E-Paper
Advertisement

Eng Vs Aus: ఆస్ట్రేలియా కొంపముంచిన Ms ధోని… వికెట్ సమర్పించుకున్న స్మిత్

Eng Vs Aus: ఆస్ట్రేలియా కొంపముంచిన Ms ధోని… వికెట్ సమర్పించుకున్న స్మిత్
Advertisement

Eng Vs Aus: యాషెస్ సిరీస్ {2025-26} లో భాగంగా ఆస్ట్రేలియా – ఇంగ్లాండ్ జట్ల మధ్య గబ్బా వేదికగా జరుగుతున్న 2వ టెస్ట్ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగుతోంది. మొదటిరోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ జట్టు తొమ్మిది వికెట్లు కోల్పోయి 325 పరుగులు చేసింది. ఇక రెండవ రోజు ఆటలో మిగిలిన ఒక వికెట్ ని కోల్పోయి మరో 9 పరుగులు జోడించి మొత్తం 334 పరుగులు చేసి ఆల్ అవుట్ అయ్యింది. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ లో జో రూట్ {138*} పరుగులు చేయగా.. ఓపెనర్ జాక్ క్రాలీ 76 పరుగులతో రెండవ హైయెస్ట్ స్కోరర్ గా నిలిచాడు. ఇక ఇన్నింగ్స్ చివర్లో జొఫ్రా ఆర్చర్ మెరుపులు మెరిపించి 38 పరుగులు చేశాడు.

Also Read: Eng vs Aus 2nd Test: మీ దుంపలు తెగ.. గ్రౌండ్ లోనే రొమాన్స్ చేస్తున్నారు కదరా!

Advertisement

 

6 వికెట్లు పడగొట్టిన స్టార్క్:

ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ ఏకంగా ఆరు వికెట్లు పడగొట్టాడు. తొలిరోజు 19 ఓవర్లు బౌలింగ్ చేసి 71 పరుగులు ఇచ్చి, 6 వికెట్లు పడగొట్టాడు. దీంతో టెస్ట్ క్రికెట్లో వరుసగా మూడు మ్యాచ్లలో 6 వికెట్ల ఘనత సాధించిన తొలి ఆస్ట్రేలియా పేసర్ గా రికార్డ్ సృష్టించాడు. అలాగే మైఖేల్ నేసర్, స్కాట్ బోల్యాండ్, డకెట్ చెరో వికెట్ పడగొట్టారు. ఇక రెండవ రోజు తమ తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టు ప్రస్తుతానికి 6 వికెట్లు కోల్పోయి 346 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో హెడ్ 33, వెదర్లాడ్ 72, లబుషేన్ 65, స్మిత్ 61, గ్రీన్ 45 పరుగులు చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లలో కార్సే 3, బెన్ స్టోక్స్, ఆర్చర్ చెరో వికెట్ పడగొట్టారు.

Advertisement

 

ఆస్ట్రేలియా కొంపముంచిన ధోని:

ఆస్ట్రేలియా – ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండవ టెస్టులో ఆసక్తికర సంఘటన ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. బెన్ స్టోక్స్ బౌలింగ్ చేస్తున్న సమయంలో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ దృష్టిని ఆకర్షించాడు స్టేడియంలో కూర్చున్న ఓ అభిమాని. స్టేడియంలో కూర్చున్న ఆ అభిమాని చేసిన సరదా హావాభావాలు స్మిత్ ని ఆకర్షించాయి. బంతి వేసేందుకు సిద్ధంగా ఉన్న స్టోక్స్ వైపు స్మిత్ చూస్తుండగా.. కింది స్టాండ్స్ లో ఉన్న ఓ అభిమాని ఓ కూల్ డ్రింక్ తో ఎంట్రీ ఇచ్చాడు.

Also Read: Ind vs Sa Odi Series: టీమిండియా ప్లేయర్లకు ఘోర అవమానం.. ఇలాంటి వెధవ పనులు చేసినందుకే కోహ్లీ లండన్ పారిపోయాడు !

అతడి వేషాధారణ, నడక, హవా భావాలు చూసి స్మిత్ కాసేపు అలాగే నిల్చుండిపోయాడు. ఆ అభిమాని భారీ గడ్డం, పొడవాటి జుట్టుతో, ఎల్లో టీ షర్ట్ లో కొంచెం కామెడీ టచ్ తో నడుచుకుంటూ వచ్చాడు. దీంతో అతడి పక్కన ఉన్న ప్రేక్షకులు కూడా నవ్వు ఆపుకోలేకపోయారు. ఈ సంఘటన జరిగిన కాసేపటికే స్మిత్ పెవిలియన్ చేరాడు. అయితే ఈ సరదా ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజెన్లు.. అతడు అచ్చం మహేంద్రసింగ్ ధోనిలా ఉన్నాడని.. మారువేషంలో వచ్చి స్మిత్ ని అవుట్ అయ్యేలా చేశాడని ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

 

 

 

View this post on Instagram

 

Related News

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

Big Stories

Advertisement
×