E-Paper
Advertisement

Shoaib Akhtar On PSL: అమ్మాయి-అబ్బాయి లేకుండా పెళ్లి చేస్తారా ? అభిమానుల‌ను నిషేధించ‌డంపై షోయ‌బ్ అక్త‌ర్ సీరియ‌స్

Shoaib Akhtar On PSL: అమ్మాయి-అబ్బాయి లేకుండా పెళ్లి చేస్తారా ? అభిమానుల‌ను నిషేధించ‌డంపై షోయ‌బ్ అక్త‌ర్ సీరియ‌స్
Advertisement

Shoaib Akhtar On PSL:  పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Pakistan Super League 2026 Tournament) మరో 48 గంటల్లోనే ప్రారంభం కానుంది. మార్చి 26వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్న ఈ మెగా టోర్నమెంట్ దాదాపు నెల రోజులు కొనసాగుతుంది. అయితే ముందుగా ప్రేక్షకుల సమక్షంలోనే టోర్నమెంట్ నిర్వహించాలనుకుని సన్నద్ధమైన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో వెనక్కి తగ్గింది. దీంతో ప్రేక్షకులు లేకుండానే పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ నిర్వహించేందుకు నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయం పై సోషల్ మీడియాలో అలాగే పాకిస్తాన్ మాజీ క్రికెటర్ల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలను ఎదుర్కొంటోంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. తాజాగా ఈ అంశంపై పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ ( Shoaib Akhtar ) స్పందించారు. అమ్మాయి, అబ్బాయి లేకుండా పెళ్లి చేస్తారా? అంటూ సీరియస్ అయ్యారు. అభిమానులు లేకుండా పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ నిర్వహించడం అంటే అమ్మాయి, అబ్బాయి లేకుండా పెళ్లి చేసిన‌ట్లే అంటూ వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ( Pakistan Cricket Board) చేతకానితనం వల్ల ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: TTP Warns PSL 2026: త‌ల‌లు తెగిపడ‌తాయి, వెంట‌నే పాకిస్తాన్ ను వ‌దిలి వెళ్లిపోండి..విదేశీ క్రికెట‌ర్ల‌కు ఉగ్ర‌వాదుల హెచ్చ‌రిక‌

అమ్మాయి-అబ్బాయి లేకుండా పెళ్లి చేస్తారా ? – షోయబ్ అక్తర్

Advertisement

పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ప్రేక్షకులు లేకుండానే కేవలం రెండు వేదికలలో నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తాజాగా మొహ్సిన్ న‌ఖ్వీ సంచలన ప్రకటన చేశారు. లాహోర్ అలాగే కరాచీ వేదికల్లో మాత్రమే పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ నిర్వహిస్తామని కుండ బద్దలు కొట్టి చెప్పారు. టికెట్లు కొనుగోలు చేసిన అభిమానులకు 72 గంటల్లోనే డబ్బులు వాపస్ చేస్తామని కూడా ప్రకటన చేశారు మొహ్సిన్ న‌ఖ్వీ. అయితే ప్రేక్షకులు లేకుండానే పాకిస్తాన్ సూపర్ టోర్నమెంట్ నిర్వహించడంపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు సీరియస్ అవుతున్నారు.

తాజాగా ఇదే అంశంపై పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ కూడా స్పందించారు. అభిమానులు లేకుండా పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ నిర్వహించడం అంటే, డోర్లు మొత్తం క్లోజ్ చేసి మ్యాచ్ లు నిర్వహించడమే అని మండిపడ్డారు. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు లేకుండా అసలు పెళ్లి చేస్తారా? ఇప్పుడు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వ్యవహారం కూడా అలాగే ఉందని నిప్పులు చెరిగారు. అసలు అభిమానులు లేకుండా ఈ టోర్నమెంట్ నిర్వహించడం ఎందుకు ? అన్ని మూసుకొని కూర్చోవచ్చు కదా అంటూ సీరియస్ అయ్యారు. అభిమానులు లేకుండా టోర్నమెంట్ నిర్వహించడం అంటే పండగను కాస్త, అంతక్రియలుగా మార్చడమే అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇది ఇలా ఉండగా, పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ మార్చి 26వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. మొదటగా 6 వేదికలలో ప్రేక్షకులతో ఈ టోర్నమెంట్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆఫ్ఘనిస్తాన్ తో యుద్ధం, చమురు కొరత ఉన్న నేపథ్యంలో ప్రేక్షకులు లేకుండానే టోర్నమెంట్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.

Advertisement

 

https://www.facebook.com/story.php?story_fbid=781919721659269&id=100095237447650&post_id=100095237447650_781919721659269&rdid=NuF4ATeeOARXQMXJ#

Related News

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

Big Stories

Advertisement
×