E-Paper
Advertisement

SRH Coach: పాకిస్తాన్ ప్లేయ‌రైతే త‌ప్పేంటి ? అబ్రార్ అహ్మ‌ద్ మాకు రియ‌ల్ హీరో

SRH Coach: పాకిస్తాన్ ప్లేయ‌రైతే త‌ప్పేంటి ? అబ్రార్ అహ్మ‌ద్ మాకు రియ‌ల్ హీరో
Advertisement

SRH Coach:  సన్ రైజర్స్ లీడ్స్ జట్టు ( Sunrisers Leeds) ఓనర్ కావ్య పాప పైన ( Kavya Maran) దారుణంగా విమర్శలు వస్తున్నాయి. ‘ది హండ్రెడ్ ‘ టోర్నమెంట్ వేలంలో ( The Hundred Auction ) పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మ‌ద్ (Abrar Ahmed ) కొనుగోలు చేయడంపై ఇండియన్ ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. ఒక పాకిస్తాన్ వాడిని, ఎందుకు కొనుగోలు చేశారని కావ్య పాపపై మండిపడుతున్నారు జనాలు. అయితే ఈ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలోనే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు సంబంధించిన హెడ్ కోచ్ డానియెల్‌ వెటోరి ( SRH Coach Daniel Vettori) స్పందించారు. పాకిస్తాన్ ప్లేయర్ అయితే తప్పేంటి? రూల్స్ ప్రకారమే అతన్ని కొనుగోలు చేశామని క్లారిటీ ఇచ్చారు డానియెల్‌ వెటోరి. పాకిస్తాన్ కు చెందిన అబ్రార్ అహ్మ‌ద్ యూనిక్ బౌలింగ్ చేయగల సత్తా ఉన్నవాడని తెలిపారు. అందుకే పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మ‌ద్ ను (Abrar Ahmed ) కొనుగోలు చేసిన‌ట్లు తెలిపారు.

Also Read: Boycott SRH: బాయ్ కాట్ స‌న్ రైజ‌ర్స్ అంటూ ట్రోలింగ్‌..పాకిస్తాన్ ప్లేయ‌ర్ల‌ను కొనడంపై వివాదం

పాకిస్తాన్ ప్లేయ‌రైతే త‌ప్పేంటి ? SRH కోచ్ సంచ‌ల‌నం

Advertisement

ఇంగ్లాండ్ నిర్వహిస్తున్న ‘ది హండ్రెడ్ ‘ టోర్నమెంట్ ( The Hundred Auction ) కోసం పాకిస్తాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ ను కొనుగోలు చేయడంపై సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు సంబంధించిన హెడ్ కోచ్ డానియెల్‌ వెటోరి ( SRH Coach Daniel Vettori) కీలక ప్రకటన చేశారు. అబ్రార్ అహ్మ‌ద్ యూనిక్ బౌలింగ్ అని కొనియాడారు. ఎన్నో వేరియేషన్స్ లో అతడు బౌలింగ్ చేస్తాడని గుర్తు చేశారు. ఇలాంటి ప్లేయర్లను ఎవరు గతంలో చూసి ఉండబోరని, టోర్నమెంట్ కు అందుబాటులో ఉంటాడనే వేలంలో కొనుగోలు చేశామని క్లారిటీ ఇచ్చారు డానియెల్ వెటోరి. పాకిస్తాన్ ప్లేయర్ అయినప్పటికీ కూడా రూల్స్ ప్రకారమే అతన్ని కొనుగోలు చేసినట్లు వివరణ ఇచ్చారు. అయితే పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మ‌ద్ ను సన్రైజర్స్ లీడ్స్ కొనుగోలు చేయడంపై దారుణంగా విమర్శలు వస్తున్నాయి. కావ్య పాప జట్టును బ్యాన్ చేయాలని ఇండియన్ ఫ్యాన్స్ కోరుతున్నారు. ఈ వివాదం పై ఇప్పటి వరకు కావ్య పాప మాత్రం స్పందించలేదు.

అబ్రార్ అహ్మ‌ద్ ను కొనుగోలు చేయడంపై బీసీసీఐ క్లారిటీ

అబ్రార్ అహ్మద్ లాంటి పాకిస్తాన్ ప్లేయర్ ను కావ్య పాప కొనుగోలు చేయడంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి ఉపాధ్యక్షులు రాజీవ్ శుక్లా కూడా స్పందించారు. బీసీసీఐ రూల్స్ ప్రకారం ఐపిఎల్ టోర్నమెంట్లో ఏ ఒక్క పాకిస్తాన్ ప్లేయర్ ఆడకూడదని వెల్లడించారు. అయితే విదేశీ టోర్నమెంట్లలో ఫ్రాంచైజీలు ఎవరినైనా కొనుగోలు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. అలాగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్లో ఆడే ఏ ఒక్క ప్లేయర్ కూడా విదేశీ లీగులలో ఆడకూడదని క్లారిటీ ఇచ్చారు. ఇక అబ్రార్ అహ్మ‌ద్ విషయంలో కావ్య పాప ఎలాంటి తప్పు చేయలేదని.. విదేశీ టోర్నమెంట్లలో ఆమె కొనుగోలు చేశారని వివరించారు. ‘ది హండ్రెడ్’ టోర్నమెంట్ కు బీసీసీఐకి ఎలాంటి సంబంధం ఉండబోదని వెల్లడించారు.

Advertisement

Also Read: Chatgpt On IPL 2026: ఐపీఎల్ 2026 విన్న‌ర్ ఎవ‌రో తేల్చేసిన చాట్ జీపీటీ..పర్పుల్ క్యాప్ అత‌నికే

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

Big Stories

Advertisement
×