E-Paper
Advertisement

SRH-Hanuma Vihari: SRH ఫ్యాన్స్ టార్చర్…ఐపీఎల్ కామెంట్రీకి హనుమ విహారి గుడ్ బై ?

SRH-Hanuma Vihari:  SRH ఫ్యాన్స్ టార్చర్…ఐపీఎల్ కామెంట్రీకి  హనుమ విహారి గుడ్ బై ?
Advertisement

SRH-Hanuma Vihari: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) చివరి దశకు వచ్చేసింది. ఇప్పటికే మూడు జట్లు ప్లే ఆఫ్స్ కు చేరుకున్నాయి. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, స‌న్ రైజ‌ర్స్‌ హైదరాబాద్ (Sunrisers Hyderabad) అలాగే గుజరాత్ టైటాన్స్ ప్లే ఆఫ్స్ కు తిరగా నాలుగో స్థానం కోసం మొత్తం నాలుగు జట్లు పోటీ పడుతున్నాయి. ఇలాంటి క్రమంలో కామెంటేట‌ర్, మాజీ టీమిండియా క్రికెటర్ హనుమ విహారి సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు సంబంధించిన అభిమానులు టార్చర్ చేసిన నేపథ్యంలో హనుమ విహారి (Hanuma Vihari) ఈ నిర్ణయం తీసుకున్నాడని సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేస్తున్నారు. ఈ మేరకు పోస్టులు పెడుతున్నారు. తెలుగోడు అయి ఉండి.. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కాకుండా వేరే వాళ్లకు డబ్బా కొట్టడం ఎందుకంటూ హనుమ విహారిని దారుణంగా ఆడుకున్నారు SRH ఫ్యాన్స్. ఈ తరుణంలోనే కామెంట్రీకి హనుమ విహారి రిటైర్మెంట్ తీసుకున్నాడని ప్రచారం మొదలైంది.

Also Read: Ramiz Raza : ఆస్ట్రేలియా కంటే భ‌యంక‌రంగా బంగ్లాదేశ్ మారింది…నిద్ర‌లోనూ పాకిస్తాన్ ప్లేయ‌ర్లు వ‌ణికిపోతున్నారు

కామెంట్రీకి రిటైర్మెంట్ ఇవ్వడం పై క్లారిటీ ఇచ్చిన హనుమ విహారి

Advertisement

తనపై తప్పుడు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో స్వయంగా వీడియో ద్వారా హనుమ విహారి క్లారిటీ ఇచ్చారు. తానేమి కామెంట్రీ కి రిటైర్మెంట్ ఇవ్వలేదని.. గ్యాప్ మాత్రమే ఇచ్చినట్లు వెల్లడించారు. కానీ కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. తాను ఎవ్వరికీ భయపడేది లేదని.. తప్పు జరిగితే ప్రశ్నిస్తా.. సరిగ్గా ఆడితే మెచ్చుకుంటానని వివరించారు. ఇవాళ బెంగుళూరు వర్సెస్ సన్రైజర్స్ మ్యాచ్ కు కామెంట్రీ నేనే చెప్పబోతున్నానని ప్రకటన చేశారు. ఈ ఒక్క మ్యాచ్ కాదు క్వాలిఫైయర్ 2 తో పాటు ఫైనల్ మ్యాచ్ కు కూడా కామెంట్రీ చేస్తానని క్లారిటీ ఇచ్చాడు హనుమ విహారి. దీంతో హనుమ విహారి వీడియో వైరల్ గా మారింది.

అస‌లు హ‌నుమ విహారి, తిరుమలశెట్టి సుమన్ వివాదం ఏంటి ?

ఐపీఎల్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ఫ్లాట్ పిచ్ పైన సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్లు సరిగ్గా ఆడడం లేదని విమర్శలు చేశారు హనుమ విహారి. కళ్ళు మూసుకొని ఊపడం తప్ప, SRH ప్లేయర్లకు ఆడడం చేతకాదని ఓ రేంజ్ లో అనాలసిస్ చేశాడు. అయితే అతడు చేసిన అనాలసిస్ అనంతరం, చెన్నై సూపర్ కింగ్స్ పై అద్భుతమైన విజయాన్ని నమోదు చేసుకుంది హైదరాబాద్. దీంతో వెంటనే తిరుమల శెట్టి సుమన్.. ఎంట్రీ ఇచ్చాడు. హనుమ విహారికి కౌంటర్ ఇచ్చాడు. ఫ్లాట్ పిచ్ లపై హైదరాబాద్ కు ఆడ రాకపోతే.. చెన్నై పై ఎలా గెలిచిందని నిలదీశాడు. హెడ్, అభిషేక్ శర్మ, కాటేరమ్మ కొడుకు క్లాసెన్, ప్యాట్ క‌మిన్స్‌ లాంటి వరల్డ్ క్లాస్ ఆటగాళ్లకు మనం చెప్పే అంత సీన్ లేదు.. వాళ్లకు ఎక్కడ ఎలా ఆడాలో తెలుసు.. హిట్టింగ్ చేయాల్సిన సమయంలో కచ్చితంగా చేసి మ్యాచ్ గెలిపిస్తారని తిరుమల శెట్టి సుమన్ వెల్లడించారు. ఇక దీనిపై హనుమ విహారి రేంజ్ లో ఎగిరిపడ్డాడు. నేను అలా అనలేదని.. తప్పుగా అర్థం చేసుకున్నారని మళ్లీ వీడియో పెట్టాడు. ఓడిపోయినప్పుడు హైదరాబాద్ తప్పిదాలను ఎత్తి చూపించాను… గెలిస్తే ఖచ్చితంగా మెచ్చుకుంటానని విహారి పేర్కొన్నారు.

Advertisement

Also Read: BAN VS PAK: పాకిస్తాన్ ఘోర ఓట‌మి..టెస్టు సిరీస్‌ వైట్ వాష్ చేసిన బంగ్లాదేశ్‌, WTCలో మ‌రింత దిగిజారిన టీమిండియా

 

Related News

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

ఇస్లామాబాద్ లో హై టెన్ష‌న్‌…ఇంగ్లాండ్ క్రికెట‌ర్లు బ‌స చేస్తున్న హోట‌ల్ ద‌గ్గ‌ర భారీ బ్లాస్ట్ !

ప్రీతి జింటా లాగా సొట్ట బుగ్గలేసుకుని, వీడేం వికెట్ కీపింగ్ చేస్తాడురా నాయ‌నా ?

పాకిస్తాన్ అంటేనే ఎగిరెగిరి ప‌డ‌తారు, కానీ సిగ్గు లేకుండా మాతో మ్యాచ్ లు ఆడ‌తారు!

ద‌రిద్రుడు అగార్క‌ర్ పోయినా రాత మార‌లేదే…ష‌మీ, భువీల‌ను న‌ట్టేట ముంచారు క‌ద‌రా?

విండీస్ పై చివ‌రి మ్యాచ్ ఆడేశాడు…ఇక ర‌వీంద్ర జ‌డేజా రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే

రీ-ఎంట్రీపై ప‌గ‌టి క‌ల‌లు వ‌ద్దు..ఇక‌ రిటైర్మెంట్ ఇచ్చేసి, స‌న్యాసం తీసుకో !

SRH ఇక నీదే అల్లుడు…క‌ట్నంగా కింద క‌ట్ట‌బెట్టిన కావ్య పాప ఫ్యామిలీ ?

Big Stories

Advertisement
×