E-Paper
Advertisement

Kumar Sangakkara: PSL కోసం పాకిస్తాన్ వెళ్లొద్దు..అక్క‌డ స్టేడియాల‌పైనే బాంబులు ప‌డ‌తాయి

Kumar Sangakkara: PSL కోసం పాకిస్తాన్ వెళ్లొద్దు..అక్క‌డ స్టేడియాల‌పైనే బాంబులు ప‌డ‌తాయి
Advertisement

Kumar Sangakkara: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League Tournament 2026) చాలా రసవత్తరంగా కొనసాగుతున్న నేపథ్యంలో మాజీ శ్రీలంక ఆటగాడు, రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ కుమార సంగక్కర సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ కోసం అత్యాశపడి ఆ దేశానికి వెళ్తే ప్రమాదమే అంటూ బాంబు పేల్చారు. డబ్బుల కోసం ఆశపడి పాకిస్తాన్ కు వెళ్తే, శవాలుగా రావడం గ్యారెంటీ అంటూ సంచలన ఆరోపణలు చేశారు కుమార సంగక్కర ( Kumar Sangakkara). 2009 మార్చి మూడవ తేదీన లాహోర్ వేదికగా జరిగిన దాడి గురించి గుర్తు చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో కుమార సంగక్కర చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Also Read: Akhtar On Naqvi: భూత‌ద్దాలు పెట్టుకోని చూడు..పెట్రోల్ విష‌యంలో ఇండియా కాలి గోటికి కూడా పాక్ స‌రిపోదు

PSL కోసం పాకిస్తాన్ వెళ్లొద్దు..అక్క‌డ స్టేడియాల‌పైనే బాంబులు ప‌డ‌తాయి

Advertisement

పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ చాలా గొప్పదంటూ ఆ దేశపు మాజీ క్రికెటర్లు పదే పదే చెబుతున్నారు. ఐపీఎల్ లోకి వెళ్లకుండా తమ టోర్నమెంట్ లో ఆడాలని కోరుతున్నారు. ఐపీఎల్ కంటే పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంటులో ప్లేయర్ లందరికీ న్యాయం జరుగుతుందని వెల్లడిస్తున్నారు. అయితే ఈ వ్యాఖ్యలు వైరల్ అయిన నేపథ్యంలో కుమార సంగక్కర స్పందించారు. పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ కోసం పాకిస్తాన్ కు వెళ్లకూడదని, అలా వెళితే అక్కడ స్టేడియాలపైనే బాంబులు పడతాయని హెచ్చరించారు.

ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పాకిస్థాన్ లో ఆడాల్సిన పరిస్థితి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. 2009లో అలాంటి పరిస్థితులను శ్రీలంక జట్టులో ఉన్న తాను అనుభవించినట్లు గుర్తు చేశారు. చూస్తుండగానే శ్రీలంక జట్టుకు సంబంధించిన బస్సు పై ఉగ్రవాదులు గ్రెనేడ్లు, తుపాకులతో దాడులు చేసినట్లు వెల్లడించారు. ఇలాంటి నేపథ్యంలో అక్కడ అడుగు పెట్టడం కంటే, ఇంట్లో కూర్చోవడం బెటర్ అంటూ సూచనలు చేశారు. శ్రీలంక క్రికెటర్లు ఎవరు కూడా పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ కోసం వెళ్లకూడదని.. ఐపీఎల్ ఆడేందుకు ఆసక్తి చూపించండి అంటూ కోరారు కుమార సంగక్కర.

2009లో అస‌లు పాక్ లో ఏం జ‌రిగింది?

Advertisement

2009లో టెస్ట్ సిరీస్ కోసం పాకిస్థాన్ లో శ్రీలంక పర్యటించింది. ఈ సందర్భంగా మ్యాచ్ రెండు రోజులు పూర్తయింది. మూడవరోజు ఆట కోసం హోటల్ నుంచి మైదానానికి శ్రీలంక ప్లేయర్లు బయలుదేరారు. ప్రత్యేక బస్సులో సెక్యూరిటీ నడుమ శ్రీలంక ప్లేయర్లు బయలుదేరడం జరిగింది. లాహూర్ లోని మెయిన్ సెంటర్ దగ్గరకు వచ్చిన తర్వాత శ్రీలంక జట్టు ఉన్న బస్సు పై ఉగ్ర దాడులు జరిగాయి. ఈ సంఘటనలో ఆరుగురు శ్రీలంక ప్లేయర్లు గాయపడ్డారు. ఉగ్రవాదుల దాడిలో ఆరుగురు పాకిస్తాన్ పోలీసులు అలాగే ఇద్దరు సాధారణ పౌరులు కూడా మరణించారు. ఈ సంఘటన జరిగిన తర్వాత దశాబ్దా కాలం పాటు పాకిస్తాన్ వెళ్లేందుకు ఇతర జట్లు చాలా భయపడ్డాయి. ఇప్పుడిప్పుడే పాకిస్తాన్ లో సాధారణ పరిస్థితిలో నెలకొంటున్నాయి.

 

Also Read: Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వైభ‌వ్ కు కూడా ల‌వ్ స్టోరీ…ఔట్ కాగానే క‌న్నీళ్లు పెట్టుకుంది క‌ద‌రా

 

 

Related News

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

Big Stories

Advertisement
×