E-Paper
Advertisement

పెళ్లి విందులో ‘లెగ్ పీస్’ వార్.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే!

పెళ్లి విందులో ‘లెగ్ పీస్’ వార్.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే!
Advertisement

Viral Video: ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లా హసన్‌పూర్‌లో చోటుచేసుకున్న ఓ వింత సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. సాధారణంగా పెళ్లిళ్లలో కట్నకానుకలు లేదా ఇతర మర్యాదల విషయంలో గొడవలు జరగడం చూస్తుంటాం. కానీ ఇక్కడ మాత్రం కేవలం చికెన్ లెగ్ పీస్‌ల కోసం ఏకంగా పెళ్లి పీటల వరకు వెళ్లాల్సిన వేడుక రణరంగంగా మారింది. ఈ ఘటన స్థానికంగానే కాకుండా ఇంటర్నెట్‌లోనూ తీవ్ర చర్చకు దారితీసింది.

హసన్‌పూర్‌కు చెందిన ఒక యువతికి, సమీప ప్రాంతానికి చెందిన యువకుడికి వివాహం నిశ్చయమైంది. పెళ్లి వేడుకలో భాగంగా వరుడి తరఫు బంధువులకు విందు ఏర్పాటు చేశారు. భోజనాల సమయంలో వడ్డించిన బిర్యానీలో తమకు తగినన్ని చికెన్ లెగ్ పీస్‌లు రాలేదని వరుడి బంధువులు అసహనం వ్యక్తం చేశారు. వడ్డించే వారితో మొదలైన చిన్నపాటి వాగ్వాదం, చూస్తుండగానే ఇరువర్గాల మధ్య పెద్ద ఘర్షణకు దారితీసింది.

Advertisement

కోపంతో ఊగిపోయిన ఇరు పక్షాల వారు భోజనశాలలోని కుర్చీలను ఒకరిపై ఒకరు విసురుకున్నారు. పళ్ళాలు, గ్లాసులు విసిరేయడంతో విందు ప్రాంగణం యుద్ధభూమిని తలపించింది. ఈ గందరగోళంలో కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ దృశ్యాలను అక్కడున్న వారు ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్తా వైరల్ అయ్యింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. వీడియో ఆధారంగా గొడవకు కారణమైన వారిని గుర్తించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. కేవలం లెగ్ పీస్ కోసం పెళ్లి వేడుకను ఇలా రసాభాస చేసుకోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Also Read: అమరావతిపై వైసీపీ ‘సెల్ఫ్ గోల్’.. అసెంబ్లీకి డుమ్మా.. పార్టీకి కోలుకోలేని దెబ్బ!

Advertisement

Related News

ఇది సాహసమా లేక పిచ్చి తనమా.. కేరళ వరద నీటిలో థార్ జీపుతో డేంజర్ స్టంట్స్!

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

Big Stories

Advertisement
×