BigTV English

BCCI Central Contracts : బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టుల్లో భారీ మార్పులు.. తప్పించిన ఐదుగురు ఎవరంటే..?

BCCI Central Contracts : బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టుల్లో భారీ మార్పులు.. తప్పించిన ఐదుగురు ఎవరంటే..?

BCCI Central Contracts :  బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్ వచ్చేసింది. ఇందులో ఊహించని ట్విస్ట్ లు ఉన్నాయని చెబుతున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, బుమ్రా కి ఎప్పటిలాగానే A+ కేటగిరిలోనే ఉంచారు. వాస్తవానికి మూడు ఫార్మాట్లు ఆడిన వారికి మాత్రమే ఈ కేటగిరి దక్కుతుంది. కానీ టీ-20 వరల్డ్ కప్ తరువాత వీరంతా కూడా ఈ ఫార్మాట్ ని ప్రకటించేశారు. నాలుగు కేటగిరిలలో కలిపి మొత్తం 34 మంది ప్లేయర్లకు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టు దక్కింది. వీరిలో A+, A, B, C కేటగిరిల వారిగా ప్లేయర్లను డివైడ్ చేశారు.


గత ఏడాది కాంట్రాక్ట్ కోల్పోయిన శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ ఈ ఏడాది సెంట్రల్ కాంట్రాక్ట్ లో మళ్లీ చోటు దక్కింది. రజత్ పాటిదార్, నితీష్ కుమార్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తిలకు తొలిసారి కాంట్రాక్ట్స్ దక్కాయి. అయితే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, బుమ్రా లను A+ కేటగిరిలో ఉంచడంతో వీరికి 7 కోట్ల వరకు చెల్లించనున్నారు. కేటగిరి ఏలో ఉన్న ఆటగాళ్లు మహ్మద్ సిరాజ్, కే.ఎల్. రాహుల్, శుభ్ మన్ గిల్, షమీ, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా కి రూ.5 కోట్లు, అలాగే కేటగిరి బీ లో టీమ్ ఇండియా టీ-20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, యశస్వి జైస్వాల్, శ్రేయాస్ అయ్యర్ ఉన్నారు. వీరికి ఏడాదికి  3 కోట్లు అందించనున్నారు. ఇక రింకు సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శివం దూబే, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, ముఖేష్ కుమార్, సంజు శాంసన్, అర్ష్ దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, రజత్ పాటిదార్, ధృవ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్, నితీష్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, ఆకాశ్ దీప్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణాలకు సీ కేటగిరికి కింద ఎంపికయ్యారు.  కేటగిరి సీలో ఉన్న ఆటగాళ్లకు రూ.1కోటి చొప్పున బీసీసీఐ చెల్లించబోతుంది.

ముఖ్యంగా భారత క్రికెటర్లు ఎప్పుడూ ఎవ్వరూ ఫామ్ లో ఉంటారో.. ఎవ్వరికీ అంతు చిక్కని ప్రశ్న అనే చెప్పాలి. ఒకరు ఫామ్ లో ఉంటే.. మరొకరూ ఫామ్ కోల్పోతుంటారు.  ముఖ్యంగా గత ఏడాది బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయిన శ్రేయాస్ అయ్యర్ అద్భుతమైన ఫామ్ తో తిరిగి రిటైనర్ షిప్ దక్కించుకున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ తరపున అత్యధిక పరుగులు చేశాడు. అలాగే గత ఏడాది ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ కి ట్రోఫీ ని కూడా అందించారు.డొమెస్టక్ క్రికెట్ లో కూడా పరుగులు భారీగానే సాధించాడు. దీంతో శ్రేయాస్ అయ్యర్ ని బీసీసీఐ బీ కేటగిరిలో చేర్చింది. అలాగే గత ఏడాది క్రమ శిక్షణ ఉల్లంఘనలతో కాంట్రాక్ట్ కోల్పోయాడు ఇషాన్ కిషన్. అయితే ఈ ఏడాది మాత్రం ఇషాన్ పై కాస్త కరుణ చూపించింది. అతడినీ సీ కేటగిరిలో చేర్చింది. దీంతో ఇషాన్ కిషన్ హర్షం వ్యక్తం చేసినట్టు సమాచారం.


Related News

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Girls In Stadium : స్టేడియంలో అందమైన అమ్మాయిలనే ఎందుకు చూపిస్తారు.. ఇది ఎలా సాధ్యం

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Big Stories

×