MI vs PBKS: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) నేపథ్యంలో ఇవాళ ముంబై ఇండియన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ ( Mumbai Indians vs Punjab Kings) మధ్య 24 మ్యాచ్ జరుగుతోంది. ముంబైలోని వాంఖడే స్టేడియం ( Wankhede Stadium, Mumbai) వేదికగా ఈ రెండు జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ టాస్ ఓడిపోయి ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. అయితే ఈ క్రమంలో శ్రేయాస్ అయ్యర్ ఓ అద్భుతమైన క్యాచ్ పట్టి, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను ( Hardik Pandya) పెవీలియన్ కు పంపాడు. బౌండరీ గేట్ దగ్గర గాల్లోకి ఎగిరి మరీ, ఈ క్యాచ్ పట్టేశాడు శ్రేయాస్ అయ్యర్ ( Shreyas Iyer Catch). అనంతరం ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ ను దారుణంగా ర్యాగింగ్ చేశాడు శ్రేయాస్ అయ్యర్ ( Shreyas Iyer). చేతులతో సైగలు చేసి, ఇక నోర్లు మూయండిరా అంటూ ఆడుకున్నాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
Also Read: Kumar Sangakkara: PSL కోసం పాకిస్తాన్ వెళ్లొద్దు..అక్కడ స్టేడియాలపైనే బాంబులు పడతాయి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య ఇవాళ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ సందర్భంగా పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ పట్టిన స్టన్నింగ్ క్యాచ్ ఇప్పుడు వైరల్ గా మారింది. పంజాబ్ బౌలర్ యాన్సెన్ బౌలింగ్ లో హార్దిక్ పాండ్యా సిక్సర్ కోసం ప్రయత్నించాడు. దీంతో స్ట్రైట్ గా గాల్లోకి భారీ షాట్ ఆడాడు హార్థిక్ పాండ్యా. ఈ క్రమంలో బౌండరీ గేటు దగ్గర ఉన్న కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, గాల్లోకి ఎగిరి మరీ, క్యాచ్ అందుకునే ప్రయత్నం చేశాడు. అయితే బ్యాలెన్స్ తప్పిన నేపథ్యంలో వెంటనే వెనకాల ఉన్న బార్ట్ లెట్ కు అందించాడు. దీంతో హార్దిక్ పాండ్యా ఔట్ అయ్యాడు. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ ను ర్యాగింగ్ చేస్తూ శ్రేయాస్ అయ్యర్ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. అదే సమయంలో బౌండరీ గేట్ దగ్గర శ్రేయాస్ అయ్యర్ చేసిన ఫీట్ చూసి… ఇదేం క్యాచ్ రా బాబు అంటూ రోహిత్ శర్మతో పాటు సూర్యకుమార్ యాదవ్ నోరెళ్లబెట్టారు.
ముంబై వాంఖడే స్టేడియంలో పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో 20 ఓవర్లు ఆడిన ముంబై ఇండియన్స్, 6 వికెట్ల నష్టానికి 195 పరుగులు సాధించింది. అయితే ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ ఆడక పోవడంతో క్వింటన్ డికాక్ బరిలోకి దిగాడు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సెంచరీ నమోదు చేశాడు. 60 బంతుల్లో 112 పరుగులు సాధించాడు. కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ డకౌట్ కాగా నమన్ ధీర్ 50 పరుగులతో రాణించాడు. దీంతో ముంబై ఇండియన్స్ భారీ స్కోర్ చేయగలిగింది.
Also Read: Ahmed Shehzad: PSLలో వార్నర్, స్మిత్ లాంటి ఐపీఎల్ రిజెక్టెడ్ ప్లేయర్లు తప్ప, ఎవడూ మిగలలేదు
ONE OF THE GREATEST MOMENT & CATCH IN IPL HISTORY 🥶👑
– SHREYAS IYER, THE CAPTAIN….!!!! pic.twitter.com/S0us2V5qjO
— Johns. (@CricCrazyJohns) April 16, 2026
WHAT AN EFFORT BY CAPTAIN SHREYAS IYER 🥶🔥 pic.twitter.com/y5fsVBh17i
— Johns. (@CricCrazyJohns) April 16, 2026