Smriti Mandhana Marriage: టీమిండియా మహిళా క్రికెటర్ స్మృతి మందాన ( Smriti Mandhana ) పెళ్లికి బ్రేకులు పడ్డాయి. ఇవాళ జరగాల్సిన స్మృతి మందాన పెళ్లి ( Smriti Mandhana Marriage ) పీటల మీదే ఆగిపోయింది. తన ప్రియుడు ప్రముఖ సింగర్ పలాష్ ముచ్చల్ (Palash Muchhal) తో లేడీ కోహ్లీ స్మృతి మందాన పెళ్లి చేసేందుకు అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరిగాయి. మహరాష్ట్రలోని సంగ్లీలో స్మృతి వివాహం జరుగాల్సి ఉంది. అయితే పెళ్లి జరగడానికి కొన్ని క్షణాలే సమయం ఉన్న నేపథ్యంలో స్మృతి మందాన తండ్రి శ్రీనివాస్ కు గుండెపోటు ( Smriti Mandhana Father Suffers Heart Attack ) వచ్చింది. దీంతో పెళ్లి మండపంలో అందరూ ఉలిక్కిపడ్డారు. వెంటనే స్మృతి మందాన తండ్రి శ్రీనివాస్ ను ఆసుపత్రికి తరలించారు.
స్మృతి మందాన తండ్రికి ( Smriti Mandhana Father ) గుండెపోటు రావడంతో వెంటనే రియాక్ట్ అయిన కుటుంబ సభ్యులు అంబులెన్స్ కు సమాచారం అందించారు. అనంతరం పెళ్లి మండపం నుంచి ఎమర్జెన్సీ అంబులెన్స్ లోనే శ్రీనివాస్ ను ఆసుపత్రికి తరలించారు. శ్రీనివాస్ కు గుండెపోటు వచ్చిన నేపథ్యంలో టీమిండియా మహిళా క్రికెటర్ స్మృతి మందాన వివాహం నిరవధికంగా వాయిదా వేసుకున్నట్లు ఆమె మేనేజర్ తుహిన్ మిశ్రా ( Thuhin mishra) అధికారికంగా ప్రకటించారు. ఆమె తండ్రి శ్రీనివాస్ ఆరోగ్యం కుదుటపడిన తర్వాత స్మృతి మందాన వివాహం ఉంటుందని, త్వరలోనే పెళ్లి తేదీని మళ్లీ ప్రకటిస్తామని ఆయన వివరించారు. దీంతో ఈ న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ న్యూస్ చూసిన స్మృతి మందాన అభిమానులు , టీమిండియా ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. శుభకార్యం జరగాల్సిన వేళ ఇలా గుండెపోటు వచ్చింది..ఏంటీ? ఇది అశుభం అంటూ కొందరు అంటున్నారు. అయ్యో పాపం స్మృతి మందాన అంటూ మరికొందరు ఎమోషనల్ గా సోషల్ మీడియాలో రియాక్ట్ అవుతున్నారు.
ఆరు సంవత్సరాల నుంచి స్మృతి మందానా అలాగే పలాష్ ముచ్చల్ (Palash Muchhal) ప్రేమించుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవలే ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్లికి సిద్ధమయ్యారు స్మృతి మందాన, పలాష్ ముచ్చల్. దీంతో నవంబర్ 23 అంటే నేడు పెళ్లి నిర్వహించాలని రెండు కుటుంబాలు డిసైడ్ అయి, భారీగా ఏర్పాట్లు చేశారు. ఇక ఈ వివాహానికి టీమిండియా మహిళా క్రికెటర్లు జెమీమా, శ్రేయాంక , స్నేహ లాంటి వాళ్లందరూ వచ్చి సందడి చేశారు. హల్దీ వేడుకల్లో పాల్గొని రీల్స్ కూడా చేశారు. వీటికి సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు కూడా బయటకు వచ్చాయి. కానీ ఇంతలోనే స్మృతి మందాన తండ్రికి గుండెపోటు రావడంతో పెళ్లి వాయిదా పడింది. దీంతో అందరు నిరాశ చెందారు.
ஸ்மிருதி மந்தனாவின் திருமணம் ஒத்திவைப்பு!#SunNews | #SmritiMandhana | #SmritiMandhanaWedding pic.twitter.com/nOdpbx3TAz
— Sun News (@sunnewstamil) November 23, 2025