sowmya janu – Nitish Kumar: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో… సన్రైజర్స్ హైదరాబాద్.. పడుతూ లేస్తూ ముందుకు సాగుతోంది. ఇప్పటి వరకు ఈ టోర్నమెంట్ లో ఏడు మ్యాచ్లు ఆడిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు… కేవలం రెండు మ్యాచ్లోనే విజయం సాధించి పాయింట్లు పట్టికలో 9వ స్థానంలో నిలిచింది. అయితే… సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇంత కష్టాల్లో ఉన్నప్పటికీ… హైదరాబాద్ ప్లేయర్ లందరూ… చాలా ఎంజాయ్ చేస్తూ కనిపిస్తున్నారు. ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ అంటే చాలు… రాత్రి సమయంలో పబ్బులకు వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారు.
నటితో మెరిసిన నితీష్ కుమార్ రెడ్డి
హైదరాబాదులో ప్రస్తుతం.. సన్రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్లు ఉన్న సంగతి తెలిసిందే. అగ్ని ప్రమాదం జరిగిన పార్క్ హయాత్ హోటల్లోని ఐదో అంతస్తులో హైదరాబాద్ ప్లేయర్లు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. ఆ హోటల్లో ఉంటూ సాయంత్రం అయితే పబ్బులు లేదా పార్టీలకు వెళ్తున్నారు సన్రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్లు. పబ్బులకు పార్టీలకు వెళ్లి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నితీష్ కుమార్ రెడ్డి… ఓ అందాల భామతో మెరిశాడు. ఆమెతో చాలా క్లోజ్ గా కనిపించి… రచ్చ చేశాడు ఈ తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి. అయితే ఆ అమ్మాయి ఎవరో కాదు… సౌమ్య జాను.
ఈమె తెలుగు ఇండస్ట్రీ కి సంబంధించిన ఓ నటి అని చెప్పవచ్చు. యాంకర్ గా కూడా పనిచేసినట్లు సమాచారం అందుతోంది. అయితే తాజాగా సన్రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్లు ఓ పార్టీకి వెళ్లి ఎంజాయ్ చేశారు. అక్కడ మహేష్ బాబు నటించిన… గుంటూరు కారం సినిమాలోని ఓ పాటకు డాన్సులు కూడా వేశారు. గుంటూరు కారం సినిమాలోని… కుర్చీ మడత పెట్టి….. అనే పాటకు నితీష్ కుమార్ రెడ్డితో పాటు ఇషాన్ కిషన్ కూడా స్టేజి పైన డాన్సులు వేశారు. దీనికి సంబంధించిన వీడియోలు నిన్నటి నుంచి వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే ఈ పార్టీ సందర్భంగా సౌమ్య జాను కూడా అక్కడికి… రావడం జరిగింది. అందరితో ఫోటోలు దిగింది.
ముఖ్యంగా తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డితో కాస్త క్లోజ్ గా కనిపించింది సౌమ్య జాను. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇంకేముంది వాళ్ళిద్దరి మధ్య రిలేషన్…. ఉందని లోకం కూడా చూస్తోంది. వాస్తవానికి వాళ్ళిద్దరూ లవర్స్ కాదు. ఆ ఫోటోలు చూసిన క్రికెట్ అభిమానులు తప్పుగా అర్థం చేసుకొని ఇద్దరు లవర్స్ అని ప్రచారం చేస్తున్నారు. క్రికెటర్లు కనిపిస్తే చాలు సౌమ్య జాను అలాగే ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పెడుతూ ఉంటుంది. ఇప్పుడు నితీష్ కుమార్ రెడ్డి విషయంలో కూడా అదే జరిగింది.