BigTV English

The Paradise film: ‘వాడి జడలు ముట్టుకుంటే వాడికి సర్రునా’… పారడైజ్ నుంచి కొత్త వీడియో

The Paradise film: ‘వాడి జడలు ముట్టుకుంటే వాడికి సర్రునా’… పారడైజ్ నుంచి కొత్త వీడియో

The Paradise film: నాని (Nani)హీరోగా శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela)దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం ది ప్యారడైజ్(The Paradise). ఈ సినిమా వచ్చేయేడాది మార్చి 26వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో శర గంగా షూటింగ్ పనులను పూర్తి చేస్తున్నారు. ఈ సినిమా సుమారు 8 భాషలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో అభిమానులలో కూడా ఎన్నో అంచనాలను నెలకొన్నాయి. అయితే తాజాగా ఈ సినిమా నుంచి ఒక వీడియోని విడుదల చేశారు. ఈ సినిమాలో కొన్ని కీలక యాక్షన్ సీక్వెన్స్ పూర్తి కావడంతో కావడంతో 42 సెకండ్లతో ఉన్న వీడియోని విడుదల చేశారు. ఇందులో నాని హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలలో నటిస్తూ అద్భుతమైన పర్ఫామెన్స్ ఇచ్చారని స్పష్టం అవుతుంది. ఇక ఈ వీడియోలో వాడి జడలు ముట్టుకుంటే వాడికి సర్రుమంటుంది అంటూ వచ్చే డైలాగ్ హైలైట్ గా నిలిచింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో సంచలనగా మారింది.


నాని కెరియర్ లోనే హైలెట్..

తాజాగా విడుదల చేసిన ఈ వీడియో చూస్తుంటే మాత్రం ఈ సినిమాలో పెద్ద ఎత్తున యాక్షన్స్ సన్ని వేషాలు ఉన్నాయని స్పష్టమవుతుంది. ఇక నాని కెరియర్ లోనే ఎప్పుడు నటించిన విధంగా ఈ సినిమాలో తన పాత్ర కూడా చాలా విభిన్నంగా ఉండబోతుందని సమాచారం. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లు కూడా సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను పెంచేసాయి. ఈ చిత్రాన్ని దర్శకుడు శ్రీకాంత్ తో పాటు నాని కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఎస్ ఎల్ వి సినిమాస్ బ్యానర్ పై చెరుకూరి సుధాకర్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు.


రెండు జడలతో నాని…

ఇక తాజాగా విడుదల చేసిన స్పార్క్ ఆఫ్ పారడైజ్ సీక్వెన్స్ వీడియో చూస్తే కనుక ఇదంతా కూడా జైలులో జరిగిన సన్నివేశాలను తలపిస్తున్నాయని చెప్పాలి. ఇక ఇందులో భాగంగా తోటి ఖైదీలు ఆయనపై దాడి చేయటానికి వస్తున్న నేపథ్యంలో నాని మాత్రం ఎంతో ప్రశాంతంగా కూర్చుని కనిపించారు. ఇక ఇందులో నాని రెండు జడలతో విభిన్నమైన లుక్ లో కనిపిస్తున్నారని చెప్పాలి. ఈ హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ ను రామోజీ ఫిలిం సిటీలో దాదాపు 15 రోజులపాటు చిత్రీకరించారని తెలుస్తుంది.

8 భాషలలో ది ప్యారడైజ్…

ఇక ఇప్పటికే సినిమా నుంచి విడుదల చేసిన ఈ అప్డేట్స్ సినిమా పట్ల భారీ స్థాయిలో అంచనాలను పెంచేస్తున్నాయి. నాని స్పీడు చూస్తుంటే ఈసారి పాన్ ఇండియా స్థాయిలో సూపర్ సక్సెస్ అందుకోబోతున్నారని స్పష్టమవుతుంది. ఇక ఈ సినిమా 2026 మార్చి 26 తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయబోతున్నారు. ఇక ఇదివరకే నాని శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో దసరా సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇలా ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో తదుపరి వీరిద్దరి కాంబినేషన్లో ది ప్యారడైజ్ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఇక నాని ప్రస్తుతం ఇండస్ట్రీలో నిర్మాతగాను, హీరోగా కూడా వరుస అవకాశాలను అందుకుంటూ ఎంతో బిజీగా గడుపుతున్నారు.

Also Read: Gayatri Gupta: డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా నాకు 5 లక్షలు ఇచ్చాడు.. టాప్ సీక్రెట్ రివీల్ చేసిన నటి

 

Related News

Ram Charan- Bunny: 18 ఏళ్లుగా చరణ్, బన్నీ మధ్య దూరం.. ఆ హీరోయిన్ కారణమా? అసలు ఏమైంది?

Suresh Gopi: అదృశ్యమైన సినీ నటుడు, ఎంపీ సురేష్ గోపీ… ఆచూకీ చెప్పాలంటూ ఫిర్యాదులు!

Film Workers Strike : నిర్మాతలు కాస్త తగ్గండి… క్లాస్ పీకిన మంత్రి

Sundarakanda trailer: పెళ్లి కోసం రోహిత్ కష్టాలు మామూలుగా లేవుగా.. ఆకట్టుకుంటున్న సుందరకాండ ట్రైలర్!

Gayatri Gupta: డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా నాకు 5 లక్షలు ఇచ్చాడు.. టాప్ సీక్రెట్ రివీల్ చేసిన నటి

Big Stories

×