E-Paper
Advertisement

Best Window ACs 2026: మండుటెండల్లోనూ ఎక్కువ కూలింగ్ ఇచ్చే విండో ఏసీలు.. రూ.30వేల లోపే!

Best Window ACs 2026: మండుటెండల్లోనూ ఎక్కువ కూలింగ్ ఇచ్చే విండో ఏసీలు.. రూ.30వేల లోపే!
Advertisement

Best Window ACs 2026: ఎండాకాలం మొదలైపోయింది.. పెరుగుతున్న ఉష్ణోగ్రతకు భయపడి జనాలు బయట అడుగు పెట్టాలంటే జంకుతున్నారు. పోనీ ఇంట్లోనే ఉందామంటే ఉక్కపోత సమస్యతో అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో కూలింగ్ ఇచ్చే ఏసీలు కొనడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. ముఖ్యంగా మధ్యతరగతి ఇళ్లలో ఏసీ కొనుగోలు చేయాలంటే బడ్జెట్ పెద్ద అడ్డంకి. అయితే, తక్కువ ధరలో మంచి కూలింగ్ ఇచ్చే విండో ఏసీలు ప్రస్తుతం మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాయి. అది కూడా రూ.30,000 లోపు ధరలో లభించే బెస్ట్ 1.5 టన్ విండో ఏసీలు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం..

Voltas 183 Vectra Pearl

టాప్ బ్రాండ్ వోల్టాస్ నుంచి వస్తున్న ఈ విండో ఏసీ సుమారు రూ.27,399 ధరలో అందుబాటులో ఉంది. ఇది 3 స్టార్ రేటింగ్‌తో వస్తుంది కాబట్టి.. ఉష్ణోగ్రత 55 డిగ్రీలకు చేరినా సరే, ఇది గదిని చల్లగా ఉంచుతుంది. ఇందులో కాపర్ కండెన్సర్ వాడటం వల్ల మన్నిక చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇందులోని యాంటీ మైక్రోబియల్ ఫిల్టర్ గాలిని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తుంది.

Carrier 1.5 Ton 3 Star

Advertisement

క్యారియర్ 1.5 టన్ 3 స్టార్ విండో ఏసీలు బ్రాండ్ కూలింగ్‌కు పెట్టింది పేరు. రూ.27,999 ధరలో లభించే ఈ విండో ఏసీలో టర్బో మోడ్ అనే ఫీచర్ ఉంది. ఇది ఏసీ ఆన్ చేసిన వెంటనే గదిని వేగంగా చల్లబరుస్తుంది. ఇందులో ఫిక్స్‌డ్ స్పీడ్ కంప్రెసర్ ఉన్నప్పటికీ, ఇది మెరుగైన పనితీరును అందిస్తుంది. గాలిలోని దుమ్మును అడ్డుకునే ఫిల్టర్లు కూడా ఈ ఏసీలో ఉన్నాయి.

Also Read: భారీ డిస్కౌంట్‌తో షావోమీ 75 ఇంచుల టీవీ లాంచ్.. 4 ఏళ్ల వారంటీ ఉచితం!

Lloyd 1.5 Ton 3 Star Fixed Speed

Advertisement

స్టైలిష్ లుక్ కోరుకునే వారికి లాయిడ్ ఏసీ బాగా నచ్చుతుంది. దీని ధర సుమారు రూ.26,900 వరకు ఉంటుంది. వైట్ బాడీపై సిల్వర్ స్ట్రిప్ డిజైన్‌తో ఇది చూడటానికి చాలా బాగుంటుంది. ఇందులో కూడా 100 శాతం కాపర్ కాయిల్ వాడటంతో ఏసీ ఎక్కువ కాలం మన్నుతుంది.

Godrej 1.5 Ton 3 Star Window AC

బడ్జెట్ ఫ్రెండ్లీ ఏసీల జాబితాలో గోద్రేజ్ ముందుంటుంది. దీని ధర సుమారు రూ.26,250. ఇది 2025 మోడల్ కావడంతో కొత్త ఫీచర్లు ఉన్నాయి. ముఖ్యంగా స్మార్ట్ డయాగ్నోసిస్ ఫీచర్ ద్వారా ఏసీలో ఏదైనా సమస్య ఉంటే సులభంగా తెలుసుకోవచ్చు. యాంటీ ఫ్రీజ్ ప్రొటెక్షన్ వల్ల గడ్డకట్టే సమస్య ఉండదు కాబట్టి.. గాలి కూడా స్వచ్ఛంగా వస్తుంది.

Haier 1.5 Ton 3 Star Top Flow

ఈ హైయర్ 1.5 టన్ 3 స్టార్ టాప్ ఫ్లో ఏసీ రూ.26,990 ధరలో దొరుకుతుంది. ఇది జెట్ ఎయిర్ ఫ్లో టెక్నాలజీతో పనిచేస్తుంది. దీంతో గదిలోని ప్రతి మూలకు చల్లటి గాలి సమానంగా వీస్తుంది. 54 డిగ్రీల ఎండలో కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుందని కంపెనీ చెబుతోంది. బాక్టీరియాను అడ్డుకునే ఫిల్టర్లు కూడా ఈ ఏసీలో ఉన్నాయి.

Also Read: ఇండెక్షన్ స్టవ్ కొంటున్నారా? గ్యాస్‌తో పోల్చితే.. దేనికి ఎక్కువ ఖర్చవుతుంది?

Related News

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

Big Stories

Advertisement
×