E-Paper
Advertisement

Womens blind cricket: అంధుల క్రికెటర్లు ఇంత దారుణమా… కుళ్లిన పండ్లను తిని బ‌తికేస్తున్నారా?

Womens blind cricket: అంధుల క్రికెటర్లు ఇంత దారుణమా… కుళ్లిన పండ్లను తిని బ‌తికేస్తున్నారా?
Advertisement

Womens blind cricket: అంధుల భారత మహిళల క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. టి-20 ప్రపంచ కప్ 2025 {Blind T-20 World Cup 2025} టోర్నమెంట్ లో భారత జట్టు విశ్వ విజేతగా నిలిచింది. ఈ ఒక్క నెలలోనే వన్డే ప్రపంచ కప్ తో పాటు టి-20 వరల్డ్ కప్ కూడా భారత్ సొంతమైంది.

Also Read: WTC FINAL 2027: WTC ఫైన‌ల్స్ కు వెళ్లే ఛాన్సులు ఇంకా ఉన్నాయా? టీమిండియా ఎన్ని గెలిస్తే సాధ్యం అంటే

Advertisement

ఇటీవల భారత మహిళల జట్టు వన్డే వరల్డ్ కప్ సాధించగా.. ఆదివారం రోజు అంధ మహిళలు టి-20 ప్రపంచ కప్ ఛాంపియన్లుగా నిలిచారు. అంధుల విభాగంలో టీ-20 వరల్డ్ కప్ జరగడం ఇదే మొదటిసారి. అయితే మొదటి టి-20 ప్రపంచ కప్ నే భారత్ గెలుపొంది చరిత్ర సృష్టించింది.

 

అంధుల జట్టు కెప్టెన్ మన తెలుగమ్మాయె:

Advertisement

తొలి అంధుల మహిళల టి-20 ప్రపంచ కప్ గెలుచుకున్న జట్టుకు నాయకత్వం వహించింది మన తెలుగమ్మాయి కావడం గర్వకారణం. ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన దీపిక అంధుల మహిళా టి-20 కెప్టెన్ గా వ్యవహరించి.. భారత్ కి కప్ అందించింది. శ్రీ సత్యసాయి జిల్లా అమలాపురం మండలంలోని మారుమూల గ్రామమైన తంబాలహట్టికి చెందిన దీపిక.. వ్యవసాయ కూలీ పనులు చేసుకునే తిమ్మప్ప, చిత్తమ్మ దంపతుల కుమార్తె. దీపికకు ఐదు నెలల వయసులో ఆమె తల్లి చేతి వేలికి ఉన్న గోరు కంటికి గుచ్చుకోవడంతో శాశ్వతంగా చూపు కోల్పోయింది. దీంతో ఒంటికన్నుతోనే దీపిక విద్యాభ్యాసం కొనసాగించింది.

ఇక ఎనిమిదో తరగతి దాటిన తర్వాత దీపికకు క్రికెట్ పై ఆసక్తి పెరిగింది. ఎంతో కష్టపడి క్రికెటర్ అవ్వాలని భావించింది. సరిగ్గా అప్పుడే 2013లో జాతీయ అంధుల మహిళల క్రికెట్ జట్టు ప్రారంభమైంది. అయితే వీరి గ్రామం కర్ణాటక సరిహద్దుల్లో ఉండడంతో.. కర్ణాటక జట్టు తరఫున క్రికెట్ ఆడటం మొదలుపెట్టింది. కొద్ది రోజుల క్రితం జరిగిన అంధుల మహిళా టి-20 ప్రపంచ కప్ కు దీపిక కెప్టెన్ గా వ్యవహరించింది. లీగ్ దశలో పాకిస్తాన్, ఆస్ట్రేలియా పై దీపిక మెరుపు ఇన్నింగ్స్ ఆడి.. జట్టును ఫైనల్ కి తీసుకువెళ్ళింది. ఆ తర్వాత ఫైనల్ లో నేపాల్ ని ఓడించి కప్ గెలుపొందడంలో కీలక పాత్ర పోషించింది. దీపిక ప్రస్తుతం ముంబైలోని ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం చేస్తుంది.

 

కెప్టెన్ దీపిక కీలక వ్యాఖ్యలు:

అంధుల మహిళల టి-20 ప్రపంచ కప్ టోర్నమెంట్లో భారత్ ని ఛాంపియన్ గా నిలిపిన కెప్టెన్ దీపిక తాజాగా చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. టోర్నమెంట్ గెలిచిన అనంతరం భారతదేశానికి తిరిగి వచ్చిన కెప్టెన్ దీపిక మీడియాతో మాట్లాడుతూ.. “టి-20 ప్రపంచ కప్ లో భారత్ గెలవడం చాలా సంతోషంగా ఉంది. జనం విసిరే కుళ్ళిన పండ్లలో చెడు భాగాన్ని తీసేసి మిగతాది నేను, నా తోబుట్టువులు తినేవాళ్ళం.

Also Read: Smriti Mandhana: పలాష్ ముచ్చల్ కు మరో షాక్ ఇచ్చిన స్మృతి.. సోషల్ మీడియా పై సంచలన నిర్ణయం!

మా ఇంట్లోనే కాదు ప్రతి భారత ప్లేయర్ ఇంట్లో రోజుకు ఒక పూట భోజనం దొరకడం కూడా కష్టమే. ఇప్పటికీ మా కుటుంబాలలో పెద్దగా మార్పు లేదు”. అని కన్నీళ్లు పెట్టుకుంటూ ఎమోషనల్ అయ్యింది. దీంతో కెప్టెన్ దీపిక చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. దీపిక వ్యాఖ్యలు విన్న క్రీడాభిమానులు వెంటనే భారత క్రికెట్ నియంత్రణ మండలి స్పందించాలని, వారికి అండగా నిలవాలని డిమాండ్ చేస్తున్నారు.

Related News

ఎవ‌రెంత గింజుకున్నా, నేను రాజీనామా చేయ‌ను..న‌ఖ్వీ సంచ‌ల‌నం

ఒరేయ్ న‌ఖ్వీ? పాకిస్తాన్ జ‌ట్టును 9వ స్థానానికి దిగ‌జార్చావ్ క‌ద‌రా !

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఇండియాను వైట్ వాష్ చేస్తాం…రికీ పాంటింగ్ హెచ్చరిక

రిజ్వాన్ చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌…భ‌విష్య‌తుల్లో పాకిస్తాన్ తరఫున మళ్లీ ఆడ‌కుండా చేస్తా

రెండు టైటిల్స్ గెలిచినా, RCB ప్లేయ‌ర్లను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారు

మిస్ట‌ర్ భువీ..ఇక చాలు, అన్ని మూసుకుని రిటైర్మెంట్ ఇచ్చి ఇంట్లో కూర్చో

ఇలానే వదిలేస్తే, ఇమ్రాన్ ఖాన్ ఏ క్షణమైనా చావడం పక్కా..!

దున్న‌పోతుల్లా తిన‌డం త‌ప్ప‌…మా ద‌ద్ద‌మ్మ‌ల‌కు ఆడ‌టం చేత‌కాదు

Big Stories

Advertisement
×