటోలు దిగారు. ఈ ఫోటోలను షేర్ చేశాడు మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ ( Shikhar Dhawan).
ఇక టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ ( Shikhar Dhawan) అలాగే ఐరిష్ స్నేహితురాలు సోఫీ షైన్ వివాహం ఫిబ్రవరి మూడవ వారంలో జరగనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలోని ఎన్సీఆర్ ప్రాంతంలో శిఖర్ ధావన్ వివాహం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకే ఇవాళ ఎంగేజ్మెంట్ కూడా జరిగినట్లు చెబుతున్నారు. శిఖర్ ధావన్ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఫ్యాన్స్.
శిఖర్ ధావన్ రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు. సోఫీ షైన్ అనే ఐర్లాండ్ కు చెందిన కార్పొరేట్ ఉద్యోగిని పెళ్లి చేసుకుంటున్నాడు ధావన్. ధావన్ ఫౌండేషన్ కు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గా ఆమె ప్రస్తుతం పని చేస్తున్నారు. వీళ్ళిద్దరికీ దుబాయిలో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ప్రేమించుకుని ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు. కాగా ఇప్పటికే ఆయోషా ముఖర్జీని 2012లో శిఖర్ ధావన్ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆమెకు 2023లో విడాకులు ఇచ్చాడు శిఖర్ ధావన్. ఈ జంటకు జొరావర్ అనే కుమారుడు కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికి కూడా జొరావర్ కు శిఖర్ ధావన్ డబ్బులు పంపిస్తోన్న సంగతి తెలిసిందే.