E-Paper
Advertisement

WTC FINAL 2027: WTC ఫైన‌ల్స్ కు వెళ్లే ఛాన్సులు ఇంకా ఉన్నాయా? టీమిండియా ఎన్ని గెలిస్తే సాధ్యం అంటే

WTC FINAL 2027: WTC ఫైన‌ల్స్ కు వెళ్లే ఛాన్సులు ఇంకా ఉన్నాయా?  టీమిండియా ఎన్ని గెలిస్తే సాధ్యం అంటే
Advertisement

WTC FINAL 2027: స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన రెండు టెస్టుల సిరీస్ ఘోరంగా ఓడిన భారత్.. 0-2 తో వైట్ వాష్ కి గురైంది. ముఖ్యంగా గౌహతిలో జరిగిన రెండవ టెస్టులో ఏకంగా 408 పరుగుల పరాజయం భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో అతిపెద్ద రన్ తేడా ఓటమిగా నమోదయింది. గతంలో 2004లో నాగపూర్ లో ఆస్ట్రేలియా చేతిలో భారత జట్టు 342 పరుగుల తేడాతో ఓడిపోయింది.

Also Read: Smriti Mandhana: పలాష్ ముచ్చల్ కు మరో షాక్ ఇచ్చిన స్మృతి.. సోషల్ మీడియా పై సంచలన నిర్ణయం!

Advertisement

13 నెలల్లో ఒక జట్టు స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్ లో టీమిండియాని క్లీన్ స్వీప్ చేయడం ఇది రెండవసారి. ఈ వైట్ వాష్ ఫలితంగా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ {WTC} పాయింట్ల పట్టికలో స్థానం దిగజారింది. ముఖ్యంగా దాయాది దేశం పాకిస్తాన్ జట్టు తర్వాత 5వ స్థానానికి పడిపోవడం గమనార్హం. దీంతో భారత జట్టు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఆశలను దెబ్బతీసింది. ప్రస్తుతం భారత జట్టు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో {percentage of points} 48.15 గా ఉంది.

 

భారత్ ఇప్పటివరకు 9 టెస్టులు ఆడింది:

Advertisement

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్ {2025-27} లో భారత్ ఇప్పటివరకు 9 టెస్టులు ఆడింది. ఇందులో నాలుగు విజయాలు, నాలుగు పరాజయాలు ఒక టెస్ట్ డ్రా. ఇంగ్లాండ్ తో సిరీస్ డ్రా కావడం, ఆ తర్వాత స్వదేశంలో సౌత్ ఆఫ్రికా చేతిలో వైట్ వాష్ కి గురికావడం పాయింట్ల పట్టికలో భారత స్థితిని మరింత కఠినతరం చేసింది. ఇక సౌత్ ఆఫ్రికా విషయానికి వస్తే 25 సంవత్సరాల తర్వాత టీమిండియాతో టెస్ట్ సిరీస్ గెలుచుకోవడంతో పాయింట్ల పట్టికలో వారి స్థానం మరింత బలపడింది. దక్షిణాఫ్రికా ప్రస్తుతం ఆస్ట్రేలియా తర్వాత రెండవ స్థానంలో 75% పిసిటితో నిలిచింది. మరోవైపు న్యూజిలాండ్ జట్టు ఇప్పటికీ ఒక్క సిరీస్ కూడా ఆడలేదు. ఇక పాకిస్తాన్, శ్రీలంక ఒక్కో సిరీస్ ఆడగా.. టాప్ 2 జట్లు 2027 లో జరగనున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కీ అర్హత పొందుతాయి.

టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్స్ కి వెళ్లే ఛాన్సులు ఇంకా ఉన్నాయా..?

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్ కి అర్హత సాధించాలంటే భారత్ కి ఇంకా అవకాశాలు ఉన్నాయా..? ఇంకా ఎన్ని మ్యాచ్ లు గెలిస్తే ఇది సాధ్యమవుతుంది అంటే..? వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్ లో భారత్ కి ఇంకా మొత్తం తొమ్మిది టెస్టులు మిగిలి ఉన్నాయి. ఈ మ్యాచ్ లలో ఫలితాలు ఇలా ఉంటే తప్ప భారత్ కి ఫైనల్స్ కి వెళ్లే అవకాశాలు దక్కవు. అవేంటంటే…? భారత్ ఆడబోయే మరో 9 మ్యాచ్ లలో.. 9 మ్యాచ్లలో గెలిస్తే 74.1% తో ఫైనల్స్ కి చేరుతుంది.

Also Read: Gambhir: ఆసియా, చాంపియన్స్ ట్రోఫీ నేనే తీసుకువచ్చా.. దక్షిణాఫ్రికాతో ఓటమికి టీమిండియా ప్లేయర్లే కారణం, నా తప్పేం లేదు

ఒకవేళ 7 మ్యాచ్లలో విజయం సాధించి, 1 డ్రా, 1 పరాజయం పాలైతే.. 64.8% తో ఫైనల్స్ కి చేరుతుంది. ఇక 6 టెస్ట్ లలో విజయాలు సాధించి, 2 డ్రా లు, 1 టెస్ట్ లో ఓడితే.. 61.1% ఫైనల్స్ కి చేరుతుంది. ఇది కూడా కాకుండా ఆరు టెస్టులలో గెలుపొంది, 1 డ్రా, 2 టెస్ట్ లలో ఓడిపోతే.. 59.3% తో కూడా ఫైనల్స్ కి చేరుతుంది. అంటే ప్రాక్టికల్ గా టీమిండియా టాప్ 2 లోకి రావాలంటే కనీసం 6 టెస్టులు తప్పనిసరిగా గెలవాలి.

Related News

ఈ ద‌ద్ద‌మ్మకు టీమిండియాపై ఆడ‌టం చేత‌కాదు…స‌ల్మాన్ సెంచ‌రీపై బాజిద్ ఖాన్ ఫైర్‌

శ‌భాష్ స‌ల్మాన్‌…నీ దెబ్బ‌కు న‌ఖ్వీ గాడి రెండు చెంప‌లు వాచిపోయింటాయ్ ?

అస‌లు నీకు బుర్ర ఉందా ? ష‌న‌కా బ్యాటింగ్ పై గ్యారీ కిర్‌స్టెన్ సీరియ‌స్‌

ఆ పాట‌లు పెట్టి ధోని న‌న్ను రెచ్చ‌గొట్టేవాడు…వీరూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

బాబ‌ర్‌, షాహీన్‌, షాబాద్, హారిస్ రోజులు లెక్క‌బెట్టుకోవాల్సిందే…పాకిస్తాన్ నుంచి త‌రిమేసే టైమ్ వ‌చ్చింది!

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ పాకిస్తాన్ కు అందిస్తా..లేక‌పోతే త‌ల న‌రుక్కుంటా ?

డ‌బుల్ సెంచ‌రీ చేయ‌కుండా ద్రవిడ్ అడ్డుకున్నాడు..స‌చిన్ సంచ‌ల‌నం !

కావ్య పాప‌ పెళ్లికి పాకిస్తాన్ క్రికెట‌ర్లు…SRHను బ్యాన్ చేయాలంటూ మ‌ళ్లీ పోస్టులు ?

Big Stories

Advertisement
×