E-Paper
Advertisement

Aniket Verma : 3 ఏళ్లకే త‌ల్లి మృతి, తండ్రి వ‌దిలేశాడు..SRH ఫినిష‌ర్‌ అనికేత్ వర్మ క‌న్నీటి గాథ‌

Aniket Verma : 3 ఏళ్లకే త‌ల్లి మృతి, తండ్రి వ‌దిలేశాడు..SRH ఫినిష‌ర్‌ అనికేత్ వర్మ క‌న్నీటి గాథ‌
Advertisement

Aniket Verma :  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( IPL 2026) నిన్న ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే ఈ టోర్నమెంట్ లో భాగంగా తొలి మ్యాచ్ బెంగళూరు వర్సెస్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగింది. ఇందులో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయినప్పటికీ.. గట్టిగానే పోరాడింది. అయితే ఈ క్రమంలో మరోసారి హైదరాబాద్ జట్టుకు సంబంధించిన ఫినిషర్ అనికేత్ వర్మ తన రోల్ ప్రదర్శించాడు. కేవలం 18 బంతులు ఎదుర్కొన్న అనికేత్ వర్మ 43 పరుగులతో రెచ్చిపోయాడు. 238 స్ట్రైక్ రేటుతో చుక్కలు చూపించాడు. ఇందులో నాలుగు సిక్సర్లు అలాగే మూడు బౌండరీలు కూడా ఉన్నాయి. అయితే మరోసారి ఫినిషింగ్ రోల్ పోషించిన‌ అనికేత్ వర్మ ( Aniket Verma) కన్నీటి గాథ‌ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also Read: IPL telecast in Bangladesh: బిగ్ రిలీఫ్‌..బంగ్లాదేశ్ లో ఐపీఎల్ పై నిషేధం ఎత్తివేత‌..ముస్తాఫిజుర్ రీ-ఎంట్రీ !

అనికేత్ వర్మ కన్నీటి గాథ‌..

Advertisement

సన్ రైజ‌ర్స్ హైదరాబాద్ జట్టు తరఫున బరిలోకి దిగిన ఫినిషర్ అనికేత్ వర్మ తన చిన్నతనంలో ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. ఎన్నో సవాళ్లు ఎదుర్కొని ఇప్పుడు సక్సెస్ ట్రాక్ లో కొనసాగుతున్నాడు. అనికేత్ అసలు పేరు అనికేత్ ఉమాశంకర్ వర్మ. ఇతరు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఝాన్సీలో 2002 ఫిబ్రవరి 5వ తేదీన జన్మించాడు. అయితే ఇతను జన్మించిన మూడు సంవత్సరాల వయసుకే ఆయన తల్లి మమతా వర్మ అనారోగ్యం కారణంగా మరణించారు. తర్వాత తండ్రి కూడా వదిలేశాడు. తల్లి చనిపోయిన ఏడాదికే మరో మహిళను పెళ్లి చేసుకొని కొడుకు అనికేత్ వర్మను ఒంటరి చేశాడు తండ్రి ఉమాశంకర్. ఈ క్రమంలోనే అనికేత వర్మ తన అమ్మమ్మ దగ్గర పార్వతీ వర్మ దగ్గర పెరిగాడు. తన మామ సహాయం కారణంగా చదువుతో పాటు క్రికెట్ లోకి అడుగు పెట్టాడు.

అనికేత్ వర్మ క్రికెట్ హిస్టరీ

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పుట్టిన అనికేత్ వర్మ తన అమ్మమ్మ కారణంగా మధ్యప్రదేశ్ లో చదువుతో క్రికెట్ లో కూడా రాణించాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రం తరఫున రంజీ మ్యాచ్ లు ఆడుతున్న అనికేత్ వర్మ.. మధ్యప్రదేశ్ లీగ్ లో 30 బంతుల్లోనే సెంచరీ చేసి హిస్టరీ క్రియేట్ చేశాడు. దీంతో 2025 మెగా వేలంలో అతన్ని కొనుగోలు చేసింది కావ్య పాప. కేవలం 30 లక్షలకు మాత్రమే అనికేత్ వర్మను సొంతం చేస్తుంది. అయితే ఈ సందర్భంగా ప్రాక్టీస్ మ్యాచ్ లో హర్షల్ పటేల్ లాంటి వాళ్ల బౌలింగ్ లో సిక్సర్లతో ఇరగదీశాడు. దీంతో తుది జట్టులో రాణించి.. హైదరాబాద్ ఫినిషర్ గా పేరు గాంచాడు. 2025 ఐపీఎల్ టోర్నమెంట్ సందర్భంగా ఢిల్లీ క్యాపిటల్స్ పైన 41 బంతుల్లో 74 బరులతో ఇరగదీసాడు. ఆ తర్వాత ప్రతి మ్యాచ్ లో కూడా తన వంతు సహాయాన్ని జట్టుకు అందించాడు. ఇక నిన్న రాయల్ చాలెంజెస్ బెంగళూరు తో తలపడిన మ్యాచ్ లో కూడా 43 పరుగులు చేసి దుమ్ము లేపాడు. ఏ స్థానంలో అయినా ఆడగల స‌త్తా ఉన్నోడు అనికేత్ వ‌ర్మ‌.

Advertisement

Also Read: Mohammad Amir: ఐపీఎల్ అంటేనే ఫిక్స‌ర్స్ లీగ్..అంపైర్ల నుంచి చీర్ గ‌ర్ల్స్ అంద‌రూ అమ్ముడుపోయేవాళ్లే

 

?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==

Related News

ఎవ‌రెంత గింజుకున్నా, నేను రాజీనామా చేయ‌ను..న‌ఖ్వీ సంచ‌ల‌నం

ఒరేయ్ న‌ఖ్వీ? పాకిస్తాన్ జ‌ట్టును 9వ స్థానానికి దిగ‌జార్చావ్ క‌ద‌రా !

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఇండియాను వైట్ వాష్ చేస్తాం…రికీ పాంటింగ్ హెచ్చరిక

రిజ్వాన్ చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌…భ‌విష్య‌తుల్లో పాకిస్తాన్ తరఫున మళ్లీ ఆడ‌కుండా చేస్తా

రెండు టైటిల్స్ గెలిచినా, RCB ప్లేయ‌ర్లను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారు

మిస్ట‌ర్ భువీ..ఇక చాలు, అన్ని మూసుకుని రిటైర్మెంట్ ఇచ్చి ఇంట్లో కూర్చో

ఇలానే వదిలేస్తే, ఇమ్రాన్ ఖాన్ ఏ క్షణమైనా చావడం పక్కా..!

దున్న‌పోతుల్లా తిన‌డం త‌ప్ప‌…మా ద‌ద్ద‌మ్మ‌ల‌కు ఆడ‌టం చేత‌కాదు

Big Stories

Advertisement
×