Sunil Gavaskar on Pak: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( ICC T20 World Cup 2026) నుంచి పాకిస్తాన్ ( IND vs PAK Match Boycott ) బహిష్కరించడం పై టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ( Sunil Gavaskar ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రోజుకో వేషం.. ఊటకో మాట… పాకిస్తాన్ ఎదవలు అందరూ తింగరి వాళ్లే అంటూ దారుణంగా ట్రోలింగ్ చేశాడు సునీల్ గవాస్కర్. టీమిండియాకు భయపడి, మ్యాచ్ ను పాకిస్తాన్ బాయ్ కాట్ చేసిందని చురకలు అంటించాడు సునీల్ గవాస్కర్. T20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ఫిబ్రవరి 15వ తేదీన ఇండియాతో జరిగే మ్యాచ్ ను బహిష్కరించింది పాకిస్తాన్. ఈ టోర్నమెంట్ లో ఆడతామని.. కానీ ఇండియాతో మాత్రం మ్యాచ్ ఆడబోమని వెల్లడించింది పాకిస్తాన్ ప్రభుత్వం. ఇలాంటి నేపథ్యంలోనే సునీల్ గవాస్కర్ దారుణంగా ఆడుకున్నారు.
టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ఇండియాతో జరిగే మ్యాచ్ ను పాకిస్తాన్ బహిష్కరించడంపై సునీల్ గవాస్కర్ ( Sunil Gavaskar ) తన స్టైల్ లో స్పందించారు. గతంలో పాకిస్తాన్ క్రికెటర్లు రిటైర్మెంట్ ప్రకటించిన అంశాన్ని గుర్తుచేస్తూ దారుణంగా ఆడుకున్నారు. అప్పట్లో పాకిస్తాన్ క్రికెటర్లు రిటైర్మెంట్ ప్రకటించి… నాలుగు రోజులు అయిన తర్వాత మళ్లీ క్రికెట్ ఆడుతామని యూటర్న్ తీసుకునేవారు అని గుర్తు చేశారు. పాకిస్తాన్ అభిమానులు తమ రిటైర్మెంట్ కోరుకోవడం లేదని.. ఇంకా ఇంకా క్రికెట్ ఆడాలని నంగనాచి మాటలు చెబుతూ, క్రికెట్ లోకి రీ-ఎంట్రీ ఇచ్చేవారని వెల్లడించారు సునీల్ గవాస్కర్.
కానీ పాకిస్తాన్ అభిమానులు మాత్రం, సదరు ప్లేయర్లు రిటైర్మెంట్ ప్రకటిస్తే సంబరపడిపోయేవారు కానీ, ఎవరు కూడా ఎమోషనల్ అయినవారు లేరు అంటూ వ్యాఖ్యానించారు. ఇప్పుడు టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో కూడా పాకిస్తాన్ మళ్లీ యూటర్న్ తీసుకోవడం గ్యారంటీ అంటూ హింట్ ఇచ్చారు. ఈ టోర్నమెంట్ లో ఇండియాతో మ్యాచ్ ఆడకపోతే పాకిస్తాన్ కు 300 కోట్ల వరకు నష్టం జరిగే ప్రమాదం పొంచి ఉందని చెప్పకనే చెప్పాడు సునీల్ గవాస్కర్. ఐసీసీ వార్నింగ్ ఇచ్చింది కాబట్టి, కచ్చితంగా యూటర్న్ తీసుకొని ఇండియాతో మ్యాచ్ ఆడేందుకు పాకిస్తాన్ సిద్ధమవుతున్నట్లు PCB స్పష్టం చేయడం గ్యారంటీ అంటూ పరువు తీశారు సునీల్ గవాస్కర్. ఇది ఇలా ఉండగా టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఫిబ్రవరి 15వ తేదీన మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే, ఈ మ్యాచ్ జరుగకపోతే ఇండియాకు 2 పాయింట్లు దక్కనున్నాయి. అటు పాకిస్తాన్ 2 పాయింట్లు కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది.
Sunil Gavaskar Absolutely Cooked Pakistan:
"We all know that when Pakistani cricketers retire, then after 4 days they take back their retirement. They say we have so many fans, our fans told us, No brother, you have to keep playing.
So everyone knows what problem there is in… pic.twitter.com/UYce5BjfxA
— GillTheWill (@GillTheWill77) February 1, 2026