BigTV English

Janhvi Kapoor: బైక్ నేర్చుకుంటున్న జాన్వీ కపూర్… వెనుక నుండి లవర్ నేర్పిస్తూ.. వీడియో వైరల్

Janhvi Kapoor: బైక్ నేర్చుకుంటున్న జాన్వీ కపూర్… వెనుక నుండి లవర్ నేర్పిస్తూ.. వీడియో వైరల్
Janhvi Kapoor : టాలీవుడ్ టాప్ హీరోయిన్ అతిలోకసుందరి శ్రీదేవి వారసురాలు జాన్వి కపూర్. ధడక్ అనే హిందీ సినిమాతో చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టారు. మొదటి సినిమాతోనే పాపులర్ అయిన హీరోయిన్ జాన్వి కపూర్. బాలీవుడ్ లో తర్వాత వరుసగా సినిమాలు చేశారు. జాన్వీ క్రైస్ మూవీ చూసి దక్షిణాది చిత్ర పరిశ్రమ స్వాగతం పలికింది. అతిలోక సుందరి వారసురాలిగా దక్షిణాదితో తొలి చిత్రం దేవరలో ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో మొదటి సినిమా అయినా ఎన్టీఆర్ సరసన జాన్వికపూర్ నటించడం, సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ప్రపంచమంతా విడుదలైన ఈ సినిమా మంచి కలెక్షన్స్ సాధించడంతో.. జాన్వీ కపూర్ తెలుగులోనూ నటిగా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో మరో రెండు బడా ప్రాజెక్టులలో నటిస్తుంది జాన్వీ కపూర్. సినిమాల విషయాలు పక్కకు పెడితే జాన్వి కపూర్, శిఖర్ పహారియా ప్రేమించుకుంటున్న సంగతి తెలిసిందే, తాజాగా ఇద్దరూ కలిసి ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది జాన్వి కపూర్. ఆ పోస్ట్ చూసిన వారంతా, ఆమె గురించి కామెంట్స్ చేస్తున్నారు. ఆ పోస్టులో ఏముంది అన్నది ఇప్పుడు చూద్దాం.
బైక్ నేర్చుకుంటున్న..హీరోయిన్ 

బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్, ప్రముఖ వ్యాపారవేత్త సంజయ్ పహారియా తనయుడితో ప్రేమలో పడింది అమ్మడు. ఈ మ్యాటర్ అధికారికంగా ఎక్కడ చెప్పకపోయినా.. ప్రతి ప్రోగ్రాం కి వీరిద్దరూ హాజరవుతున్నారు. ఇటీవల అంబానీ ఇంట్లో జరిగిన పెళ్లి వేడుకకు జాన్వి శిఖర్ తో రావడం మనం చూసాము. తాజాగా వీరు ఇంస్టాగ్రామ్ లో చేసిన పోస్ట్ లో, శిఖర్ జాన్వికి స్కూటర్ ను నేర్పిస్తున్నట్లుగా, ఆమె ముందు కూర్చుంటే వెనకాల అతను బండి పట్టుకొని ఆమెను తీసుకువెళ్తున్నాడు. ఈ ఫోటోలను షేర్ చేసిన జాన్వి క్యాప్షన్ గా “అతనుకు నాతో రైడ్ కి వెళ్లడం చాలా ఇష్టం. అందుకే ఇలా” అని అందుకే ఇలా అంటూ పోస్ట్ చేశారు. అది చూసిన వారంతా క్యూట్ లవ్ బర్డ్స్ అంటు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.


ఇద్దరు ఆలా ..

జాన్వి, శిఖర్ 2016 నుండి స్నేహితులు. ఈమె బాలీవుడ్ లో ధడక్ సినిమాకి ముందు నుంచి డేటింగ్ లో ఉన్నారన్న వార్తలు బయటికి వచ్చాయి. కొన్ని కారణాలతో వీరు విడిపోయారని కూడా అప్పట్లో అనుకున్నారు. ఆ తర్వాత 2022లో మళ్ళీ ఇద్దరూ కలిశారు. ప్రైవేట్ ఫంక్షన్ కి, ఇద్దరూ కలిసి రావడంతో వీరిద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నట్లు కన్ఫామ్ అయింది. తాజాగా జరిగిన అనంత్ అంబానీ రాధిక వివాహంలో, తిరుపతి దర్శనానికి వీరిద్దరూ కలిసి కనిపించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు జాన్వి తన ప్రేమికుడి గురించి చెబుతూ.. ప్రస్తుతం మేము చాలా సంతోషంగా ఉన్నాము. వివాహం గురించి ఇంకా మేము ఆలోచించలేదు. దానికి ఇంకా సమయం ఉందని అనుకుంటున్నాను అని తెలిపింది. జాన్వి, సిద్ధార్థ మల్హోత్రతో పరం సుందరి సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా జులై 25 న విడుదల కానుంది.


 

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×