E-Paper
Advertisement

Travis head – SRH Fan : ఆస్ట్రేలియా గడ్డపై SRH ఫ్యాన్స్ రచ్చ చూడండి.. హెడ్ ను అడ్డంగా పట్టుకొని

Travis head – SRH Fan : ఆస్ట్రేలియా గడ్డపై  SRH ఫ్యాన్స్ రచ్చ చూడండి.. హెడ్ ను అడ్డంగా పట్టుకొని
Advertisement

Travis head – SRH Fan : సాధారణంగా క్రీడాకారులు అయినా సినిమా సెలబ్రిటీలు అయినా ఎవ్వరైనా అభిమానులను కలుసుకోవాలనుకుంటారు. కానీ అభిమానులు చేసే రచ్చకు వివాదాలు తలెత్తుతాయని వారు కాస్త భయాందోళనకు గురవుతుంటారు. కొన్ని కారణాల వల్ల వాళ్లు ఒక చోటుకు రావాలనుకున్నప్పటికీ అక్కడ అభిమానుల తాకిడి ఎక్కువగా ఉంటే వాళ్లు అక్కడికి చేరుకోలేరు. క్రికెటర్లకు కాస్త ఇబ్బందులు చాలా తక్కువ అనే చెప్పాలి. ఎందుకంటే వాళ్లు ఎక్కువగా గ్రౌండ్ కే పరిమితం అవుతారు. మ్యాచ్ ఆడేటప్పుడూ సెక్యూరిటీ మధ్య మ్యాచ్ ఆడుతారు కాబట్టి వారికి కాస్త ఇబ్బందులుండవు. అయినప్పటికీ కొన్ని సార్లు కొంత మంది గేట్ దూకి తమ అభిమాన క్రికెటర్ ని కలుసుకుంటారు.

Also Read :  IPL 2026 : SRH కోసం మరోసారి రంగంలోకి రజినీకాంత్?

Advertisement

ట్రావిస్ హెడ్ ఆటోగ్రాఫ్ 

తాజాగా సన్ రైజర్స్ హైదరాబాద్ అభిమానులు ఆస్ట్రేలియా వీరంగమే సృష్టించారు. సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ ని కలిసి ఆటో గ్రాఫ్ తీసుకున్నారు. అంతటితో ఆగకుండా.. ట్రావీస్ ఆరేంజ్ ఆర్మీ అంటూ అక్కడ మొత్తం రచ్చ రచ్చ చేశారు. ఒక అభిమాని అయితే వైట్ టీ షర్ట్ పై SRH ముద్రతో పాటు.. ట్రావిస్ హెడ్ ఆటోగ్రాఫ్ తీసుకున్నాడు. ఆ సమయంలో ట్రావిస్.. ఆరేంజ్ ఆర్మీ అంటూ ఆస్ట్రేలియాలో నినాదాలు చేయడంతో అంతా ఆశ్చర్యానికి గురి కావడం విశేషం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 2025 సీజన్ లో మాత్రం కాస్త విఫలం చెందాడనే చెప్పాలి. కానీ మిగతా సీజన్ల అన్నింటిలో అద్భుతంగా ఆడాడు. 

Advertisement

హెడ్ సెంచరీ రికార్డు

2025లో అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ పీడకలగా మారింది. సీజన్ ప్రారంభం నుంచి హైదరాబాద్ కి ఏ మాత్రం కలిసి రాలేదు. ప్లే ఆప్స్ రేసులో కచ్చితంగా నిలవాలంటే గెలవాల్సిన మ్యాచ్ లో వర్షం దెబ్బ అడ్డంకిగా మారడం.. మిగతా మ్యాచ్ ల్లో ఓటమి పాలవ్వడం.. చివరి రెండు మ్యాచ్ ల్లో ఘన విజయం సాధించింది. అందులో ఓపెనర్ అభిషేక్, ట్రావిస్ హెడ్ కీలకంగా మారారు. మరోవైపు ఐపీఎల్ లో సన్ రైజర్స్ తరపున అత్యంత వేగంగా సెంచరీ చేసిన ఆటగాడిగా ట్రావిస్ హెరడ్ రికార్డు సృష్టించాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పై కేవలం 39 బంతుల్లోనే సెంచరీ మార్క్ ను అందుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే ట్రావిస్ హెడ్ నాలుగో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. గేల్ 30 బంతుల్లోనే శతకం బాదాడు. ఈ జాబితాలో యూసూఫ్ పఠాన్, డేవిడ్ మిల్లర్ తరువాత స్థానాల్లో ఉన్నారు. వాస్తవానికి అభిషేక్,  ట్రావిస్ హెడ్ అద్భుతమైన ఆటగాళ్లు అని అభిమానులు కొనియాడుతున్నారు. ముఖ్యంగా కీలక మ్యాచ్ ల్లో హెడ్ అద్భుతమైన ఫామ్ లో ఉండి విజయాలను అందిస్తాడు. 

?igsh=MThmMGtpYjdwZHB4eQ==

Related News

పుట్టినిల్లా ? మెట్టినిల్లా ? బక్కోడిని ఆడుకుంటున్న ఐపీఎల్ ఫ్యాన్స్

ఒరేయ్ ఇన్ని రోజులు ఎక్క‌డున్నావ్ రా? న‌మ‌న్ ధీర్ బ్యాటింగ్ చూసి బిత్త‌ర‌పోయిన గంభీర్‌

విండీస్, టీమిండియా మ్యాచ్ రద్దు… వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారంటూ తన్వీర్ అహ్మద్ కామెంట్!

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

ఇస్లామాబాద్ లో హై టెన్ష‌న్‌…ఇంగ్లాండ్ క్రికెట‌ర్లు బ‌స చేస్తున్న హోట‌ల్ ద‌గ్గ‌ర భారీ బ్లాస్ట్ !

ప్రీతి జింటా లాగా సొట్ట బుగ్గలేసుకుని, వీడేం వికెట్ కీపింగ్ చేస్తాడురా నాయ‌నా ?

పాకిస్తాన్ అంటేనే ఎగిరెగిరి ప‌డ‌తారు, కానీ సిగ్గు లేకుండా మాతో మ్యాచ్ లు ఆడ‌తారు!

Big Stories

Advertisement
×