Kavya Maran: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Indian Premier League 2026 Tournament) చాలా రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంటులో ఇప్పటికే 31 మ్యాచ్ లు పూర్తయ్యాయి. నిన్న సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ (Sunrisers Hyderabad vs Delhi Capitals) మధ్య ఉప్పల్ వేదికగా ( Rajiv Gandhi International Stadium, Hyderabad) బిగ్ ఫైట్ జరిగింది. ఇందులో అద్భుతంగా రాణించిన సన్రైజర్స్ హైదరాబాద్ 47 పరుగుల తేడాతో విక్టరీ అందుకుంది. అయితే ఈ మ్యాచ్ జరుగుతున్న సందర్భంగా సన్ రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య పాప వివాదంలో చిక్కుకున్నారు. అభిషేక్ శర్మ భయంకరంగా బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో ఎగిరి గంతేసిన కావ్య పాప.. ఓ 50 ఏళ్ల లేడీ వచ్చి షేక్ హ్యాండ్ ఇస్తే, అవమానించి పంపించింది. మొదట షేక్ హ్యాండ్ ఇస్తే తీసుకున్న కావ్య ( Kavya Maran), ఆ తర్వాత ఆ లేడీ ఆప్యాయంగా హగ్ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో ఆమెను వెనక్కి నెట్టేసిన కావ్య, మ్యాచ్ పైన ఫోకస్ చేసింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇది చూసిన క్రికెట్ అభిమానులు కావ్య పాపను ఉద్దేశించి విమర్శలు చేస్తున్నారు.
సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఉప్పల్ వేదికగా మంగళవారం రోజున బిగ్ ఫైట్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ సందర్భంగా అభిషేక్ శర్మ అద్భుతమైన బ్యాటింగ్ తో రెచ్చిపోయాడు. దీంతో కావ్య నిన్న ఫుల్ హుషారుగా కనిపించారు. ఈ క్రమంలోనే ఓ 50 ఏళ్ల ఆంటీ, కావ్య పాపకు షేక్ హ్యాండ్ ఇచ్చి.. హగ్ చేసుకునే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో ఆమెను వెనక్కి నెట్టేసిన కావ్య, అవమానించింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. దీనిపై క్రికెట్ అభిమానులు రకరకాలుగా పోస్టులు పెడుతున్నారు. కన్న తల్లినే కావ్య పాప నెట్టివేసిందని దారుణంగా పోస్టులు పెడుతున్నారు.
ఇలాంటి కావ్య పాపను ఐపిఎల్ నుంచి బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వాస్తవంగా వీడియోలో కనిపించిన లేడీ… కావ్య పాప తల్లి కాదు. ఆమె తమిళనాడుకు సంబంధించిన ఓ మహిళ. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు పైన ఉన్న అభిమానంతో స్టేడియానికి వచ్చారు. కానీ ఆమె కావ్య తల్లి అనుకొని కొంతమంది నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు. తల్లిని అవమానించిందని ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు. అయితే ఈ ట్రోల్స్ కు కావ్య పాప అభిమానులు కూడా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అసలు విషయం తెలుసుకొని పోస్టులు పెట్టండి అని మండిపడుతున్నారు. కాగా కావ్య పాప తల్లి పేరు కావేరి మారన్. ఈమె సన్ గ్రూప్ లో కీలక బాధ్యతలలో కొనసాగుతున్నారు. ఆమె తండ్రి పేరు కలానిథి మారన్ అన్న సంగతి తెలిసిందే.
?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==