E-Paper
Advertisement

ఏపీ సచివాలయ నేత వెంకట్రామిరెడ్డికి కోలుకోలేని దెబ్బ.. 14 ఏళ్ల సర్వీసు ఉండగానే వేటు!

ఏపీ సచివాలయ నేత వెంకట్రామిరెడ్డికి కోలుకోలేని దెబ్బ..  14 ఏళ్ల సర్వీసు ఉండగానే వేటు!
Advertisement

K Venkatrami Reddy dismissed: ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు కె. వెంకట్రామిరెడ్డిని ప్రభుత్వం ఉద్యోగం నుండి శాశ్వతంగా తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. అంతే కాకుండా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా నిలిపివేసింది ప్ర‌భుత్వం. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ (GAD) జీవో ఎంఎస్ నంబర్ 43ను విడుదల చేసింది.

2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి సర్వీస్ నిబంధనలను ఉల్లంఘించి, వైఎస్‌ఆర్‌సీపీ (YSRCP)కి అనుకూలంగా ప్రచారం చేశారనేది ప్రధాన ఆరోపణ. ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూ రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనడం తీవ్రమైన క్రమశిక్షణారాహిత్యం కిందకు వస్తుందని విచారణలో నిర్ధారించారు.

Advertisement

వెంకట్రామిరెడ్డి గత కొన్నేళ్లుగా రాజకీయంగా వివాదాస్పద వ్యక్తిగా నిలిచారు. గత ఎన్నికల సమయంలో వెంకట్రామిరెడ్డి తన అధికార పరిధిని దాటి వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ నేతలు అనేకమార్లు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆయన సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా ఉంటూ, ప్రభుత్వ నిర్ణయాలకు బాధ్యతాయుతంగా మద్దతు ఇచ్చేవారనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఆయన కడప జిల్లాలో వైసీపీ కోసం పనిచేశారని ఈసీకి నివేదికలు అందాయి.

Advertisement

ఈ ఆరోపణలపైనే ఏప్రిల్ 2024లో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఆయనను ప్రభుత్వం తొలిసారి సస్పెండ్ చేసింది. అప్పటి నుండి కొనసాగిన విచారణ ఇప్పుడు ఆయన శాశ్వత తొలగింపునకు దారితీసింది.సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి ఇలా రాజకీయ వివాదాల్లో చిక్కుకుని ఉద్యోగం కోల్పోవడం అరుదుగా జరుగుతుంటుంది. దీనివల్ల ఆయన తన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా కోల్పోవడం పెద్ద దెబ్బే.

Read Also: ప్రకటనల కోసం కోట్లు వృథా చేయం.. విద్యా ప్రమాణాలే మా బలం.. ఉపాధ్యాయులకు లోకేష్ సెల్యూట్

Related News

స్థానిక ఎన్నికల వేల నేతలకు సీఎం చంద్రబాబు వార్నింగ్.. ఎమన్నారంటే?

ఎంపీ మిథున్ రెడ్డికి బిగ్ షాక్.. ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే చాన్స్..?

ఏపీలో తీవ్ర విషాదం.. అమలాపురం మాజీ ఎంపీ బుచ్చిబాబు కన్నుమూత!

తెలుగుదేశం పార్టీ రెండో జాబితా విడుదల.. ఇందులోను మహిళలదే హవా!

పులివెందులలో హైటెన్షన్.. నామినేషన్ కేంద్రం వద్ద కాల్పులు జరిపిన పోలీసులు!

సాలూరు జనసేనలో భగ్గుమన్న చైర్మన్ టికెట్ వివాదం.. కేడర్ తీవ్ర ఆగ్రహం!

రాజంపేటలో ఉద్రిక్తత.. వైసీపీ ఎమ్మెల్యే అమర్‌నాథ్ రెడ్డి ఇంటిపై దాడి!

ఏపీలో స్థానిక ఎన్నికల ఘర్షణలు.. వైఎస్ షర్మిల సంచలన కామెంట్స్!

Big Stories

Advertisement
×