BigTV English

IPL 2026 : SRH కోసం మరోసారి రంగంలోకి రజినీకాంత్?

IPL 2026 : SRH కోసం మరోసారి రంగంలోకి రజినీకాంత్?

IPL 2026 : ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ 2025లో చెత్త ప్రదర్శన కనబరిచిన విషయం తెలిసిందే. అయితే 2024లో ఈ జట్టు ఫైనల్ కి చేరుకొని ఫైనల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ చేతిలో ఓటమి పాలైంది. అదే ఊపులో 2025 కొనసాగిస్తుందని.. ఈసారి 300 స్కోర్ ను క్రాస్ చేస్తుందని అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. మరోవైపు తొలి మ్యాచ్ లో 284 పరుగులు సాధించడంతో SRH పై భారీ ఆశలు పెట్టుకున్నారు. కానీ కీలక ఆటగాళ్లు అంతా ఈ సీజన్ లో విఫలం చెందారు. సరైన సమయంలో సరైన విధంగా ఆడకపోవడంతో 6వ స్థానంలో నిలిచింది. దీంతో మరోసారి తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ రంగంలోకి దిగాడు.


Also Read : Yash Dayal: RCB బౌలర్ దయాల్ కు ఎదురుదెబ్బ.. ఐపీఎల్ 2026 నుంచి ఔట్?

రజీనీ సూచనలతో 2024లో SRH ఫైనల్ కి


గతంలో కూడా రజినీకాంత్ పలు సూచనలు చేయడంతో 2024లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఫైనల్ కి చేరుకుంది. 2023 జైలర్ మూవీ విడుదల సందర్భంగా రజినీ కావ్య మారన్, కళానిధి మారన్ కి కీలక సూచనలు చేశాడు. మంచి ప్లేయర్లను తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పాడు రజినీకాంత్. అందుకే 2024లో ఐపీఎల్ లో ఫైనల్ కి వెళ్లింది. 2023 జైలర్ ఆడియో లాంచ్ రజినీ సార్ కీలక విషయాలు చెప్పాడని.. సన్ రైజర్స్ హైదరాబాద్ కి మంచి ఆటగాళ్లను ఎంపిక చేయండి అని సూచించినట్టు గుర్తు చేశారు. కావ్య 2024లో రజినీ సార్ చెప్పినట్టు చేసింది. సక్సెస్ సాధించింది. ఆ సీజన్ లో ఫైనల్ వరకు చేరుకుంది. అంతేకాదు.. SRH అత్యధిక స్కోరు, వ్యక్తిగత స్కోరు తదితర వాటిని బ్రేక్ కూడా చేసింది. రజినీసార్ చెప్పినట్టుగానే చేస్తే.. ఈ సారి కూడా మంచి ఫలితాలను ఇస్తుందని కళానిధి మారన్ వెల్లడించాడు.  వాస్తవానికి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీశ్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ వంటి హిట్ బ్యాటర్లతో బ్యాటింగ్ బలంగానే ఉంది. కానీ బౌలింగ్ విభాగంలో మహ్మద్ షమీ నిత్యం గాయాలతో ఎప్పుడూ ఫామ్ లో ఉంటాడో.. ఎప్పుడు ఉండడో తెలియదు. భువనేశ్వర్ ని పక్కకు పెట్టడంతో srh బౌలింగ్ కాస్త గాడి తప్పిందనే చెప్పాలి.

పేలవ ప్రదర్శనతో SRH ఆటగాళ్లు.. 

కెప్టెన్ పాట్ కమిన్స్, షమీ, ఎషాన్ మలింగ, సిమర్ జిత్ సింగ్ వంటి బౌలింగ్ ప్లేయర్లు ఈ సీజన్ లో అన్ని మ్యాచ్ లలో సత్తా చూపించలేకపోయారు. అలాగే బ్యాటర్లు కూడా అంతగా ఫామ్ కనబరుచలేదు. కమిందు మెండిస్ తన ఆల్ రౌండ్ షోతో అదురగొట్టాడు. ఈ సారి అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ ప్లేయర్లను మార్చి కొత్తగా మంచి ఫామ్ లో ఉన్న ఆటగాళ్లను కొనుగోలు చేసి.. అన్ని జట్ల కంటే మెరుగ్గా రాణించాలని భావిస్తోంది సన్ రైజర్స్ జట్టు. 2026 సీజన్ లో కొంత మంది సన్ రైజర్స్ ప్లేయర్లను మార్చనున్నట్టు సమాచారం. అటు బ్యాటింగ్ లో.. ఇటు బౌలింగ్ లో రెండింటిలో ఆటగాళ్లను మార్చనుంది. ఆటగాళ్లను మార్చినప్పుడే మంచి ఫలితాలు వస్తాయని రజినీకాంత్ కూడా చెప్పడంతో కళానిధి మారుస్తామని చెప్పారు. 2026 సీజన్ కి  కావ్య మారన్ టీమ్ సెలెక్ట్ ని ఏవిధంగా చేస్తుందో వేచి చూడాలి.

Related News

Asia Cup 2025 : బంగ్లా చిత్తు… ఫైనల్ కు పాకిస్తాన్.. టీమిండియాతో బిగ్ ఫైట్

PAK Vs BAN : పాకిస్తాన్ కి షాక్.. బంగ్లాదేశ్ టార్గెట్ ఎంతంటే..?

IND Vs BAN : ఇండియానా… అదెక్కడుంది? బంగ్లాదేశ్ అభిమాని ఓవరాక్షన్

PAK Vs BAN : టాస్ గెలిచిన బంగ్లాదేశ్.. ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

Smriti Mandana : స్మృతి మంధానకు ఘోర అవమానం… ఆ ఫోటోలు వైరల్ చేసి!

Abhimanyu Easwaran : 25 సెంచరీలు, 30 అర్థ శతకాలు చేసినా ఛాన్స్ దక్కడం లేదు…అభిమన్యు ఏం పాపం చేశాడు రా !

Inzamam-ul-Haq : అభిషేక్ శర్మ బ్యాట్ లో చిప్స్.. అందుకే దారుణంగా ఆడుతున్నాడు

Asia Cup 2025 : అభిషేక్ శర్మ రనౌట్… దుబాయ్ స్టేడియంలో ఏడ్చేసిన లేడీ

Big Stories

×