E-Paper
Advertisement

సినిమా హిస్టరీలోనే అత్యంత భారీ బడ్జెట్… హైవోల్టేజ్ యాక్షన్ తో సాగే మాస్టర్ పీస్ సిరీస్

సినిమా హిస్టరీలోనే అత్యంత భారీ బడ్జెట్… హైవోల్టేజ్ యాక్షన్ తో సాగే మాస్టర్ పీస్ సిరీస్
Advertisement

War Series OTT : ప్రపంచం యుద్ధం అంచున ఉందన్న విషయం తెలిసిందే. పలు దేశాలు పలు కారణాలతో యుద్ధం అంటూ కొట్టుకు చస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రెండవ ప్రపంచ యుద్ధం నేపథ్యంలో వచ్చిన ఓ మాస్టర్ పీస్ సిరీస్ గురించి తెలుసుకుందాం. ‘బ్యాండ్ ఆఫ్ బ్రదర్స్’, ‘ది పసిఫిక్’ సిరీస్‌ల తర్వాత స్టీవెన్ స్పీల్‌బర్గ్, టామ్ హ్యాంక్స్, గారి గోయెట్జ్‌మాన్ కాంబినేషన్‌లో వచ్చిన మరొక ప్రతిష్టాత్మకమైన వార్ డ్రామా మినీ-సిరీస్ Masters of the Air (2024). మరి ఈ సిరీస్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది ? అనేది తెలుసుకుందాం పదండి.

ఆపిల్ టీవీలో స్ట్రీమింగ్

‘మాస్టర్ ఆఫ్ ది ఎయిర్’ సిరీస్ 9 ఎపిసోడ్ల విజువల్ వండర్ సిరీస్ అని చెప్పవచ్చు. ప్రస్తుతం భారతదేశంలో Apple TV+ లో ఈ సిరీస్ అందుబాటులోకి రానుంది. ఆస్టిన్ బట్లర్, కల్లమ్ టర్నర్, బారీ కియోగన్ వంటి హాలీవుడ్ టాప్ యాక్టర్స్ ఇందులో నటించడం విశేషం. ఈ స్టార్ యాక్టర్ తమ అద్భుతమైన నటనతో ఈ సిరీస్‌ కు ప్రాణం పోశారు. అత్యున్నత స్థాయి గ్రాఫిక్స్, రియల్ లైఫ్ వీరుల త్యాగాల కథతో రూపొందిన సిరీస్ ఇది. యుద్ధంలో వైమానిక దళం పోషించిన కీలక పాత్రను, చావుబతుకుల మధ్య వారి స్నేహాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించారు. డోనాల్డ్ ఎల్. మిల్లర్ పుస్తకం ఆధారంగా తెరకెక్కిన ఈ సిరీస్ లో, నాజీ జర్మనీపై ఆకాశంలో పోరాడిన అమెరికన్ వైమానిక దళానికి చెందిన ‘100th బాంబార్డ్‌మెంట్ గ్రూప్’ యదార్థ గాథను చూడాలంటే ఈ సిరీస్ పై ఒక లుక్కేయండి.

కథలోకి వెళ్తే…

Advertisement

రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికాకు చెందిన 100త్ బాంబింగ్ గ్రూప్ సైనికులు ఉంటారు. వీళ్ళంతా ఇంగ్లాండ్‌ లోని వైమానిక స్థావరానికి వెళతారు. వీరికి మేజర్లు జాన్ ‘గాాలే’ ఈగన్ (కల్లమ్ టర్నర్), గేల్ ‘బక్’ క్లెవెన్ (ఆస్టిన్ బట్లర్) సారథ్యంలో ఈ టీం పని చేస్తుంది. నాజీ జర్మనీ ఆయుధ కర్మాగారాలు, రైల్వే లైన్లు, నగరాలపై పగటిపూట బాంబుల దాడి చేయాలనేది ఈ మిషన్ ప్రధాన లక్ష్యం. అయితే శత్రువుల యాంటీ – ఎయిర్‌క్రాఫ్ట్ గన్స్, జర్మన్ ఫైటర్ జెట్ల దాడితో ఈ గ్రూప్‌ అతలాకుతలం అవుతుంది. ఫలితంగా ఈ గ్యాంగ్ లో చాలామంది చనిపోతారు. దీంతో ఈ గ్రూప్‌కు ‘బ్లడీ హండ్రెత్’ అనే పేరు వస్తుంది.

Also Read : ఈ 5 రోజుల్లో ఓటీటీలోకి ఏకంగా 17 తెలుగు సినిమాలు… ఇందులో మీరెన్ని చూశారు ?

Advertisement

ఈ సిరీస్‌ లో చూపించే వైమానిక యుద్ధాలు అద్భుతంగా ఉంటాయి. ప్రేక్షకులను సీటు అంచున కూర్చోబెడతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. 25,000 అడుగుల ఎత్తులో, మైనస్ డిగ్రీల గడ్డకట్టే చలిలో, ఆక్సిజన్ మాస్కులు పెట్టుకుని B-17 బాంబర్ విమానాలలో వారు చేసే పోరాటం గూస్ బంప్స్ తెప్పిస్తుంది. తోటి స్నేహితులు కళ్లముందే చనిపోతుంటే, ఆకాశంలో ఆ విమానాల్లో పైలట్లు అనుభవించే మానసిక ఒత్తిడి, భయాన్ని ఆడియన్స్ కూడా అనుభవిస్తారు. ఈ క్రమంలో కొందరు పైలట్లు పారాచూట్ల ద్వారా జర్మనీ సరిహద్దుల్లో దిగుతారు. మరి వీళ్ళు శత్రువుల కంటికి చిక్కకుండా ఎలా తప్పించుకున్నారు అనేది ఈ సిరీస్ కథ.

కథ మధ్యలో బక్, గాలే అనే ఇద్దరు జర్మన్ సైన్యానికి దొరికిపోతారు. ‘స్టాలాగ్ లుఫ్ట్ III’ అనే యుద్ధ ఖైదీల (POW) జైలులో వీళ్ళను బందీలుగా పడేస్తారు. అయితే ఈ ఇద్దరూ ఇతర మిత్రదేశాల సైనికులతో కలిసి జైలు నుండి ఎస్కేప్ అవ్వడానికి ప్లాన్ చేస్తారు. మరోవైపు మిగిలిన పైలట్లు జర్మనీ పతనం అవ్వడానికి తమవంతు ప్రయత్నం చేస్తారు. మరి చివరికి ఈ యుద్ధం ఎలా ముగిసిందో తెలియాలంటే సిరీస్ ను చూడాల్సిందే.

Tags

Related News

ఆకాశం నుంచి కురిసే యాసిడ్‌ వర్షం… ప్రాణాల కోసం పరుగులు…సైన్స్‌ ఫిక్షన్‌ డిజాస్టర్‌ థ్రిల్లర్‌

అర్ధరాత్రి పెట్రోల్‌ బంక్‌ దగ్గర మహిళ… స్నైపర్‌ గురితో గుండె గుభేల్… బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్‌

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×