E-Paper
Advertisement

Shivam Dube Wife Anjum Khan: అల్లా దయతోనే టీమిండియా విజ‌యం..శివమ్ దూబే భార్య వివాదాస్పద పోస్ట్, ఇంత‌కీ అంజుమ్ ఖాన్ ఎవ‌రు ?

Shivam Dube Wife Anjum Khan:  అల్లా దయతోనే టీమిండియా విజ‌యం..శివమ్ దూబే భార్య వివాదాస్పద పోస్ట్, ఇంత‌కీ అంజుమ్ ఖాన్ ఎవ‌రు ?

Shivam Dube Wife Anjum Khan: టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ఫైనల్ ( T20 World Cup 2026 tournament )  విజేతగా టీమిండియా నిలిచిన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం ( Narendra Modi Stadium, Ahmedabad) వేదికగా టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ ( (Team  India vs New Zealand, Final ) మధ్య ఆదివారం రోజున ఫైనల్ జరిగింది. అయితే ఈ ఫైనల్ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన టీమిండియా విజేతగా నిలిచింది. 96 పరుగుల తేడాతో టీమిండియా విక్టరీ సాధించింది. ఈ తరుణంలో ముచ్చటగా మూడోసారి టీ20 ప్రపంచ కప్ టోర్నమెంట్ గెలుచుకున్న జట్టుగా చరిత్ర సృష్టించింది ఇండియా. అయితే టీమిండియా విజయం సాధించిన నేపథ్యంలో ఆల్రౌండర్ శివమ్‌ దూబే ( Shivam Dube ) భార్య అంజుమ్ ఖాన్ ( Anjum Khan ) వివాదాస్పద పోస్ట్ పెట్టారు. టీమిండియా విజయం వెనక అల్లా ఉన్నాడని సంచలన పోస్టు పెట్టారు శివ‌మ్ దూబే భార్య అంజుమ్ ఖాన్‌. ఆ అల్లా కార‌ణంగా టీమిండియా ఛాంపియ‌న్ అయింద‌న్నారు. దీంతో ఆమెపై దారుణంగా ఇండియన్ ఫాన్స్ ట్రోలింగ్ చేస్తున్నారు.

Also Read: IND VS NZ Final: అహ్మ‌దాబాద్ మ‌ట్టిని నుదిటన రాసుకున్న సూర్య కుమార్, రోహిత్ శర్మను మించి సెల‌బ్రేష‌న్స్‌

శివమ్ దూబే భార్య వివాదాస్పద పోస్ట్

టీమిండియా ముచ్చటగా మూడవసారి ఛాంపియన్ అయిన సంగతి తెలిసిందే. ఫైనల్స్ లో అద్భుతంగా రాణించిన టీమిండియా, మూడోసారి ప్రపంచ కప్ గెలుచుకుంది. దీంతో భారత దేశ వ్యాప్తంగా సంబరాలు సంబరాన్ని ఉంటాయి. అయితే ఈ సందర్భంగా క్రికెట్ అభిమానులు, మాజీ క్రికెటర్లు, రాజకీయ ప్రముఖులు అందరు టీమిండియా జట్టుకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా టీమిండియా ఆల్ రౌండర్ శివమ్ దూబే సతీమణి అంజుమ్ ఖాన్ ( Anjum Khan ) వివాదాస్పద పోస్ట్ పెట్టారు. మాషా అల్లా.. అల్హిందులిల్లా అంటూ చేసిన ప్రార్థన ఫలించిందని వెల్లడించారు అంజుమ్ ఖాన్. ఆ అల్లాకు ప్రార్థనలు చేయడం వల్ల టీమిండియా టైటిల్ గెలిచిందని వివరించారు.

ఎవరెన్ని విమర్శలు చేసిన.. టీమిండియా విజయం వెనక అల్లా ఉన్నాడని తెలిపారు. తన భర్త కూడా వరల్డ్ కప్ కోసం చాలా కష్టపడ్డాడని గుర్తు చేశారు. అయితే శివమ్ దూబే భార్య అంజుమ్ ఖాన్ అల్లాను మెచ్చుకుంటూ చేసిన పోస్టులపై హిందువులు అలాగే క్రికెట్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. మీ అల్లా వల్ల టీమిండియా కు టైటిల్ రాలేదని, టీమిండియా ప్లేయర్లు అందరూ బాగా ఆడితేనే టైటిల్ వచ్చిందని కౌంటర్ ఇస్తున్నారు. తమ హనుమంతుని వల్ల టీమిండియా మూడోసారి ఛాంపియన్ అయిందని మరి కొంత మంది హిందువులు కౌంటర్ గా పోస్టులు పెట్టి ఆమెను ఆడుకుంటున్నారు. అదే సమయంలో సంజు శాంసన్ అభిమానులు కూడా కొంతమంది జీసస్ పోస్టులు పెడుతున్నారు.

ఇంత‌కీ అంజుమ్ ఖాన్ ఎవ‌రు ?

అంజుమ్ ఖాన్ ఓ ముస్లిం మహిళ. ఆమె ఉత్తరప్రదేశ్ లో జన్మించి అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ నుంచి పట్టా పొందారు. ప్రముఖ మోడల్, హిందీ సీరియల్స్ నటిగా కూడా ఆమె రాణించారు. కొన్ని బాలీవుడ్ సినిమాలకు వాయిస్ ఓవర్ కూడా ఇచ్చారు అంజుమ్ ఖాన్. 2021 జూలైలో శివ‌మ్ దూబే, అంజుమ్ ఖాన్ హిందూ అలాగే ముస్లిం సంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకున్నారు. శివ‌మ్ దూబే కంటే అంజుమ్ ఖాన్ ఏడు సంవత్సరాలు పెద్దది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

Also Read: IND VS NZ Final: ముచ్చ‌ట‌గా మూడోసారి..టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విశ్వ విజేత‌గా టీమిండియా, ఫ్రైజ్ మ‌నీ ఎన్ని కోట్లంటే

 

 

Related News

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

రెండోసారి ఛాంపియ‌న్ గా RCB..ప్ర‌మాదంలో సూర్య‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ భ‌విష్య‌త్తు !

Tanveer Ahmed: విరాట్ కోహ్లీ మ‌గాడైతే, పాకిస్తాన్ పిచ్ ల‌పై ఆడి చూపించాలి

లాహోర్ గ‌డ్డ‌పై విరాట్ కోహ్లీ ప్లకార్డులు…గూస్ బంప్స్ రావాల్సిందే

Big Stories

×