E-Paper
Advertisement

బీసీసీఐ రూల్స్ బ్రేక్…మ‌తిమ‌రుపులో రోహిత్ శ‌ర్మ‌ను మించిపోయిన శ్రేయ‌స్ అయ్య‌ర్

బీసీసీఐ రూల్స్ బ్రేక్…మ‌తిమ‌రుపులో రోహిత్ శ‌ర్మ‌ను మించిపోయిన శ్రేయ‌స్ అయ్య‌ర్
Advertisement

Shreyas Iyer Shoes:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) ఉత్కంఠ భరితంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే 40 శాతం మ్యాచులు కూడా ఫినిష్ అయ్యాయి. నిన్న పంజాబ్ కింగ్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ ( Punjab Kings vs Lucknow Super Giants) మధ్య 29వ మ్యాచ్ కూడా జరిగింది. ఈ మ్యాచ్ నేపథ్యంలో అద్భుతంగా రాణించిన పంజాబ్ కింగ్స్ 54 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ విజయం తర్వాత పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్ కోసం వెళ్లే ముందు చెప్పులు వేసుకొని కనిపించాడు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ( Shreyas Iyer). బీసీసీఐ రూల్స్ ప్రకారం షూస్ వేసుకొని మాత్ర‌మే పోస్ట్ ప్రెజెంటేషన్ లో ( post-match presentation) పాల్గొనాల్సి ఉంటుంది. ఇక గ్రౌండ్ మధ్యలోకి వెళ్లిన తర్వాత చేసేదేమీ లేక ఒక కెమెరామెన్ ను రిక్వెస్ట్ చేసి అతడి షూస్ వేసుకున్నాడు. అనంత‌రం పోస్ట్ ప్రెజెంటేష‌న్ లో పాల్గొన్నాడు అయ్య‌ర్‌. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన క్రికెట్ ఫ్యాన్స్, ఫిదా అయిపోతున్నారు. శ్రేయ‌స్ అయ్య‌ర్ సింప్లిసిటీని మెచ్చుకుంటున్నారు.

Also Read: Blessing Muzarabani: న‌ఖ్వీకి చిప్పు దొబ్బిందా ? బ్యాన్ లేదు బొంగు లేదు, PSL కాలి గోటితో సమానం

మ‌తిమ‌రుపులో రోహిత్ శ‌ర్మ‌ను మించిపోయిన శ్రేయ‌స్ అయ్య‌ర్

Advertisement

ఏప్రిల్ 19 అంటే నిన్నటి రోజున పంజాబ్ కింగ్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య బిగ్ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో గ్రాండ్ విక్టరీ కొట్టింది పంజాబ్. అయితే మ్యాచ్ గెలిచిన సంతోషంలో రోహిత్ శర్మ తరహా లోనే షూలు వేసుకోవడం మర్చిపోయాడు శ్రేయస్ అయ్యర్. స్లిప్పర్స్ తోనే పోస్ట్ ప్రెజెంటేషన్ కోసం వెళ్లే ప్రయత్నం చేశాడు అయ్యర్. అయితే పక్కన ఉన్న పంజాబ్ కింగ్స్ సభ్యుడు… శ్రేయస్ అయ్యర్ కు చెప్పే వరకు ఈ విషయం తెలియలేదు.

ఇక అతడు చెప్పగానే చేసేదేమీ లేక కెమెరామాన్ దగ్గరికి వెళ్లి అతడి షూలు వేసుకున్నాడు శ్రేయస్ అయ్యర్. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన క్రికెట్ అభిమానులు రక రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. శ్రేయస్ అయ్యర్ చాలా సింపుల్ గా ఉంటాడని.. అందుకే కెమెరామెన్ ఇచ్చిన షూలు కూడా వేసుకున్నాడని కొనియాడుతున్నారు. రోహిత్ శర్మను మించిపోయిన మతిమరుపు శ్రేయస్ అయ్యర్ కు కూడా ఉందని మరి కొంతమంది దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.

బీసీసీఐ రూల్స్ బ్రేక్..

Advertisement

బీసీసీఐ రూల్స్ ప్రకారం సాధారణ అడ్రస్ కోడ్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తోంది. జబ్బలు కనిపించేలా జెర్సీలు ధరించి మైదానాలలో కనిపించకూడదని ఇప్పటికే వార్నింగ్ ఇచ్చింది. జెర్సీతో పాటు షూలు కూడా వేసుకోవాలని పేర్కొంది. అలా కాదని పోస్టు మ్యాచ్ ప్రెజెంటేషన్ లో కూడా పాల్గొనకూడదని హెచ్చరించింది. అందుకే శ్రేయస్ అయ్యర్ వెంటనే కెమెరామెన్ షూలు వేసుకున్నాడు.

 

Also Read:  Ameesha Patel-Kohli: జర్మనీ పిల్ల ఫోటోకు కోహ్లీ లైక్‌..చెప్పు తెగుద్ది అంటూ హీరోయిన్ వార్నింగ్ Ameesha Patel-Kohli

 

Related News

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

Big Stories

Advertisement
×